newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

నేనొచ్చేంతవరకు అమెరికాను దోచేసింది.. చైనాపై ట్రంప్ ఆరోపణ

23-05-202023-05-2020 11:30:04 IST
Updated On 23-05-2020 11:38:33 ISTUpdated On 23-05-20202020-05-23T06:00:04.858Z23-05-2020 2020-05-23T06:00:01.227Z - 2020-05-23T06:08:33.315Z - 23-05-2020

నేనొచ్చేంతవరకు అమెరికాను దోచేసింది.. చైనాపై ట్రంప్ ఆరోపణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికాను ఇష్టమొచ్చినట్లుగా దోచేయాలనే దుష్టతలంపుతోనే చైనా కొన్ని దశాబ్దాలుగా రాజకీయ జూదం ఆడుతూ వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఆ నిద్రమొహం జోయ్‌ బిడెన్‌ను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిపించేందుకే చైనా ఇవన్నీ చేస్తోంది. తద్వారా అమెరికాను దోచేయొచ్చని చైనా భావిస్తోంది. దశాబ్దాలుగా అదే జరిగింది. నేనొచ్చే వరకూ ఆ దోపిడీ కొనసాగింది’ అని ట్రంప్‌ గురువారం ట్వీట్‌ చేశారు. 

కరోనా వైరస్‌ విషయంలో చైనా భారీ తప్పుడు ప్రచారాలకు తెర తీసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. చైనా అసమర్ధత వల్లే ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది చనిపోతున్నారని ధ్వజమెత్తారు. ‘చైనా అధికార ప్రతినిధి చాలా తెలివితక్కువగా మాట్లాడారు. ఆ దేశం నుంచి ప్రపంచమంతా వ్యాపించిన వైరస్‌ సృష్టిస్తున్న మారణ హోమం, కష్టాలతో తమకేమీ సంబంధం లేదన్నట్టు మాట్లాడారు’ అని అన్నారు. 

చైనావి దోపిడీ ఆర్థిక విధానాలని,  అక్కడ మానవహక్కుల ఉల్లంఘనలూ కొనసాగుతున్నాయని తాజా నివేదికలో వైట్‌హౌస్‌ ఆరోపించింది. ఈ నివేదిక ఆధారంగా చైనా నాయకత్వంతో అటో ఇటో తేల్చుకోవాలనే ఉద్దేశంతో ట్రంప్ మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

అలాగే అమెరికాలో కరోనా బీభత్సానికి మొత్తంగా చైనానే నేరస్థురాలిగా చేసి ఓటర్లను రెచ్చగొట్టి నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ గెలుపు సాధించాలని కూడా ట్రంప్ పథకం పన్నుతున్నారని అమెరికన్ మీడియా కోడై కూస్తోంది. 

చైనా నాయకులు తమ దేశంలోనే పుట్టిన కరోనా వైరస్‌ని నిరోదించి, ప్రపంచమంతా వ్యాప్తి చెందకుండా అడ్డుకునే సామర్థ్యం ఉండి కూడా ఆ పనిచేయలేదని ట్రంప్ గత రెండు నెలలుగా ఆరోపిస్తూ రావడం తెలిసిందే.

 

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

   30 minutes ago


బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   5 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   21 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle