newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నిర్భయ దోషులపై హోంశాఖ సీరియస్ .. ఇక ఉరే!

03-02-202003-02-2020 08:40:03 IST
2020-02-03T03:10:03.993Z03-02-2020 2020-02-03T03:09:55.690Z - - 09-08-2020

నిర్భయ దోషులపై హోంశాఖ సీరియస్ .. ఇక ఉరే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఇంకా సాగు...తూనే వుంది. నిర్భయ దోషుల చేతిలో చట్టం దుర్వినియోగం అవుతోందని, దోషులు ఉరిశిక్ష అమలును అడ్డుకునేందుకు పిటిషన్లు వేస్తూ న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సీరియస్ అవుతోంది. ఉరి శిక్షపై స్టే కొనసాగుతున్న వేళ హోంశాఖ తదుపరి ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది.

చట్టం ద్వారా తమకున్న అన్ని అవకాశాలను వినియోగించుకున్న దోషులను త్వరగా ఉరితీయాలని నిర్భయ తల్లి ఆశాదేవి డిమాండ్ చేస్తున్నారు. తన కూతురికి ఏడేళ్ళయినా న్యాయం జరగలేదని, చట్టంపై ఉన్న నమ్మకం సడలుతోందని ఆమె ఆవేదన చెందుతున్నారు.రేపిస్టులను విడివిడిగా ఉరితీయాలని కోరుతోంది హోంశాఖ. ఉరిశిక్ష అమలు కాకుండా ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్నారని కేంద్రం భావిస్తోంది.

చట్టపరంగా అన్ని దారులు మూసుకుపోవడంతో ఒక్కొక్కరిని ఉరితీసేయాలని హోంశాఖ యోచిస్తోంది. ఉరితీత అమలుపై పటియాలా కోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర హోంశాఖ, తీహార్ జైల్ అధికారులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీన్ని ప్రత్యేకంగా విచారించేందుకు రంగం సిద్దమైంది. ఉరితీతపై విధించిన నిరవధిక స్టేను ఎత్తివేయాలని, నిందితులు చట్టంలోని లొసుగులను వాడుకుంటూ ఒక ఆటగా భావిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వెంటనే ఉరి తీయడానికి డెత్ వారెంట్ జారీచేయాలని, దోషులు ఇంకే అవకాశం వినియోగించకుండా కట్టడి చేయాలని అధికారులు భావిస్తున్నారు. 

ఢిల్లీ హైకోర్టులో ఈ కేసుపై ప్రత్యేక విచారణ జరుగనుంది. దోషులు చివరి అవకాశం వరకూ ఎదురుచూస్తున్నారని, ఉరి ప్రక్రియను ఎలాగైనా ఆపాలని చూస్తున్నారని  పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించాయి కేంద్ర హోం శాఖ, తీహార్ జైలు వర్గాలు. ఫిబ్రవరి 1వ తేదీ, శనివారం తెల్లవారుజామున అమలు కావాల్సిన ఉరి శిక్షపై పటియాలా కోర్టు శుక్రవారం నాడు స్టే ఇచ్చింది.

దోషులు నలుగురిని ఉరి తీసేందుకు ట్రయల్స్ కూడా పూర్తి చేశారు. హోంశాఖ పిటిషన్‌ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు తీహార్ జైలు అధికారులకు, దోషులకు నోటీసులు జారీ చేసింది.  మరికొద్దిగంటల్లో శిక్ష అమలు కావాల్సిన వేళ స్టే రావడం యావత్ దేశాన్ని నివ్వెర పరిచింది. అసలు ఉరి శిక్ష అమలవుతుందా లేదా అన్న స్థాయిలో కామెంట్లు పడుతున్నాయి. 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   14 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   17 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   20 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle