newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

నో ఇంటర్నెట్ .. నేతల హౌస్ అరెస్ట్.. కాశ్మీర్లో పరిస్థితి అంతేనా?

15-02-202015-02-2020 09:09:52 IST
2020-02-15T03:39:52.291Z15-02-2020 2020-02-15T03:39:46.536Z - - 12-08-2020

నో ఇంటర్నెట్ .. నేతల హౌస్ అరెస్ట్..   కాశ్మీర్లో పరిస్థితి అంతేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాశ్మీర్లో మారని పరిస్థితులు

ఇంటర్నెట్ కోసం జనం ఇబ్బందులు

సరిగా అందుబాటులోకి రాని మొబైల్ సర్వీసులు

కొన్ని చోట్ల కర్ఫ్యూ వాతావరణం

ఉపాధి కోల్పోయిన కూలీల

రైతుల పరిస్థితి అగమ్యగోచరం

ఒమర్ అబ్దుల్లాకు దొరకని ఉపశమనం

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో తాజాపరిస్థితులు ఇవే. తాజాగా గృహ నిర్బంధంలో ఉన్న నేతలకు ఇప్పుడప్పుడే ఉపశమనం లభించే అవకాశాలే కనిపించడం లేదు. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఒమర్ అబ్దుల్లా నిర్బంధాన్ని సవాల్ చేస్తూ ఆయన సోదరి సారా అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. 

ఈ వ్యవహారంపై జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగానికి వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. ప్రజా భద్రత చట్టం కింద ఒమర్ అబ్దుల్లా నిర్బంధం సరైనదేనా అనే అంశంలో విచారణను చేపట్టిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వాయిదా వేసింది. అప్పటివరకూ ప్రస్తుతం వున్న పరిస్థితే కొనసాగనుంది. ఒమర్ అబ్దుల్లాను తక్షణమే కోర్టులో హాజరుపరిచి, ఆయనను విడుదల చేయాలని ఆయన సోదరి సారా అబ్దుల్లా తన పిటిషన్‌లో కోరిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే తమకు న్యాయం జరుగుతుందని, తన సోదరుడు ఒమర్ అబ్దుల్లా త్వరలోనే విడుదలవుతారని సారా ఆశాభావంతో వున్నారు. సారా తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ స్వేచ్ఛకు సంబంధించినదని తక్షణమే విచరణకు చేపట్టాలని కపిల్ సిబల్ చేసిన వినతిని తోసిపుచ్చింది సుప్రీకోర్టు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేశాక అక్కడి పరిస్థితులు అదుపులోకి రాలేదు.

ముందు జాగ్రత్త చర్యగా  2019, ఆగస్టు 5న మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా సహా ఒమర్ అబ్దుల్లాను గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులకు సహకరించేవారు, రాళ్ల దాడులకు పాల్పడేవారిపై ప్రయోగించే ప్రజా భద్రత చట్టం కింద వీరిని నిర్బంధంలో ఉంచింది. దీంతో వారి రూపం మారిపోయింది. వారిని గుర్తుపట్టలేనంతగా తయారయ్యారు. మరోవైపు రెండురోజుల క్రితం ఆకస్మాత్తుగా మొబైల్‌ ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు. వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ ఆరోగ్య పరిస్థితిపై వదంతులు చెలరేగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. 

గిలానీ ఆరోగ్యం క్షీణించిందని సోషల్‌ మీడియాలో కొందరు వ్యక్తులు పోస్టులు పెట్టడంతో మొబైల్‌ ఇంటర్‌నెట్‌ సేవలు నిలిపివేసింది. అలాగే శాంతి భద్రతలను అదుపు తప్పకుండా ఉండేందుకు కశ్మీర్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మొహరించింది. మరోవైపు గిలానీ ఆరోగ్యంపై అతని కుటుంబ సభ్యులు స్పందించారు. గిలానీ కొద్దిపాటి అనారోగ్యానికి గురయ్యారని.. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. 

 

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   10 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   10 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   21 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle