newssting
BITING NEWS :
మహారాష్ట్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికతో కూడిన మహావికాస్ ఆఘాదీ ప్రభుత్వం స్వయంగా కుప్పకూలిపోతుందన్న ఫడణవీస్. కూటమిని అధికారం నుంచి తొలగించడానికి బీజేపీ ఏం చేయనవసరం లేదని చెప్పిన ఫడణవీస్ * బీహార్ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయం. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించేందుకు వీలుగా 30వేల మంది కేంద్ర బలగాల జవాన్లతో ఏర్పాటు చేయనున్న బందోబస్తు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో కేంద్ర అదనపు బలగాలతో రక్షణ * చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల అగ్రరాజ్యంలోని దిగ్గజ కంపెనీల ఆగ్రహం. 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో కేసులు వేసిన 3,500 కంపెనీలు * కర్ణాటక రాష్ట్రం కలబుర్గి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సావళగి క్రాస్‌ అళంద రోడ్డుపై తెల్లవారుజామున రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి. నెలలు నిండిన మహిళకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రమాదం * 286వ రోజుకు చేరుకున్న అమరావతి రాజధాని రైతుల ఉద్యమం. గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం * ఏపీ‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి. బ్రహ్మోత్సవాల అనంతరం స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వెల్లంపల్లి * ప్రకాశం బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న కృష్ణా నది. కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. ప్రాజెక్టు వద్ద 6,65,925 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచన * తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ * యాదాద్రి-భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం ప్రొద్దుటూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాని కుప్పకూలిన పెంకుటిల్లు. అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు. శబ్దాన్ని గమనించిన నలుగురు కుటుంబ సభ్యులు వెంటనే బయటకు రావడంతో తప్పిన ప్రాణాపాయం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. 20 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. 4,19,454 క్యూసెక్కులుగా ఉన్న ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 310.252 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు * రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు తెలంగాణ ఎంసెట్ పరీక్ష. ఉదయం, మధ్యాహ్నం రెండు షెషన్‌లలో పరీక్ష నిర్వహణ. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం 84 సెంటర్లలో పరీక్షను నిర్వహణ. తెలంగాణలో 67, ఆంధ్రాలో 17 పరీక్షా కేంద్రాలు

న్యాయబద్ధంగా టీకా పంపిణీలో భారత్‌కు గొప్ప పాత్ర.. బిల్ గేట్స్

16-09-202016-09-2020 09:03:30 IST
2020-09-16T03:33:30.597Z16-09-2020 2020-09-16T03:33:21.240Z - - 29-09-2020

న్యాయబద్ధంగా టీకా పంపిణీలో భారత్‌కు గొప్ప పాత్ర.. బిల్ గేట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచంలో ఎవరు ముందుగా కరోనా వైరస్ నిరోథక టీకా కనిపెట్టినా, దాని ఉత్పత్తి, పంపిణీల్లో అత్యంత కీలకమైన పాత్ర భారతదేశానికే దక్కుతుందని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారు చేయడానికి ఎంత ప్రాముఖ్యత ఉందో దాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలకూ చేరవేయడానికి చాలా ప్రాధాన్యత ఉందని, కరోనా నియంత్రణకు అదే మూలమవుతుందని. భారత్ ఇక్కడే యావత్ ప్రపంచానికీ దిశానిర్దేశం చేయగలదని బిల్ గేట్స్ కొనియాడారు.

బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా బిల్‌గేట్స్‌ కరోనా టీకా తయారీకి తనవంతు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం భారీ ఎత్తున టీకాలు తయారు చేయగల దేశాల్లో భారత్‌ ఒకటని, ఎవరికి ఎన్ని టీకాలు అన్న ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉందని చెప్పారు. కోవిడ్‌ కారక కరోనా వైరస్‌ను కట్టడి చేసే టీకా తయారీలో భారత్‌ చాలా కీలకమైన పాత్ర పోషించనుందని బిల్‌గేట్స్‌ వ్యాఖ్యానించారు. 

టీకా తయారు చేయడంతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటికీ దాన్ని చేరవేయడం కరోనా నియంత్రణలో ముఖ్యమైందని స్పష్టం చేశారు. అందరికీ న్యాయబద్ధంగా టీకా పంపిణీ అయ్యే విషయంలో భారత్‌ సాయం చేస్తుందని భావిస్తున్నామని, ధనికులకు ముందుగా టీకా అందించడం కాకుండా అత్యవసరమైన వారికి ఇవ్వడం ద్వారా ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని గేట్స్‌ వివరించారు. 

ప్రపంచ వ్యాప్తంగా పేదరికం నిర్మూలనకు, వ్యాధులను ఎదుర్కొనేందుకు గేట్స్‌ ఇప్పటికే కోటానుకోట్ల డాలర్లు దానం చేసిన విషయం తెలిసిందే. కరోనా టీకా విషయంలోనూ గేట్స్‌ ఆ టీకాను తయారు చేస్తున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌తో ఒక ఒప్పందం చేసుకున్నారు. వ్యాక్సీన్‌ తయారీ విషయంలో సీరమ్‌తోపాటు, బయలాజికల్‌ ఈ, భారత్‌ బయోటెక్‌ సంస్థల సామర్థ్యంపై మాట్లాడారు. టీకా ప్రయోగాల్లో కొన్ని సానుకూల ఫలితాలు వచ్చాయని, ప్రస్తుతం టీకాను ఎంత చౌకగా తయారు చేయవచ్చన్న అంశంపై దృష్టి పెట్టడం ముఖ్యమని చెప్పారు.

కోవిడ్-19 వాక్సిన్ భారత్‌లో వచ్చే సంవత్సంరం ఉత్పత్తి అవుతుందని ఆశిస్తున్నట్లు గేట్స్ చెప్పారు. భారత్‌ ఎంత త్వరగా వాక్సిన్ రూపొందింస్తే ప్రపంచానికి అంతమంచిదని, భారత్ కనిపెట్టే వ్యాక్సిన్ అతి సమర్థకంగా ఉంటుందని, అదేసమయంలో అత్యంత సురక్షితంగా ఉంటుందని కూడా బిల్ గేట్స్ పేర్కొన్నారు. 

కాగా కరోనా వైరస్ నిరోధానికి రెండు డోస్‌ల టీకా సరిపోతుంది అనుకున్నట్లయితే ప్రపంచానికి తక్షణ ప్రాతిపదికన 15 బిలియన్ల (1500 కోట్లు) డోసుల వ్యాక్సిన్ అవసరమవుతుందని అయిదు అంతర్జాతీయ సంస్థలతో కలిసి భారత్‌లో వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో భాగమైన ఎస్ఐఐ సంస్థ డైరెక్టర్ పూనవల్లా పేర్కొన్నారు.

 

అన్ లాక్ 5.0...కరోనా వ్యాప్తికి ఆహ్వానం కానుందా?

అన్ లాక్ 5.0...కరోనా వ్యాప్తికి ఆహ్వానం కానుందా?

   10 hours ago


ఢిల్లీలో ట్రాక్టర్ తగలబెట్టిన రైతులు.. ప్రభుత్వం పట్టించుకునేనా

ఢిల్లీలో ట్రాక్టర్ తగలబెట్టిన రైతులు.. ప్రభుత్వం పట్టించుకునేనా

   13 hours ago


గడ్డకట్టే చలిలో పోరుకు భారత్ సైన్యం రెడీ..

గడ్డకట్టే చలిలో పోరుకు భారత్ సైన్యం రెడీ..

   16 hours ago


ఆదివాసీలపై అంతటి దారుణాలా..!

ఆదివాసీలపై అంతటి దారుణాలా..!

   27-09-2020


ఓ వైపు ఎన్డీయేకు పార్టీలు దూరం.. మరో వైపు వ్యవసాయ బిల్లు ఆమోదం

ఓ వైపు ఎన్డీయేకు పార్టీలు దూరం.. మరో వైపు వ్యవసాయ బిల్లు ఆమోదం

   27-09-2020


అక్టోబర్ 1 నుండి సినిమా థియేటర్లు ఓపెన్

అక్టోబర్ 1 నుండి సినిమా థియేటర్లు ఓపెన్

   27-09-2020


బీజేపీ సీనియర్ నేత జశ్వంత్‌ సింగ్ ఇక లేరు ‌

బీజేపీ సీనియర్ నేత జశ్వంత్‌ సింగ్ ఇక లేరు ‌

   27-09-2020


మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ఇంకా నిరీక్షించాలా.. మోదీ విమర్శ

మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ఇంకా నిరీక్షించాలా.. మోదీ విమర్శ

   27-09-2020


గొప్ప కూతురే.. తండ్రి లూడోలో మోసం చేశాడని కోర్టుకెక్కింది

గొప్ప కూతురే.. తండ్రి లూడోలో మోసం చేశాడని కోర్టుకెక్కింది

   27-09-2020


వ్యాక్సిన్ కొనుగోలుకు 80 వేల కోట్లు అవసరం.. సీరమ్ సీఈవో వెల్లడి

వ్యాక్సిన్ కొనుగోలుకు 80 వేల కోట్లు అవసరం.. సీరమ్ సీఈవో వెల్లడి

   27-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle