newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

నేను హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడుతునే ఉన్నా.. ట్రంప్ నో సైడ్ ఎఫెక్ట్స్

21-05-202021-05-2020 07:52:03 IST
Updated On 21-05-2020 10:32:42 ISTUpdated On 21-05-20202020-05-21T02:22:03.377Z21-05-2020 2020-05-21T02:21:58.933Z - 2020-05-21T05:02:42.560Z - 21-05-2020

నేను  హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడుతునే ఉన్నా.. ట్రంప్ నో సైడ్ ఎఫెక్ట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్ నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి మమకారం ఇంకా తగ్గనట్లుంది. కరోనా కట్టడి విషయంలో ఈ మందు పరమౌషధం అని నెలరోజులకు ముందు కితాబిచ్చిన ట్రంప్ ఇప్పటికీ తన వ్యాఖ్యనుంచి వెనక్కు తగ్గడంలేదు. ఈ ఔషధం కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అంతగా ప్రభావం చూపడం లేదని, పైపెచ్చు దీని వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని ట్రంప్‌ యంత్రాంగంలోని పలువురు వైద్య నిపుణులు హెచ్చరించినా అమెరికా అధ్యక్షుడు మాత్రం ఆ మాత్రలకు మద్దతిస్తూనే ఉన్నారు. 

ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19) నుంచి తనను తాను రక్షించుకోవడానికి యాంటీ మాలేరియా డ్రగ్‌ తీసుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. పదిరోజులుగా హైడాక్సీక్లోరోక్విన్‌, జింక్‌ సంప్లిమెంట్‌ తీసుకుంటున్నానని సోమవారం విలేకరులతో పేర్కొన్నారు. తాజాగా శ్వేతసౌధంలోని పలువురు సిబ్బందికి కరోనా సోకిందని తేలిన నేపథ్యంలో తాను హైడ్రాక్వీక్లోరోక్విన్‌ వాడుతున్నానంటూ ట్రంప్‌ ప్రకటించడం విశేషం. అయితే ఈ ఔషధాన్ని వాడమని తన వ్యక్తిగత వైద్యులు సూచించలేదని, వైట్‌హౌజ్‌ ఫిజీషియన్‌ ద్వారా దీనిని తెప్పించుకున్నానని పేర్కొన్నారు. 

ఈ డ్రగ్‌ బాగా పనిచేస్తుందని తాను భావిస్తున్నానని... దీని వల్ల ఎంతో మంది కోవిడ్‌ నుంచి కోలుకున్న స్ఫూర్తివంతమైన కథలు తాను విన్నానంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. సైడ్‌ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అని విలేకరులు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని.. తాను బాగానే ఉన్నా కదా అంటూ వారిని ఎదురు ప్రశ్నించారు. కాగా కరోనా విస్తృతమైన నేపథ్యంలోనూ తాను మాస్కు ధరించనంటూ ట్రంప్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక కరోనా సాధారణ ఫ్లూ వంటిదేనని.. దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. 

కాగా కరోనా పేషెంట్లకు ఉపశమనం కలిగించడంలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సత్ఫలితాలను ఇస్తుందన్న వార్తల నేపథ్యంలో తమకు ఈ డ్రగ్‌ను ఎగుమతి చేయాల్సిందిగా ట్రంప్‌ భారత్‌ను కోరిన విషయం తెలిసిందే. హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ పరమౌషధమని తొలుత చెప్పుకొచ్చిన ట్రంప్‌ ఆ తర్వాత అతినీలలోహిత కిరణాలు కోవిడ్‌-19 చికిత్సకు ఉపకరిస్తాయంటూ వ్యాఖ్యలు చేశారు. అనంతరం రెమిడిసివిర్‌ మందు కరోనా చికిత్సకు ప్రభావవంతంగా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. 

ఇకపోతే అమెరికాలో లక్షలాది మంది కరోనా బారిన పడుతున్న తరుణంలోనే తిరిగి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించి లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించారు. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితం కావాలన్న నిబంధనల ఎత్తివేత గురించి వైట్‌హౌస్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు, సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంటొని ఫాసీ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శించారు. ముఖ్యంగా పాఠశాలలు తిరిగి ప్రారంభించే అవకాశాలపై ఫాసీ అభిప్రాయాలతో తాను ఏకీభవించలేనన్నారు. 

లాక్‌డౌన్‌ నిబంధనలను త్వరతిగతిన ఎత్తివేస్తే అమెరికాలోని పలు రాష్ట్రాల్లో మరిన్ని కరోనా మరణాలు సంభవిస్తాయని.. ఆర్థికంగా కూడా ఎంతో నష్టపోవాల్సి వస్తుందంటూ ఫాసీ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి విలేకరులు ట్రంప్‌ను ప్రశ్నించగా... ఫాసీ వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవన్నారు. స్కూళ్లు తెరిస్తే విద్యార్థులకు పెద్దగా ప్రమాదం ఉండబోదని తాను భావిస్తున్నానని.. అయితే వయసు పైబడిన ప్రొఫెసర్లు, టీచర్ల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వారికి మరికొన్ని వారాల పాటు సెలవు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. 

‘‘ఆంటోనీ చాలా చాలా మంచివారు. కానీ ఆయనతో నేను అస్సలు ఏకీభవించను. కచ్చితంగా ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభిస్తాం. భద్రతా ప్రమాణాలతో ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా అన్ని సంస్థలు తిరిగి ప్రారంభమవుతాయి’’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు.

భారత్‌ శాస్త్రవేత్తలు, పరిశోధకులు చాలా గొప్పవారు.. ట్రంప్ ప్రశంసలు

మరోవైపున.. భారత్‌ శాస్త్రవేత్తలు, పరిశోధకులు చాలా గొప్పవారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసల జల్లు కురిపించారు. కోవిడ్‌ రోగులకు చికిత్స అందించడానికి మందులు, వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడంలో ఇండియన్‌ అమెరికన్‌ శాస్త్రవేత్తలు అమెరికాలో చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ‘కోవిడ్‌ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్, మందులు కనుక్కోవడంలో ఇండియన్‌ అమెరికన్‌ శాస్త్రవేత్తలు, పరిశోధనకారులు చేస్తున్న కృషి మరువలేనిది’అని అన్నారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌ పరిశోధనకారులు, శాస్త్రవేత్తల్ని ప్రశంసిస్తూ మాట్లాడడం ఇదే తొలిసారి. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ వర్సిటీలు, రీసెర్చ్‌ వర్సిటీలు, బయో ఫార్మా స్టార్టప్‌లలో ఇండియన్‌ అమెరికన్‌ శాస్త్రవేత్తలు కోవిడ్‌పై మందులు, వ్యాక్సిన్‌ కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నారు. భారత్, అమెరికా సంయుక్త కృషితో ఈ ఏడాది చివరి నాటికి  వ్యాక్సిన్‌ కనుక్కుంటామని ట్రంప్‌ చెప్పారు.  

 

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

   18 hours ago


దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

   20 hours ago


హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   25-07-2021


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   25-07-2021


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle