newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

నీ తెంపరితనం వల్లే ఇన్ని మరణాలు.. ట్రంప్‌పై అమెరికన్ల ఆగ్రహం.. !

18-04-202018-04-2020 13:46:37 IST
Updated On 18-04-2020 14:29:42 ISTUpdated On 18-04-20202020-04-18T08:16:37.210Z18-04-2020 2020-04-18T08:16:35.030Z - 2020-04-18T08:59:42.724Z - 18-04-2020

నీ తెంపరితనం వల్లే ఇన్ని మరణాలు.. ట్రంప్‌పై అమెరికన్ల ఆగ్రహం.. !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్.. విలయతాండవం చేస్తున్న అమెరికా అగ్రరాజ్యంలో సంభవించినన్ని కరోనా కేసులు, మరణాలు ఇతర ఏ దేశంలో కూడా నమోదు కాలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా వైరస్ పంజా విసరడంతో.. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో ప్రస్తుత పరిస్థితికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే అంటూ ప్రముఖ మీడియా సంస్థ ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ రిపోర్టును కూడా బయటపెట్టింది. అమెరికాలో కరోనా విజృంభించడానికి, మరణాలకు ప్రధాన కారణం అధ్యక్షుడు ట్రంపే అని ఆరోపించిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో అమెరికా పౌరులు ఏమనుకుంటున్నారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కాగా.. ఈ అంశంపై ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ ఓ సర్వే నిర్వహించింది. ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ నిర్వహించిన సర్వేలో దాదాపు 4,917 మంది ప్రజలు పాల్గొని, తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఈ నేపథ్యంలో సర్వే‌కు సంబంధించిన వివరాలను ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ గురువారం వెల్లడించింది. అగ్రరాజ్యంలో దావానలంలా కరోనా వైరస్ విజృంభించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలే కారణమని మెజార్టీ ప్రజలు నమ్ముతున్నట్లు ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ తెలిపింది. 

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ట్రంప్ వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నారని మీరు భావిస్తున్నారా అని ప్రజలను అడగగా.. 65 శాతం మంది ప్రజలు ‘లేదు’ అని సమాధానం ఇచ్చినట్లు వెల్లడించింది. అంతేకాకుండా మహమ్మారి కారణంగా అమెరికా ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రశ్నించినప్పుడు.. అమెరికాపై వైరస్ ప్రభావం రాబోయే రోజుల్లో తీవ్రంగా ఉండబోతోందని నమ్ముతున్నామని దాదాపు 73 శాతం మంది అభిప్రాయపడ్డట్లు పేర్కొంది. అమెరికాలో ఆంక్షలు సడలింపుపై జరుగుతున్న ప్రచారంపై కూడా ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ ప్రజల అభిప్రాయాన్ని సేకరించింది. 

కాగా.. అమెరికాలో ఇప్పటి వరకు 6.78లక్షల మంది కరోనా బారినపడగా.. 35,000కు పైగా మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారినపడిన వారి సంఖ్య 22 లక్షలకు చేరింది. మహమ్మారి కాటుకు ప్రపంచ వ్యాప్తంగా 1.50లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇదీ తెంపరితనం అంటే.. 

కరోనా మహమ్మారి ప్రపంచంలో స్వైర విహారం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా దీని ప్రభావం తీవ్రంగానే ఉంది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దేశ వ్యాప్తంగా డిజాస్టర్ డిక్లరేషన్‌ను ప్రకటించారు. వ్యాపార సముదాయాలు మూతపడటంతో  అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది. అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా.. నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ.. అమెరికాలో లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేయడానికి మార్గదర్శకాలు విడుదల చేశారు. 

శ్వేతసౌధంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రాల సహకారంతో మూడు దశల్లో లాక్‌డౌన్‌ను ఎత్తేయనున్నట్లు వెల్లడించారు. మార్గదర్శకాల అమలుకు ఫెడరల్ ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి పని చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా.. ‘అమెరికాతోపాటు అమెరికన్స్‌ కూడా లాక్‌డౌన్‌ను ఎత్తేయాలని కోరుకుంటున్నారు. లాక్‌డౌన్ శాశ్విత పరిష్కారం కాదు’ అన్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అనుకూలిస్తే.. పని చేయడానికి అమెరికన్స్ సిద్ధంగా ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. కాగా.. ట్రంప్ పేర్కొన్న మూడు దశలు కింది విధంగా ఉన్నాయి. 

మొదటి దశలో భాగంగా లాక్‌డౌన్‌ను ఎత్తేయడానికి రాష్ట్రం లేదా ప్రాంతంలో 14 రోజులపాటు కరోనా వైరస్ కేసుల తీవ్రతను గమనిస్తారు. వరుసగా 14 రోజులపాటు కరోనా వైరస్ కేసుల సంఖ్య, అనుమానిత సంఖ్య తగ్గుముఖం పడితే సదరు ప్రాంతంలో స్టే హోం నిబంధనలను ఎత్తేస్తారు. అదే విధంగా ఇతర ఆంక్షలను కూడా సడలిస్తారు.  రెండో దశలో భాగంగా వైరస్ ముప్పు ఉన్నవారిని ఇంటికే పరిమితం చేస్తారు. ఇంటి నుంచే పని చేసే విధంగా వారిని పోత్రహిస్తారు. సామాజిక దూరం నిబంధనను అమలు చేస్తూనే.. ఉద్యోగులు ప్రయాణించేందుకు అనుమతి ఇస్తారు. అయితే కామన్ ఏరియాల్లో మాత్రం సోషల్ డిస్టెన్స్ నిబంధన అమలు చేయవచ్చు లేదా ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.  మూడో దశలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరితే.. లాక్‌డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తేసారు. అయితే సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించేలా చర్యలు తీసుకుంటారు. 

ట్రంప్‌పై మండిపడ్డ న్యూయార్క్ గవర్నర్

ఒకవైపు న్యూయార్క్‌లో పిట్టల్లా రాలుతున్న జనం. రోజులు గడిచేకొద్దీ మరింతగా వ్యాప్తి చెందుతూ వెంటాడుతున్న వైరస్ భూతం.. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు రావలసిన సహాయం ఆశించినంత రాకపోవడం,. దీంతో న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కువోమో అమెరికా అధ్యక్షుడిపై మండిపడ్డారు. దేశంలోని బడా వాణిజ్యవర్గాలకు ప్యాకేజీలు అందిస్తూ రాష్ట్రాలకు సహాయం మాట మరిచిన ట్రంప్ ఇకనైనా టీవీ చూస్తూ కూర్చోవడం మాని నిద్రమేల్కొని తన బాధ్యతలను సరిగా నిర్వర్తించాలని గవర్నర్ కువోమో ధ్వజమెత్తారు. దేశంలోని విమానయాన సంస్థలు, ఇతర వాణిజ్య పెట్టుబడిదారులకు బెయిలవుట్ ప్యాకేజ్ అదించిన ట్రంప్ రాష్ట్రాలకు మాత్రం చేయి విదల్చలేదని మండిపడ్డారు.

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   10 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   21 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle