newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

నిర్బయ దోషులకు ఉరిశిక్ష అమలు..

20-03-202020-03-2020 07:12:50 IST
2020-03-20T01:42:50.971Z20-03-2020 2020-03-20T01:42:48.239Z - - 07-08-2020

నిర్బయ దోషులకు ఉరిశిక్ష అమలు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో దోషులను ఉరితీశారు. నలుగురు దోషులు వినయ్ శర్మ (26) , అక్షయ్ ఠాకూర్ (31), ముఖేష్ సింగ్ (32), పవన్‌ గుప్తా (25) లు తమపై ఉరిశిక్ష అమలును వాయిదా వేయమని కోరుతూ తాజాగా దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం నడిరాత్రి దాటిన తర్వాత కొట్టివేయడంతో వారి ఉరిశిక్షకు మార్గం సుగమమైంది.

తీహార్ జైలులో శుక్రవారం ఉదయం గం. 5.30లకు నిర్ణీత సమయంలో నిర్భయ హంతకులకు ఉరిశిక్ష అమలు చేశారు. పలువురు జైలు అధికారులతోపాటు జిల్లా మెజిస్ట్రేట్ సమక్షంలో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులను ఉరితీసారు. తలారి పవన్ జల్లాద్ ఈ ఉరి ప్రక్రియను చేపట్టారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఉదయం 6.30 నిమిషాలలోపు జైలు డాక్టరు వీరి ఉరి ప్రక్రియ పూర్తయిందని నిర్ధారించిన తర్వాత అధికారికంగా దీనిపై ప్రకటించునున్నారు.

2012లో దేశరాజధాని ఢిల్లీలో కదిలే బస్సులో 23 ఏళ్ల పారామెడికో విద్యార్థినిని సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో నిందితులను నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి సుదీర్ఘంగా విచారించారు. దేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని కదిలించివేసిన ఈ ఘాతుక చర్యకు పాల్పడిన వారికి ఉరిశిక్షే అర్హమని జాతియావత్తు ఎలుగెత్తి చాటినా భారత న్యాయ వ్యవస్థలోని లొసుగులను ఆధారం చేసుకుని మూడేళ్లకుపైగా దోషులు చట్టంతో దోబూచులాడారు. గురువారం లేట్ నైట్ వరకు దోషుల లాయర్ ఏపీ సింగ్ పట్టువదలని విక్రమార్కుడి చందాన దోషుల ఉరిశిక్షను వాయిదా వేయడానికి తీవ్రంగా శ్రమించి విఫలమయ్యారు. 

దోషులకు ఉరి సందర్భంగా బాధితురాలి తరపున వాదించిన లాయర్ హర్షం వ్యక్తం చేశారు. నిర్భయ కలలు సాకారమవుతాయని ఎవరూ భావించకపోవచ్చు కానీ ఆమెకు దక్కాల్సిన న్యాయం మటుకు ఎట్టకేలకు దక్కిందని అభిప్రాయపడ్డారు.

Image result for 2012 Delhi Gang Rape Convicts Hanging Finally got justice, says 2012 Delhi gang rape victim's mother

చట్టం ముందు దోషులు తలవంచక తప్పదని గురువారం సాయంత్రానికి స్పష్టమవడంతో గత ఏడేళ్లుగా తమ కుమార్తెకు న్యాయం కోసం తీవ్రంగా పోరాడిన తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ ఒక్క కుమార్తెకు దక్కిన న్యాయం మాత్రమే కాదని భారతదేశంలోని నగరాలు, వీధుల్లో నిర్బయకు న్యాయం జరగబోతోందని జనం హర్షం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గత ఏడేళ్లుగా కోర్టు గుమ్మం ఎక్కుతూ పోరాటంలో అలసిపోయిన నిర్బయ తల్లి ఆశాదేవి తన కుమార్తె అనుభవించిన నరకబాధలకు ముక్తి ఈరోజే దొరికిందని సంతోషం వ్యక్తం చేశారు.

గురువారం అంతిమ విచారణ సందర్భంగా నిర్బయ దోషులకు చట్టపరమైన అన్ని అవకాశాలూ మూసుకుపోయాయని, ఈ దశలో కొత్త వాదనలకు అవకాశం లేదని జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎ.ఎస్ బోపన్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ముందుగా ఢిల్లీ హైకోర్టు గురువారం రాత్రి 11.15 నిమిషాలకు దోషుల పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. దాంతో నిర్బయ దోషుల లాయర్ అర్థరాత్రి దాటిన తర్వాత మళ్లీ సుప్రీం తలుపులు తట్టి ఉరిశిక్షపై స్టే విధించాలంటూ చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఉరిని యధాతథంగా అమలు చేయాలని తీర్పునివ్వడంతో శుక్రవారం తెల్లవారు జామున నలుగురు నిందితులకు తీహార్ జైలు అధికారులు ఉరిశిక్షను అమలు చేశారు.

తీహార్ జైలు చరిత్రలో నలుగురు దోషులకు ఒకేసారి ఉరిశిక్ష అమలు చేయడం ఇదే తొలిసారి. ఏడేళ్లక్రతం పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి కేసులో అప్జల్ గంజ్‌ని ఉరితీసిన తర్వాత తీహార్ జైలులో మళీ ఉరిశిక్షను అమలు చేయడం కూడా ఇదే తొలిసారి. పైగా దేశచరిత్రలో ఒకేసారి నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం.

 

 

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   3 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   5 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   8 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   8 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   9 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle