newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

పదిలక్షల కేసులను దాటిన భారత్.. ఒక్కరోజులో 33 వేల కేసులు

17-07-202017-07-2020 07:15:55 IST
2020-07-17T01:45:55.405Z17-07-2020 2020-07-17T01:45:51.989Z - - 12-08-2020

పదిలక్షల కేసులను దాటిన భారత్.. ఒక్కరోజులో 33 వేల కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక్కమాటలో చెప్పాలంటే కరోనా వైరస్‌ గుప్పిట్లో చిక్కుకొని భారత్‌ ఇప్పుడు విలవిలలాడుతోంది. నానాటికీ కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో శరవేగంగా 10 లక్షలకు చేరుకుని నిలిచి భయపెడుతోంది. భారత్‌లో ఒకే రోజు రికార్డు స్థాయిలో ఏకంగా 32,695 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 10,00,202కి చేరుకుందని గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్‌లో తొలి కరోనా కేసు జనవరి 30న కేరళలో నమోదైంది. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడిన మరణించినవారి సంఖ్య నేటికి 25 వేలను దాటింది 

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 606 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 24,915కి చేరుకుంది. అయితే కేసుల ఉధృతి ఎంత పెరుగుతున్నా రికవరీ రేటు 63.25%గా ఉండడం ఊరటనిస్తోంది. ఇప్పటివరకు 6,12,814 మంది వైరస్‌ నుంచి కోలుకుంటే యాక్టివ్‌ కేసులు 3,31,146గా ఉన్నాయి. వాస్తవానికి 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో కరోనాని బాగానే కట్టడి చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. రికవరీ రేటు 63.25శాతంగా ఉండడం సామాన్యమైన విషయం కాదన్నారు. మృతుల రేటు కూడా ఇతర దేశాలతో పోల్చి చూస్తే చాలా తక్కువగా అంటే 2.75%గా ఉందని చెప్పారు.  

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 99 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. మరో 1300 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. వైద్య సిబ్బంది మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రోగులకు చికిత్స అందించాల్సిన వైద్యులే అధికంగా కోవిడ్‌ బారిన పడుతూ ఉండడం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. 

మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఒక్క గురువారమే ఈ రాష్ట్రంలో 8,641 కొత్త కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,84,281కి పెరిగింది. అలాగే దేశం మొత్తం మీద అత్యధిక మరణాలు నమోదైన రాష్ట్రంగా కూడా మహారాష్ట్ర రికార్డు సృష్టించింది. గురువారం నాటికి 11,194 మంది కరోనా బారిన పడి మరణించారు.

తమిళనాడు కరోనా కేసులు అత్యధికంగా నమోదైనా రాష్ట్రాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. కరోనా వైరస్ ఈ రాష్ట్రంలో 1,56,369 మందికి సోకింది. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత 1,18,645 కేసులతో ఢిల్లీ మూడవ స్థానంలో నిలిచింది. కర్నాటకలో కరోనా కేసుల సంఖ్య గురువారం నాటికి 50వేలకు చేరుకుంది. ఒక్క గురువారమే 4,169 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇంతవరకు అమెరికా 34,99,771 పాజిటివ్ కేసులతో ప్రథమ స్థానంలో నిలబడగా బ్రెజిల్ 19,66,748 కేసులతో రెండో స్థానంలో ఉంది. భారతదేశం 10 లక్షల పైబడిన కేసులతో మూడో స్థానం చేరుకుంది.

మార్చి 2021నాటికి భారత్‌లో 6 కోట్ల మందికి వైరస్

కరోనా కేసుల తీవ్రతపై ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్‌సీ) కొన్ని అంచనాలు విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో కనీసం 37.4 లక్షల కేసులు నమోదవుతాయని, అదే వైరస్‌ అడ్డూ అదుపూ లేకుండా విస్తరిస్తే 6.18 కోట్ల వరకు కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. 2020 మార్చి 23 నుంచి జూన్‌ 18 వరకు దేశంలో కరోనా వైరస్‌ విస్తరణ, రెట్టింపు అవడానికి పట్టే రోజులు, వివిధ రాష్ట్రాలకి పాకుతున్న తీరుతెన్నులు వంటివి పరిగణనలోకి తీసుకొని ఈ అంచనాలు వేసింది. సెప్టెంబర్‌ రెండోవారం లేదంటే అక్టోబర్‌ మొదటివారంలో కరోనా కేసులు అత్యధిక స్థాయికి చేరుకుంటాయని ఆ సంస్థ తెలిపింది. వారంలో మూడు రోజులు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలు తప్పదని ఆవిధంగా మాత్రమే కరోనాని కట్టడి చేయవచ్చునని పేర్కొంది.

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   4 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   13 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle