newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

నిర్భయ హంతకుల ఉరి శిక్షకు ముహూర్తం రెడీ

09-12-201909-12-2019 14:12:05 IST
Updated On 11-12-2019 10:35:30 ISTUpdated On 11-12-20192019-12-09T08:42:05.853Z09-12-2019 2019-12-09T08:29:31.648Z - 2019-12-11T05:05:30.499Z - 11-12-2019

నిర్భయ హంతకుల ఉరి శిక్షకు ముహూర్తం రెడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దిశ అత్యాచారం,దారుణహత్య మనదేశంలో మహిళలపై నేరాలకు పాల్పడే వారికి ఎలాంటి శిక్షలు విధించాలనే అంశంపై మరింత చర్చకు దారితీసింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ అనంతరం ప్రజల దృష్టి నిర్భయ ఘటన దోషుల ఉరిమీదకు మళ్లింది. ఘటన జరిగి ఏడేళ్ళయినా వారిని ఉరి తీయకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈనెల 16న తెల్లవారుజామున 5 గంటలకు నిర్బయ నిందితులకు ఉరి వేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. నిర్భయను దారుణంగా అత్యాచారం చేసి హింసించింది కూడా అదే రోజు కావడం గమనార్హం. 

నిర్భయ నిందితులు ఉరిశిక్ష ఆలస్యంపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సైతం అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు క్షమాభిక్షకు ఆయన ఒప్పుకోలేదు. దోషులకు పడిన ఉరిశిక్షను ఎందుకు అమలు చేయడంలేదని మహిళా సంఘాలతో సహా.. పలువురు ప్రముఖులూ ప్రశ్నిస్తున్నారు. శిక్ష అమలు చేయకపోవడంపై నిర్భయ తల్లి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

మరోవైపు ఉరిశిక్ష అమలుకు తీహార్‌ జైలు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే దోషులను ఉరి తీసేందుకు జైలులో తలారి లేరని జైలు అధికారులు అంటున్నారు. దేశంలో ఉరిశిక్షలు చాలా తక్కువ సందర్భాల్లో అమలవుతున్నాయి. గత పదేళ్లలో కేవలం నలుగురిని మాత్రమే ఉరితీశారు. దీంతో జైలులో ఉరి తీసేందుకు శాశ్వత సిబ్బందిని అధికారులు నియమించడంలేదు.

నిర్భయ నిందితులును ఉరి తీయాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తుండటంతో తలారి కోసం వెతుకుతున్నారు.  నిర్భయ కేసులో దోషులకు త్వరగా ఉరి శిక్ష అమలు చేసేందుకు వీలుగా తిహార్‌ జైలులో తనను తాత్కాలిక తలారిగా నియమించాలని రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు సిమ్లాకు చెందిన రవికుమార్‌ అనే వ్యక్తి లేఖ రాశాడు. దోషులకు ఉరి శిక్ష అమలైతే నిర్భయ ఆత్మశాంతిస్తుందని రవికుమార్ లేఖలో పేర్కొన్నాడు.

అలాగే తమిళనాడుకి చెందిన కానిస్టేబుల్ కూడా లేఖ రాశాడు. నిర్భయ హంతకులను ఉరితీసేందుకు తాను రెడీ అంటూ తీహార్ జైలు అధికారులకు లేఖ రాశాడు రామనాథపురం జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సుభాష్ శ్రీనివాసన్. నిర్భయ హంతకులను ఉరి ఎప్పుడు తీస్తారోనని యావత్ భారత దేశం ఎదురుచూస్తోంది. 

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   12 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   13 hours ago


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   18 hours ago


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

   09-08-2020


భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

   09-08-2020


10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   08-08-2020


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   08-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle