newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

నిర్మానుష్యంగా ఈశాన్య ఢిల్లీ.. 27కి చేరిన అల్లర్ల మృతుల సంఖ్య

27-02-202027-02-2020 09:56:50 IST
2020-02-27T04:26:50.942Z27-02-2020 2020-02-27T04:26:48.873Z - - 12-08-2020

నిర్మానుష్యంగా ఈశాన్య ఢిల్లీ.. 27కి చేరిన అల్లర్ల మృతుల సంఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య జరిగిన హింసాకాండగా భావిస్తున్న ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య బుధవారం నాటికి 27కి చేరింది. పరస్పర దాడుల్లో 250 మందికి పైగా ప్రజలు గాయాలపాలయ్యారు. బుల్లెట్‌ గాయాలు, కత్తులు, ఇతర ప్రాణాంతక ఆయుధాల కారణంగా అయిన గాయాల కన్నా..  తరుముకొస్తున్న దుండగుల బారి నుంచి తప్పించుకోవడం కోసం ఇళ్ల పై అంతస్తుల నుంచి దూకడం వల్ల చోటు చేసుకున్న గాయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు.

రెండు రోజులుగా తీవ్ర స్థాయి హింసాత్మక ఘటనలతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో బుధవారం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. వీధులన్నీ తగలబడిన వాహనాలు, ధ్వంసమైన, లూటీ అయిన దుకాణాలు, మూసివేసి ఉన్న ఇళ్లు, వాణిజ్య సముదాయాలతో నిర్మానుష్యంగా కనిపించాయి. గోకుల్‌పురిలో చోటు చేసుకున్న పలు చెదురుమదురు ఘటనలు మినహా బుధవారం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. మంగళవారం రాత్రి ఒకసారి, బుధవారం మరోసారి ఆందోళనలు జరిగిన ప్రాంతాల్లో జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌ పర్యటించారు.

అట్టుడికిపోతున్న దేశరాజధానిలో. అల్లరి మూకలు ఇళ్లు, కార్యాలయాలు, పెట్రోలు బంకులు, షోరూములు... ఇలా అన్నింటిపైనా దాడులకు తెగబడుతున్నారు. ఫలితంగా అల్లర్లు కొనసాగుతున్న ప్రాంతాల్లోని జనం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను పోలీసులు కాకుండా, వైద్యులు వెల్లడించడం గమనార్హం. అల్లర్ల కారణంగా ఈ ప్రాంతంలోని పాఠశాలలను, షాపులను మూసేశారు. పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు కూడా ఇళ్లల్లో నుంచి బయటకు రాలేదు. దుకాణాలను లూటీ చేయడంతో జీవనోపాధి కోల్పోయిన పలు కుటుంబాలు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవడం కనిపించింది. 

‘సాధ్యమైనంత త్వరగా ప్రశాంతత నెలకొనాలి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిపై లోతైన సమీక్ష జరిపాం. పోలీసులు, ఇతర భద్రత వ్యవస్థలు శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాయి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. 

ఢిల్లీలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే బాధ్యతను అజిత్‌ దోవల్‌కు కేంద్రం అప్పగించిన నేపథ్యంలో.. అల్లర్ల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ అమూల్య పట్నాయక్, కొత్తగా నియమితులైన స్పెషల్‌ కమిషనర్‌ ఎస్‌ఎన్‌ శ్రీవాస్తవతో కలిసి దోవల్‌ పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. హింసను అడ్డుకోవడంలో విఫలమయ్యారని అమూల్య పట్నాయక్‌ విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో.. శ్రీవాస్తవను దోవల్‌ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అల్లర్ల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. 

మరోవైపు, ఈ అల్లర్లకు సంబంధించి 106 మందిని అరెస్ట్‌ చేశామని, 18 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ప్రజల సహాయం కోసం రెండు హెల్ప్‌లైన్‌ నెంబర్లు 011–22829334, 011–22829335 కూడా ఏర్పాటు చేశామన్నారు. అల్లర్లలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కోసం ఆర్మీని పిలిపించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. అల్లర్లను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. అల్లర్లకు కారణం బీజేపీ కార్యకర్తలేనని ఆప్‌ నేతలు సంజయ్‌ సింగ్, గోపాల్‌ రాయ్‌ ఆరోపించారు. ఢిల్లీ శాంతి భద్రతల అంశం కేంద్ర పరిధిలో ఉంటుందని, అల్లర్ల కట్టడికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నిజాయితీగా కృషి చేయడం లేదని వారు విమర్శించారు. ఢిల్లీ సరిహద్దులను ఇప్పటికైనా మూసేయాలని, పొరుగు ప్రాంతాల నుంచి కొందరు ఢిల్లీకి వచ్చి హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle