newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

నిర్భయకు న్యాయం దక్కకపోతే ఎవరికీ దక్కనట్లే : ఆశా దేవి

20-02-202020-02-2020 13:23:23 IST
2020-02-20T07:53:23.042Z20-02-2020 2020-02-20T07:53:19.752Z - - 29-11-2020

నిర్భయకు న్యాయం దక్కకపోతే ఎవరికీ దక్కనట్లే : ఆశా దేవి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దారుణమైన అత్యాచారానికి గురై ఏడేళ్ల క్రితం కన్నుమూసిన తన కుమార్తెకు తగిన న్యాయం దక్కకపోతే దేశంలో ఏ బాధితురాలికీ ఇక న్యాయం జరకదని నిర్బయం తల్లి ఆశాదేవి స్పష్టం చేశారు. తన కుమార్తెకు న్యాయం జరిగేలా చూసేందుకు దేశంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆమె భావోద్వేగంతో పిలుపునిచ్చారు. 

2012 సంవత్సరం ఢిల్లీలో కదిలేబస్సులో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ హంతకులకు ఇప్పటికీ ఉరిశిక్ష అమలు కాకపోవడంపై నిర్బయ తల్లి ప్రతి సందర్బంలోనూ న్యాయవ్యవస్థను తూర్పారబడుతున్నారు. ఈ సందర్భంగా ఒక ప్రముఖ జాతీయ చానెల్‍‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆశాదేవి భారతీయులకు భావోద్వేగ సందేశమిచ్చారు. కన్నీళ్లతో టీవీ చానల్ ముందు కూర్చున్న నిర్భయ తల్లి తన కుమార్తె దారుణంగా అత్యాచారానికి గురై చనిపోయినప్పుడే తానూ మనిషిగా చచ్చిపోయినట్లు విలపించారు. తన కుమార్తె జ్ఞాపకాలు వెన్నాడుతూంటే రోజుల తరబడి నిద్రలేకుండా గడిపానని తెలిపారు.

అయితే న్యాయం కోసం గత ఏడేళ్లుగా సాగిస్తున్న పోరాటాన్ని వదలిపెట్టబోనని, ప్రజలు కూడా తమ హక్కులు కాపాడమని ప్రాధేయపడవద్దనీ, తమ హక్కుల కోసం పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. తన కుమార్తెకు న్యాయం చేయాలని ఇప్పటికీ న్యాయవ్యవస్థను తాను అర్థిస్తూన్నట్లు తెలిపారు. పరిస్థితులు మారాయి. ఒకప్పటిలాగా తమ సమస్యలను పరిష్కరించమంటూ అడుక్కునే రోజులు పోయాయి. కానీ ఏ ఆధారమూ లేని తాను ఇప్పటికీ న్యాయవ్యవస్థ ముందు చేతులు జోడించి మరీ ప్రార్థిస్తూ తన కుమార్తెకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తన కుమార్తె హంతకులు ఉరికంబం ఎక్కిన తర్వాత కూడా మహిళలపై అత్యాచార సమస్యను తాను లేవనెత్తుతూనే ఉంటానని ఆశాదేవి చెప్పారు. ఆ దుర్మార్గులు ఉరి కంబం ఎక్కిన తర్వాత కూడా నేను ఈ సమస్యను వదలనని మీకు వాగ్దానం చేస్తున్నాను. ఇది నా పోరాటం కాదు. భారత పుత్రికల గురించిన పోరాటం. వారి ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటం అని ఆమె స్పష్టం చేశారు.

నిర్భయ హంతకులు తమకు ఉరిశిక్ష విధించినట్లు కోర్టు తీర్పు చెప్పినప్పుడు కూడా వారు తనను కోర్టులోనే బహిరంగంగానే సవాలు చేశారు. ఈ దేశంలో నిజంగా మహిళలకు హక్కులే ఉంటే, ఆ హక్కులకు గ్యారంటీ ఇచ్చేలా మొత్తం వ్యవస్థ మారాలని ఆశాదేవి చెప్పారు.

తన కన్నకూతురిని తనకు లేకుండా చేసిన ముష్కరులను క్షమించమని, క్షమాబిక్ష పెట్టమని తనను కోరినవారిపట్ల ఆశాదేవి స్పందించారు. అలాంటివారికి నా ప్రశ్న ఒక్కటే. ఇదే ఘోరం మీ కుమార్తెకి జరిగి ఉంటే మీరు వారిని క్షమించేవారా అని ఆమె ప్రశ్నించారు.

సవాలక్ష అడ్డంకులు, న్యాయవివాదాల మధ్య సుదీర్ఘంగా సాగిన విచారణ ప్రక్రియ ముగిసిపోవడంతో మార్చి తొలివారం నిర్భయ హంతకులను ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు తాజాగా తీర్పు చెప్పడం నిర్బయ తల్లికి కాస్త ఉపశమనం కలిగించినట్లేనని చెప్పాలి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle