newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

న్యాయం ప్రతీకారబాటలో నడవద్దు.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

08-12-201908-12-2019 10:14:36 IST
Updated On 11-12-2019 12:31:16 ISTUpdated On 11-12-20192019-12-08T04:44:36.292Z08-12-2019 2019-12-08T04:44:29.999Z - 2019-12-11T07:01:16.664Z - 11-12-2019

న్యాయం ప్రతీకారబాటలో నడవద్దు.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యాయం అనేది సత్వరం అందించే అంశం కానేకాదని, అది ఎన్నడూ ప్రతీకార రూపంలోకి మారకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే స్పష్టం చేశారు. తెలంగాణలో డాక్టర్ దిశపై హత్యాచారం చేసిన నలుగురు ముష్కరులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన 24 గంటల లోపే చీఫ్ జస్టిస్ దాన్ని ఖండిస్తున్న రీతిలో తన వైఖరిని తెలియపర్చారు. నేర వ్యవహారాల విచారణను ముగించడంలో మన దేశ న్యాయవ్యవస్థ తన వైఖరిని పున: పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కానీ అలా మారేటప్పుడు దాని పర్యవసానాలు, వైఖరి గురించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పాత చర్చనే కొత్త రూపంలో రగిలించాయి. నేరస్థుల విచారణను ముగించడంలో న్యాయవ్యవస్థ అవలంబిస్తున్న జాప్యాన్ని, వైఖరిని నేర న్యాయ వ్యవస్థ తప్పక పరిశీలించాల్సిందే అనడంలో సందేహం లేదని రాజస్థాన్ హైకోర్టులో జరిగిన కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ తెలిపారు. 

దేశంలోని న్యాయస్థానాల్లో పెండిగ్ కేసులు కోట్లలో ఉన్నాయని, ప్రస్తుతం ఉన్న చట్టాలను బలోపేతం చేసి న్యాయవివాదాలను, కేసులను సులభంగా, త్వరగా, కక్షిదారులకు సంతృప్తికరంగా ఉండేలా న్యాయ వ్యవస్థ మార్పులు చేసుకోవాలని సీజే పేర్కొన్నారు. 

కానీ అదేసమయంలో న్యాయం సత్వరం, తొందరగా లభించడం అసాధ్యమని చీఫ్ జస్టిస్ అన్నారు. పైగా న్యాయం ప్రతీకార రూపం తీసుకోకూడదన్నారు. ప్రతీకారంగా మారినప్పుడు న్యాయం తన గుణాన్ని కోల్పోతుందని నా నమ్మకం. . న్యాయవ్యవస్థ స్వీయదిద్దుబాటు చర్యలను చేపట్టాలి కానీ దానిపై జరిగే చర్చను బహిరంగ పర్చకూడదు అని సీజే సూచించారు.

వాజ్యాలపై విచారణకు ముందు మధ్యవర్తిత్వాన్ని తప్పనిసరిగా అమలుపర్చాలని, దీనివల్ల న్యాయ విచారణ ప్రక్రియనుంచి తప్పించుకోవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించారు. నేర విచారణను వేగవంతంగా సాగించాల్సిన పద్ధతులను మనం కనుగొనాలి. ఆ క్రమంలో అవి నేరాలను అరికట్టగలగాలి. వ్యాజ్యాలకు ముందు మధ్యవర్తిత్వానికి ప్రయత్నించడంపై ఇప్పటికే తగిన చట్టాలు ఉన్నాయని సీజే చెప్పారు.

శంషాబాద్ సమీపంలో పశువైద్యురాలు దిశపై దారుణ హత్యాచారం అనంతరం సమాజంలోని అన్ని వర్గాలు రేపిస్టులకు తక్షణం మరణశిక్ష విధించి అమలు చేయాలని డిమాండ్ చేస్తుండటం పోలీసు, న్యాయవ్యవస్థలను తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. అత్యాచారం, హత్య కేసుల్లో బాధితులకు తక్షణ న్యాయం చేయాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వస్తున్నాయి. కొన్నిచోట్ల నిందితులపై దాడులు కూడా చేస్తున్నారు. 

‘‘నా కుమార్తె మృతికి కారణమైన దోషులను హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్‌ తరహాలో చంపేయాలి. లేదా, వెంటనే ఉరి తీయాలి. అదే నాకు ఓదార్పు’’ అని ఉన్నావ్‌ బాధితురాలి తండ్రి అన్నారు. తనకు ఎటువంటి ఆర్థిక సాయం అవసరం లేదని నిందితుల మరణమే తనకు ఓదార్పని వ్యాఖ్యానించారు. ఆమెను దారుణంగా చంపేసిన వారికి బతికే హక్కు లేదని, వారిని వెంటనే ఉరితీయాలని లేదా ఎన్‌కౌంటర్‌ చేయాలని బాధితురాలి సోదరుడు డిమాండ్‌ చేశాడు. మధ్యప్రదేశ్‌లో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని ఇండోర్‌ కోర్టు ప్రాంగణంలోనే న్యాయవాదులు చితకబాదారు.

దేశవ్యాప్తంగా రేపిస్టులపై తీవ్ర నిరసనలు చెలరేగుతున్న నేపథ్యంలో న్యాయం కోసం డిమాండ్ ప్రతీకార రూపం తీసుకోవద్దని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హితవు చెప్పడం గమనార్హం.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle