newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నేపాల్ ప్రధానిపై నెటిజన్ల జోకులు.. రాముడితో ఆటలా?

15-07-202015-07-2020 16:36:42 IST
Updated On 15-07-2020 18:04:54 ISTUpdated On 15-07-20202020-07-15T11:06:42.741Z15-07-2020 2020-07-15T11:06:40.735Z - 2020-07-15T12:34:54.836Z - 15-07-2020

నేపాల్ ప్రధానిపై నెటిజన్ల జోకులు.. రాముడితో ఆటలా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హిందువుల ఆరాధ్య దైవమైన‌ శ్రీరాముడు నేపాల్ దేశ‌స్థుడంటూ ఆ దేశ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలి చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌పై భార‌తీయులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. 'అయ్యో.. రాముడేం ఖ‌ర్మ‌, విశ్వంలో ఉన్న అన్ని గ్ర‌హాలు మీవే'నంటూ సెటైర్లు  వేస్తున్నారు. కాగా సోమ‌వారం నేపాల్ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలి సాంస్కృతికంగా మేం అణచివేతకు గురయ్యాం. రాముని జ‌న్మ‌స్థానంగా చెప్పుకుంటున్న అయోధ్య ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో లేదు, అది నేపాల్‌లోని బిర్గుంజ్ ద‌గ్గ‌ర్లో గ్రామం. ఇప్పుడు భార‌త్‌లో ఉన్న అయోధ్య క‌ల్పితం అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. 

దీనిపై భార‌తీయ ప్ర‌జ‌లు ట్విట‌ర్‌లో ఓలిని విమ‌ర్శిస్తూ త‌మ‌దైన శైలిలో చుర‌క‌లంటిస్తున్నారు. ప్ర‌స్తుతమున్న నేపాల్ 2025క‌ల్లా ప్ర‌పంచ దేశాల‌ను ఆక్ర‌మించుకుంటుంది. ఆ త‌ర్వాత 2030 క‌ల్లా అంత‌రిక్షంలోని గ్ర‌హాల‌ను, అనంత‌రం అంత‌రిక్షాన్ని, మొత్తం అనంత విశ్వాన్నే ఆక్ర‌మించు కుంటుంద‌ని ఓ నెటిజ‌న్ పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో నేపాల్  ప్ర‌ధాని ఇలా అంటారు.. న్యూయార్క్ అమెరికాలో లేదు, నేపాల్‌లో ఉంది. అంతెందుకు ఆస్ట్రేలియా కూడా నేపాల్‌దే. టోక్యో, పారిస్ లండ‌న్, బెర్లిన్‌, సూడాన్‌, బ్యాంకాక్‌, లాస్ వెగాస్‌, ఇస్లామాబాద్ అన్నీ నేపాల్‌వే. నేపాల్‌వాసినైనందుకు నాకు గ‌ర్వంగా ఉంది, ఆయన్ను అలాగే వ‌దిలేస్తే రావ‌ణుడు చైనా, గౌత‌మ్ బుద్ధుడు రష్యా, మ‌హ‌వీర్ నార్త్ పోల్ నుంచి వ‌చ్చాడంటారు ‌అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. రాముడు నేపాల్ వాస్త‌వ్యులా.. ఇదెప్పుడు జ‌రిగింది అంటూ మీమ్స్‌రాయుళ్లు ఫ‌న్నీ క్యాప్ష‌న్‌లతో చెల‌రేగిపోతున్నారు. 

వాల్మీకి ఆశ్ర‌మం కూడా నేపాల్‌లోనే ఉంద‌ని, ద‌శ‌రథుడు త‌మ దేశాన్ని పాలించేవాడ‌ని, అత‌ని కొడుకు రాముడు కూడా ఇక్క‌డే పుట్టాడ‌ని ఓలి.. వాదించ‌గా వాటిని భార‌తీయులు కొట్టిపారేశారు.

విషయానికి వస్తే.. భారత భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవేనంటూ వివాదం రేపిన నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అసలైన అయోధ్య నేపాల్‌లో ఉంది. శ్రీరాముడు నేపాల్‌ దేశస్తుడు’ అని ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘సాంస్కృతికంగా మేం అణచివేతకు గురయ్యాం. వాస్తవాలు మరుగునపడ్డాయి. మా సీతకు భారతీయ యువరాజు రాముడితో వివాహం అయిందని మేం నమ్ముతున్నాం. అయితే, అప్పటి అయోధ్య భారత్‌లో లేదు. అది నేపాల్‌లోని బిర్గుంజ్‌ దగ్గర్లో గ్రామం. భారత్‌లో ఇప్పుడున్న అయోధ్య కల్పితం’అని పేర్కొన్నారు. 

అంతేకాకుండా ఎలాంటి క‌మ్యూనికేష‌న్ లేని కాలంలో సీత‌ను వివాహం చేసుకోవ‌డానికి రాముడు జ‌న‌క్‌పూర్‌కు ఎలా వ‌చ్చాడంటూ ఓలి ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుత భార‌త‌దేశంలోని ఆయోధ్య నుంచి రాముడు జ‌న‌క్‌పూర్‌కు రావ‌డం అసాధ్య‌మంటూ పేర్కొన్నాడు. 

నేపాల్‌ కొత్త రాజకీయ మ్యాప్‌ను ప్రచురించడంతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న సమయంలో ఓలి ఈ విషయం తెరపైకి తేవడం గమనార్హం. తనను పదవీచ్యుతుడిని చేసేందుకు భారత్‌ ప్రోద్బలంతో ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన ఇటీవల ఆరోపణలు చేశారు. ప్రధాని ఓలి తాజా వ్యాఖ్యలపై అధికార పార్టీ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని ప్రచండ స్పందించారు. భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు రాజకీయంగా గానీ, దౌత్యపరంగా గానీ సరికావన్నారు.

రాముడి జ‌న్మ‌స్థ‌లం అయోధ్య నేపాల్‌లోనే ఉంద‌ని, శ్రీరాముడు నేపాల్ దేశ‌స్తుడంటూ ప్ర‌క‌టించిన నేపాల్ ప్ర‌ధానిపై విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీఎం ఓలి కి మ‌తి భ్ర‌మించి ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని కాంగ్రెస్ నాయ‌కుడు అభిషేక్ మను సింగ్వి ఫైర్ అయ్యారు. చైనా ప్ర‌ధాని ఆదేశాల మేర‌కే ఓలీ ఇలాంటి నీతిమాలిన ఆరోణ‌లు చేస్తున్నారంటూ దుయ్యబ‌ట్టారు. గ‌తంలోనూ భార‌త భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు త‌మ‌వేనంటూ నేపాల్ ప్ర‌ధాని ఓలీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇప్ప‌డు రాముడు నేపాలీ దేశ‌స్తుడంటూ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

నేపాల్‌ ప్రధాని కేపీ శ‌ర్మ ఓలీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అయోధ్య రామునిపై మాట్లాడే హక్కు నేపాల్‌ ప్రధానికి లేదన్నారు. రాముని జన్మస్థలం ముమ్మాటికీ అయోధ్యేనని ఆయన అన్నారు. చైనా మెప్పుకోసం నేపాల్ ప్రధాని లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ‘‘దమ్ముంటే నేపాల్ లో ఉన్న అనేక హిందూ దేవాలయాలను పునరుద్ధరించాలి. భారత్‌లో అనేక మంది నేపాల్  దేశస్తులు జీవిస్తున్నారు. ఇప్పటి వరకు నేపాల్కు భారత్ అండగా ఉంది కాబట్టే.. చైనా మిమ్మల్ని ఆక్రమించలేదు. లేదంటే ఎప్పుడో  నేపాల్పై చైనా నిజ స్వరుపాన్ని చూపేదని’’ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేర్కొన్నారు.

 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   14 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   17 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   20 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle