newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

నిర్భయ కేసులో బిగ్ ట్విస్ట్ .. కారుణ్యమరణానికి పేరెంట్స్ లేఖ

17-03-202017-03-2020 15:14:51 IST
2020-03-17T09:44:51.494Z17-03-2020 2020-03-17T09:44:48.919Z - - 11-08-2020

నిర్భయ కేసులో బిగ్ ట్విస్ట్ .. కారుణ్యమరణానికి పేరెంట్స్ లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉరిశిక్ష అమలు తేదీ సమీపిస్తున్న వేళ నిర్భయ దోషులు మరోసారి శిక్షను వాయిదా వేసేందుకు పావులు కదుపుతున్నారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరణశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ ఐసీజేలో ఈ మేరకు దోషులు అక్షయ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ సోమవారం పిటిషన్‌ దాఖలు చేసినట్లు సమాచారం. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో మరో దోషి ముఖేశ్‌ సింగ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసిన నేపథ్యంలో ఈ ముగ్గురు ఐసీజేను ఆశ్రయించడం గమనార్హం. 

కాగా 2012 డిసెంబర్‌ 16 అర్ధరాత్రి ఢిల్లీలో పారామెడికల్‌ విద్యార్థినిని అత్యంత దారుణంగా హింసించి మరీ ఆరుగురు అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. అనంతరం ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డు మీదకు విసిరేశారు. దీనస్థితిలో ప్రాణాల కోసం పోరాడి చివరకు ఆ యువతి సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఈ క్రమంలో ఆమెకు నిర్భయగా నామకరణం చేసిన పోలీసులు నిందితులు రామ్‌సింగ్‌, అక్షయ్‌, వినయ్‌ శర్మ, పవన్‌, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఈ కేసు విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు. అనేక పరిణామాల అనంతరం మిగిలిన నలుగురు దోషులకు సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించగా.. అప్పటి నుంచి శిక్ష అమలును వాయిదా వేసేందుకు దోషులు చట్టంలోని వివిధ సెక్షన్లను ఉపయోగించుకుంటూ ఎప్పటికప్పుడు తమను తాము కాపాడుకుంటున్నారు. ఇక మార్చి 20న నలుగురు దోషులను ఉరితీయాలంటూ డెత్‌ వారెంట్లు జారీ అయిన నేపథ్యంలో... తమకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ వారి కుటుంబ సభ్యులు రాష్ట్రపతికి లేఖ రాయడం గమనార్హం. 

ఇంకా ఏం మిగిలి ఉంది? సుప్రీంకోర్టు ప్రశ్న

అంతకుముందు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషి ముఖేశ్‌ సింగ్‌ తాజా విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. తాజాగా మరోసారి క్యూరేటివ్‌ పిటిషన్‌, క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలని కోరిన అతడి అభ్యర్థనను తోసిపుచ్చింది. 

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి అవకాశం మిగల్లేదు. నీకు క్షమాభిక్ష అడిగే అవకాశం లభించింది. అది తిరస్కరించబడింది. వారెంట్లు జారీ అయ్యాయి. క్యూరేటివ్‌ పిటిషన్‌ కూడా కొట్టివేశాం. ఇంకా ఏం మిగిలి ఉంది’’అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఉరిశిక్షను నిలుపుదల చేసే అవకాశాలు లేవని పేర్కొంది.

కాగా నిర్భయ దోషులకు మార్చి 20న ఉదయం 5.30 నిమిషాలకు ఉరిశిక్ష అమలు చేసేందుకు డెత్‌వారెంట్లు జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి మరణశిక్ష అమలు తేదీని వాయిదా వేసేందుకు దోషులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

క్షమాగుణంలోనూ శక్తి దాగి ఉంటుంది.. రాష్ట్రపతికి నిర్భయ దోషుల కుటుంబ సభ్యుల లేఖ

నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులుగా ఉన్న ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ ఠాకూర్‌ కుటుంబ సభ్యులు రాష్ట్రప్రతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆదివారం లేఖ రాశారు. తమకు కారుణ్య మరణం ప్రసాదించాలని అభ్యర్థించారు. 

‘‘కారుణ్య మరణానికి అనుమతినివ్వాలని మిమ్మల్ని, బాధితురాలి తల్లిదండ్రులను అభ్యర్థిస్తున్నాం. అప్పుడే భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగవు. అదే విధంగా కోర్టు కూడా ఒకరికి బదులు ఐదుగురు వ్యక్తులను ఉరి తీసే పరిస్థితి రాదు’’ అని లేఖలో పేర్కొన్నారు. అలాగే.. ‘‘మన దేశంలో మహాపాపులను కూడా క్షమించారు. ప్రతీకారమే శక్తికి నిర్వచనం కాదు. క్షమాగుణంలో కూడా శక్తి ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డారు. 

కారుణ్య మరణం కోరిన వాళ్లలో దోషుల తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, పిల్లలు కూడా ఉన్నారు.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   3 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   3 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   6 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   14 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle