newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

నేపాల్‌లో భారత న్యూస్‌ చానళ్లకు రాంరాం. చైనా రాయబారి అతి చర్యలు

11-07-202011-07-2020 08:06:33 IST
2020-07-11T02:36:33.879Z11-07-2020 2020-07-11T02:36:31.288Z - - 04-08-2020

నేపాల్‌లో భారత న్యూస్‌ చానళ్లకు రాంరాం. చైనా రాయబారి అతి చర్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత టీవీ చానెళ్లనన్నింటికీ తమ దేశంలో బంద్ చేస్తున్నట్లు అక్కడి కేబుల్ ఆపరేటర్లు ప్రకటించారు. కేవలం దూరదర్శన్ మాత్రమే అనుమతిస్తున్నామని, మిగతా వాటిని స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నామని వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదని, తామే స్వచ్ఛందంగా దీనిని పాటించనున్నామని తెలిపారు. భారత టీవీ చానెళ్లలో నేపాల్‌కు, ప్రధాని కేపీ ఓలీ శర్మకు వ్యతిరేకంగా ప్రసారమవుతున్న కార్యక్రమాలను నియంత్రించాలంటూ మాజీ డిప్యూటీ ప్రధాని, అధికార పార్టీ ప్రతినిధి నారాయణ కాజీ శ్రేష్ఠ నేడు ఉదయం ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే నేపాల్ కేబుల్ ఆపరేటర్లు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్‌ వ్యవహరిస్తున్న తీరు ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు నేపాల్‌లోని రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందకు చైనా, పాకిస్తాన్‌ ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్‌ మరోసారి భారత్‌పై అక్కసు వెల్లగక్కింది. దూరదర్శన్‌ మినహా భారత్‌కు చెందిన అన్ని న్యూస్‌ చానళ్ల ప్రసారాలను గురువారం సాయంత్రం నుంచి కేబుల్‌ ఆపరేటర్లు నిలిపివేశారు. నేపాల్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రసారాలు చేస్తున్నారని ఆరోపిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

‘నేపాల్‌ ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేకుండా చేస్తున్న ప్రచారం హద్దులు దాటంది. ఇది చాలా దారుణం. వెంటనే ఈ చెత్తను నిలిపివేయాలి’ అని మాజీ ఉప ప్రధానమంత్రి, అధికార నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ అధికార ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ట చెప్పారు. చైనా చేతిలో కీలుబొమ్మగా మారిన నేపాల్ భారత్‌పై ఎప్పటికప్పుడు కాలుదువ్వుతూనే ఉంది. చివరకు భారత వార్తా చానళ్ల ప్రసారాలను సైతం నిలిపివేయించడం ద్వారా నేపాల్ భారత్‌తో తన శత్రువూరిత వైఖరిని ప్రదర్శించుకోవడంలో పరిమితులు లేకుండా వ్యవహరిస్తోంది.

ఓలి ప్రభుత్వ రక్షణకు రంగంలోకి దిగిన చైనా రాయబారి

నేపాల్ ప్రధాని కేపీ శర్మకు సొంత పార్టీలోనే భరోసా లభించకపోవడంతో ఆయన్ని, ఆయన ప్రభుత్వాన్ని కాపాడటానికి చైనా నేరుగా రంగంలోకి దిగి సంచలనం కలిగించింది. ప్రధాని రాజీనామా చేయాలని సొంత పార్టీ నాయకులే డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓలి తన ప్రధాన ప్రత్యర్థి, మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండతో వరుసగా సమావేశం అయినా లాభం లేకుండా పోయింది. అసంతృప్తి నేతలెవ్వరూ దారికి రావడం లేదు. మరోవైపు ఓలి ప్రభుత్వాన్ని కాపాడటానికి చైనా కూడా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో చైనా రాయబారి హౌ యాంకి తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గ‌త ఏప్రిల్ నుంచి ఎన్‌సీపీలో అంత‌ర్గ‌తంగా ర‌గులుతున్న వివాదాన్ని చల్లర్చడం కోసం చైనా రాయబారి హౌ యాంకి ప‌లువురు నేపాలీ రాజ‌కీయ నాయ‌కుల‌తో స‌మావేశ‌మై చ‌ర్చ‌లు జ‌రిపారు. గ‌త వారం రోజుల వ్య‌వ‌ధిలో కూడా చైనా రాయ‌బారి హౌ యాంకి ప‌లువురు నేపాల్ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. జూలై 3న‌ నేపాల్ అధ్య‌క్షురాలు విద్యాదేవి భండారిని క‌లిశారు. అయితే అది మ‌ర్యాద‌పూర్వ‌క భేటీ మాత్ర‌మే అని చెప్పారు. హౌ యాంకి, ప్రచండల మధ్య సమావేశం గురించి ఇంకా స్పష్టత రాలేదు. పీఎం ఓలికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న ప్రచండ, హౌ యాంకి కలవడానికి ఇష్టపడరని సమాచారం. 

ఇదిలా ఉండగా చైనా రాయబార కార్యాలయం హౌ యాంకి సమావేశాలను సమర్థించింది. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొవడం చైనాకు ఇష్టం లేదని తెలిపింది. నేపాల్‌ నాయకులు తమ విభేదాలను పరిష్కరించుకుని ఐక్యంగా ఉండాలని చైనా కోరుకుంటున్నట్లు ఆ దేశ ఎంబసీ ప్రతినిధి ఒకరు మీడియాతో చెప్పారు.

నేపాల్‌లో ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలి ప‌రిపాల‌న స‌రిగా లేదని, ఆయ‌న త‌క్ష‌ణ‌మే ప‌ద‌వి నుంచి వైదొల‌గాల‌ని ఎన్‌సీపీ ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్ ప్ర‌చండ నేతృత్వంలో అస‌మ్మ‌తి వెల్లువెత్తుతున్న‌ సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలాఖ‌రు నుంచి అంత‌ర్గ‌తంగా కొన‌సాగుతున్న ఈ వివాదం గురించి హౌ యాంకికి పూర్తిగా తెలుసు. ఈ నేపథ్యంలో నేపాల్‌లోని క‌మ్యూనిస్టు నాయ‌కుల‌నంతా ఏక‌తాటిపైకి తేవడంలో చైనా కీల‌కపాత్ర పోషించి ఉంటుంద‌ని.. అందుకే ఇప్పుడు అధికార పార్టీలో అస‌మ్మ‌తిని త‌గ్గించేంద‌కు ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

 

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   6 hours ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   14 hours ago


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   15 hours ago


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   03-08-2020


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   02-08-2020


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle