newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

నింగిలోకి దూసుకెళ్ళిన పిఎస్ఎల్వీ - సి47

27-11-201927-11-2019 12:16:14 IST
Updated On 27-11-2019 16:26:46 ISTUpdated On 27-11-20192019-11-27T06:46:14.377Z27-11-2019 2019-11-27T06:46:12.696Z - 2019-11-27T10:56:46.047Z - 27-11-2019

నింగిలోకి దూసుకెళ్ళిన పిఎస్ఎల్వీ - సి47
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. భారత అంతరిక్షపరిశోధన సంస్థ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ చిరస్మరణీయ విజయంతో భారతీయులంతా గర్వపడేలా చేసింది. రోదసీలోకి ఒకేసారి 14 ఉపగ్రహాలను పంపడం ద్వారా తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటింది. పీఎస్‌ఎల్వీ-సీ47కు కౌంట్‌డౌన్ మంగళవారమే ప్రారంభమయ్యింది.

Image

26వ తేదీ ఉదయం మొదలైన కౌంట్‌డౌన్.. 26 గంటలపాటు కొనసాగింది. పిఎస్ఎల్వీ - సి47 రాకెట్ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టే 14 ఉపగ్రహాల్లో 13 అమెరికాకు చెందినవి. మరొకటి కార్టోశాట్ 3 భారతదేశానికి చెందిన ఉపగ్రహం. అయిదేళ్ల జీవితకాలం వున్న కార్టోశాట్ 3 భారతదేశానికి అనేక రకాలుగా ఉపయోగపడనుంది. 350 కోట్ల రూపాయలతో తయారుచేసిన ఈ ఉపగ్రహానికున్న కెమెరాకు 0.25 మీటర్లకంటే మెరుగైన రిజల్యూషన్ తో చిత్రాలు తీసే సామర్థ్యం వుంది. 

ఈ ఉపగ్రహం వల్ల మన సైనిక సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది తీరప్రాంత నిఘా కోసమే కాకుండా, ప్రకృతి విపత్తుల సమయాల్లో కూడా విశిష్టమయిన సేవలందించనుంది.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలు, రహదారుల పరిశీలన వంటి అంశాల్లో దీన్ని వినియోగించవచ్చు. అంతరిక్ష పరిశోధనలకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. చంద్రయాన్ 2 తరువాత అనతికాలంలోనే పీఎస్ఎల్వీ ప్రయోగం జరగడం మన శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం. 

ఈ వాహననౌక భూమిని వీడిన అరగంటలోపే కార్టోశాట్‌-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ- సీ 47 వాహకనౌక నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. అంటార్కిటికాలోని ఇస్రో కేంద్రం పీఎస్‌ఎల్‌వీ సంకేతాలను అందుకోనుంది. తమకు వచ్చే ఏడాది కూడా చేతినిండా ప్రయోగాలు ఉన్నాయని శివన్ అన్నారు.వచ్చే మార్చి లోగా మరో 6 రాకెట్లతో 13 మిషన్లు ప్రయోగించనున్నట్లు తెలిపారు.

ఈ విజయం భవిష్యత్‌ ప్రయోగాలకు మరింత స్పూర్తినిస్తుందని ఇస్రో చైర్మన్‌ డా. శివన్‌ అన్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ-47 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

ఈ ప్రయోగానికి ముందు ఇస్రో ఛైర్మన్ శివన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భారత అంతరిక్ష ప్రయోగాలకు ముందు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 

కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   9 hours ago


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   12 hours ago


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   16 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   18 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   20 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   20 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   21 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle