newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

నిరసన తెలుపండి.. కానీ ఇతరుల హక్కు మాటేంటి: సుప్రీం వ్యాఖ్య

18-02-202018-02-2020 13:09:01 IST
2020-02-18T07:39:01.940Z18-02-2020 2020-02-18T07:38:54.111Z - - 05-08-2020

నిరసన తెలుపండి.. కానీ ఇతరుల హక్కు మాటేంటి: సుప్రీం వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ ప్రజలకు ఏ అంశంపైనైనా సరే నిరసనలు తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించిందని కానీ జనసమ్మర్థంగా ఉండే కీలక ప్రాంతాల్లో సుదీర్ఘ కాలం ఆందోళనలు సాగించడం మంచిదికాదని భారత సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘నిరసనలు తెలిపే హక్కు ప్రజలకుంది. అయితే, కీలకమైన అలాంటి ప్రాంతంలో సుదీర్ఘకాలం ఆందోళనలు సాగించడం తగదు. ప్రభుత్వ రహదారులు, పార్కుల వద్ద కాకుండా ప్రత్యేకించిన ప్రాంతాల్లోనే వారు నిరసనలు చేపట్టాలి. షహిన్‌బాగ్‌ ఆందోళనల పట్ల ఓ వర్గం ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా నిరసన తెలిపిందుకు మరో ప్రాంతాన్ని ఎంచుకోండి’ అని సుప్రీం స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద చట్టాలు సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో వారాలతరబడి కొనసాగుతున్న ప్రజా ఆందోళనలపై దేశ అత్యున్నత న్యాయస్థానం  తీవ్రంగా స్పందించింది. నిరసనలు తెలిపే హక్కు ప్రజలకుందని, అయితే రోజుల తరబడి రోడ్లను బ్లాక్‌ చేయడం సరికాదని  ఆగ్రహం వ్యక్తం చేసింది. షహిన్‌బాగ్‌ ప్రాంతాన్ని ఖాళీ చేసేలా ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది అమిత్‌ సైనీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

అలాగే నిరసనకారులతో మాట్లాడేందుకు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు సంజయ్‌ హేగ్డే, సాధన రామచంద్రన్‌లను మధ్యవర్తులుగా ఏర్పాటు చేసింది. షహిన్‌బాగ్‌ను ఖాళీ చేసే విధంగా వారితో సంప్రదింపులు జరపాలని న్యాయస్థానం కోరింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకోకపోతే దేశంలో మరో 5వేల షహిన్‌బాగ్‌ కేంద్రాలు ఏర్పాటు అవుతాయంటూ.. భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా ధర్మాసనం స్పందించింది. షహీన్ బాగ్ కేంద్రాలను ఎన్నింటిని ఏర్పాటు చేసినప్పటికీ, వాటితో తమకు ఎలాంటి ఇబ్బందిలేదనీ,  కానీ పౌరులకు అసౌకర్యం కలగకుండా ఆందోళనకారులు నిరసన తెలుపుకోవాలని  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ రోడ్లను దిగ్బంధించే పనులను చేయవద్దని, ఈ సమస్యను అధిగమించేందుకు హేతుబద్దమైన పరిష్కారంతో ముందుకు రావలసిందిగా సుప్రీంకోర్టు సోమవారం షహీన్ బాగ్ నిరసనకారులకు సూచించింది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టికకు వ్యతిరేకంగా డిసెంబర్ 15నుంచి మూసివేయబడిన కాలింది కుంజ్-షహీన్ బాగ్ రోడ్డు, ఓక్లా అండర్ పాస్ మార్గాల్లో అధికారులు ఆంక్షలను విధించారు. 

షహీన్ బాగ్ నిరసనకారుల ఆందోళనలను సాకుగా చూపించి పరిసరప్రాంతాల రహదారులను అధికారులు దిగ్బంధించినందుకే ఢిల్లీ, నోయిడా, ఫరిదాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయని బీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ అజాద్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలోనే షహీన్ బాగ్ నిరసనకారులతో మాట్లాడేందుకు ప్రయత్నించి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవలసిందిగా వారికి నచ్చచెప్పాలని సుప్రీం కోర్టు సూచించింది.

ప్రజలకు తమ సమస్యలను ఎత్తిచూపుకునే హక్కు ఉందని గుర్తించాలి. ఆ సమస్యల పరిష్కారంపై న్యాయ సమీక్ష ఉంటుంది కూడా. అయితే శాసనాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉంటుంది కానీ ప్రతి హక్కూ బాధ్యతతో ఉండాలి. మీకు నిరసన తెలిపే హక్కు ఉంది కానీ ఇతరుల ప్రయోజనాలు దెబ్బతినకూడదు అనే ఇంగితం కూడా నిరసనకారులకు ఉండాలని సుప్రీంకోర్టు హితవు చెప్పింది.

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   5 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   9 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle