newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

నేరచరిత్ర చెప్పాల్సిందే... పార్టీలకు సుప్రీం ఝలక్

13-02-202013-02-2020 13:06:50 IST
2020-02-13T07:36:50.071Z13-02-2020 2020-02-13T07:36:44.590Z - - 07-08-2020

నేరచరిత్ర చెప్పాల్సిందే... పార్టీలకు సుప్రీం ఝలక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా రాజకీయాల్లో నేరచరిత్ర వున్నవారు ఎక్కువైపోతున్నారు. వివిధ నేరాలు చేసి దర్జాగా తిరిగేస్తున్నారు. ఎన్నికల టైంలో వారే మళ్ళీ నామినేషన్లు వేసి మరీ ప్రజాప్రతినిధులు అయిపోతున్నారు. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం రాజకీయ పార్టీలకు షాకిచ్చింది. ఆయా పార్టీలు తమ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే నేరచరిత్ర కలిగిన అభ్యర్ధుల గురించి పూర్తిసమాచారాన్ని పార్టీ వెబ్‌సైట్‌లు, ప్రింట్‌ మీడియా ద్వారా బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాజకీయ పార్టీలను ఆదేశించింది.

అభ్యర్ధులపై దాఖలైన కేసులు, అభియోగాలు, విచారణ ఏ దశలో ఉంది అనే వివరాలను సమగ్రంగా వెల్లడించాలి. దీంతో పాటు అలాంటి అభ్యర్ధులను ఎందుకు ఎంపిక చేశారో వివరణ కూడా ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. సదరు అభ్యర్థిని ఎంపిక చేసిన మూడు రోజుల్లోగా ఎన్నికల కమిషన్‌కు కూడా ఈ వివరాలను నివేదించాలని తెలిపింది. ఈ సమాచారాన్ని తమ అధికారులు ఇవ్వకపోవడం లేదా ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేయకపోయినా ఎన్నికల కమిషన్‌ కోర్టు ధిక్కార చర్యలను చేపట్టవచ్చని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. 

కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సగానికి పైగా ఎమ్మెల్యేలు నేరచరితను కలిగి ఉన్న క్రమంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను వెలువరించింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో అభ్యర్ధులు తమపై దాఖలైన కేసులు, జైలు శిక్ష అనుభవిస్తే ఆయా వివరాలను పత్రికలు, టీవీ ఛానెళ్ళలో ప్రకటించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఒకవేళ అభ్యర్ధులు తమపై దాఖలైన కేసులను, వాటి వివరాలను అఫిడవిట్లో, ప్రకటనలో దాచిపెడితే వారిపై అనర్హత వేటు వేసేందుకు కూడా అవకాశం కల్పించింది. 

నేరచరితుల సంఖ్య రెట్టింపు

2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోటీచేసిన వారిలో రెట్టింపు మంది నేరచరిత్ర కలిగిన వారే వున్నారు. ఈసారి మూడింట రెండువంతుల మందిపై అభియోగాలున్నాయి. చిన్న నేరాల నుంచి అత్యాచారాల వరకూ వీరిపై కేసులు వున్నాయి. తొమ్మిదిమంది దోషులుగా తేలారని, ఒకరు మర్డర్ కేసులో దోషి. 37 మంది ఎమ్మెల్యేలపై అత్యాచారం, హత్యాయత్నం తదితర తీవ్ర ఆరోపణలు వున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తెలిపింది.

నామినేషన్లు వేసేటప్పుడే 43 మంది తమ అఫడవిట్లలో నేరచరిత్రను ప్రస్తావించారు. 2015లో వీరు 24మందే వున్నారు. ఆప్ ఎమ్మెల్యేల్లో 38 మంది, బీజేపీ ఎమ్మెల్యేలలో ఐదుగురికి నేరచరిత్ర వుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లకు పడగలెత్తినవారే. ఒక్కరు కూడా సామాన్యుడు లేకపోవడం గమనార్హం. 62 మంది ఆప్ ఎమ్మెల్యేల్లో 45 మంది కోటీశ్వరులు. 74 శాతం మంది ఎమ్మెల్యేలు సంపన్నులే కావడం గమనించాల్సిన అంశం. 

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   an hour ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   4 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   4 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   5 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   05-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle