newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

దోవల్ దౌత్యం ఫలించినట్లే... వెనక్కు మళ్లిన చైనా సైన్యం

07-07-202007-07-2020 06:57:35 IST
Updated On 07-07-2020 12:45:12 ISTUpdated On 07-07-20202020-07-07T01:27:35.181Z07-07-2020 2020-07-07T01:27:28.926Z - 2020-07-07T07:15:12.788Z - 07-07-2020

దోవల్ దౌత్యం ఫలించినట్లే... వెనక్కు మళ్లిన చైనా సైన్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌-చైనా సరిహద్దుల్లోని గల్వాన్‌ లోయలో నెలల తరబడి కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడినట్లు కనిపిస్తోంది. సరిహద్దు వివాదం నేపథ్యంలో గతకొంత కాలంగా చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు ఇరు దేశాలు ముగింపు పలికినట్లుగా తెలుస్తోంది. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద గల్వాన్‌ లోయలో ఘర్షణలు జరిగాక ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్‌‌ వెళ్లి సైన్యంతో మాట్లాడటం, అనంతరం జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ దోవల్‌ రంగంలోకి దిగడంతో చైనా సైన్యం తోకముడిచి వెనక్కి తగ్గింది. భారత చర్చల ఫలితంగా ఎట్టకేలకు ఫింగర్‌ 4 పాయింట్‌ నుంచి చైనా సైన్యం సుమారు కిలోమీటరున్నర దూరం వరకు వెనక్కి వెళ్లింది. 

మోదీ పర్యటన అనంతరం అజిత్‌ దోవల్‌ చైనా విదేశాంగ మంత్రితో ఆదివారం సుమారు రెండుగంటల పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దేశ భద్రతా వ్యవహారాల్లో ఆరితేరిన అజిత్‌.. తన చాణిక్యతను ఉపయోగించి చైనాతో సమస్య పరిష్కారానికి దారిచూపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దుల్లో శాంతి యుత పరిస్థితులు నెలకొల్పాలని ఇరు దేశాల ప్రతినిధులు ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న ఇరుదేశాల సైనిక బలగాలను వీలైనంత తొందరగా ఉపసంహరించుకోవాలని అంగీకరించారు. వాస్తవాధీన రేఖను రెండు దేశాలు పరస్పరం గౌరవించుకోవాలని, ఏకపక్షంగా ఎల్‌ఏసీని మార్చే ప్రయత్నాలను మానుకోవాలి నిర్ణయించారు. అలాగే ఇరు దేశాల మధ్య శాంతియుత సంబంధాల కోసం చర్చలు నిరంతరం కొనసాగాలని ఒప్పందం కుదుర్చున్నారు.

తూర్పు లద్దాఖ్‌ ప్రాంతాంలోని గల్వాయ్‌ లోయలో గల వివాదాస్పద ప్రాంతంలో చైనా సైన్యం గుడారాలు ఏర్పాటు చేయడం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూన్‌ 15న చెలరేగిన హింసాత్మక ఘటనలో 20 మంది భారత సైనికులు మృతిచెందారు. దీంతో చైనాపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని యావత్‌దేశం ముక్తకంఠంతో నినదించింది. అయితే చైనా ఆర్థిక మూలాలపై దెబ్బతీయాలని భావించిన భారత ప్రభుత్వం డిజిటల్‌ స్ట్రైక్స్‌ ద్వారా డ్రాగాన్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ క్రమంలోనే గతవారం మోదీ అనూహ్యంగా లద్దాఖ్‌లో పర్యటించి చైనాకు గట్టి హెచ్చరికలు ఇచ్చారు. విస్తరణవాదానికి ఇక కాలం చెల్లిపోయిందని భారత భూభాగాలను ఆక్రమిస్తే ఊరుకునే ప్రసక్తేలేదని మోదీ తేల్చి చెప్పారు.

ఈ పరిణామం చైనా కమ్యూనిస్ట్‌ ప్రభుత్వానికి గట్టి షాక్‌ లాంటిదే. ఇక మోదీ లద్దాక్‌ పర్యటన అనంతరం అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్మీ చీఫ్‌లతో ప్రత్యేకంగా భేటీ అయిన అజిత్‌ దోవల్ ఆదివారం సాయంత్రం సుమారు రెండుగంటల పాటు చైనా విదేశాంగమంత్రితో చర్చలు జరిపారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని, వివాదాస్పద భూభాగం నుంచి వెనక్కి తగ్గలని కోరారు. ఈ నేపథ్యంలో చర్చల అనంతరం సోమవారం ఉదయం చైనా సైనం వెనక్కి తగ్గింది.

కొనసాగుతున్న దోవల్ హవా...

మోదీ దేశ ప్రధాని అయ్యాక  అజిత్‌ దోవల్‌ని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)గా నియమించారు. వివిధ ఆపరేషన్లలో క్షేత్రస్థాయి అనుభవం ఉన్న దోవల్‌కి సమర్థవంతమై అధికారిగా మంచి గుర్తింపు ఉంది. ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే ఇరాక్‌లో ఐసిస్‌ దాడుల్లో చిక్కుకున్న 45 మంది భారతీయ నర్సుల్ని క్షేమంగా స్వదేశానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. 2015 జనవరిలో జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి అన్నింటా చైనాకు వత్తాసు పలుకుతున్న అప్పటి అధ్యక్షుడు మహింద రాజపక్సను గద్దె దించడంలోనూ దోవల్‌ వ్యూహ రచన చేశారని పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపించాయి. 

గతంలో మణిపూర్‌లో మన సైన్యానికి చెందిన వాహనశ్రేణిపైన దాడిచేసి 18 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న తీవ్రవాదులపైన ప్రతీకారంగా మన సైన్యం మయన్మార్‌లోకి వెళ్లి మెరుపుదాడి చేసి 40 మంది తీవ్రవాదుల్ని హతమార్చింది. దీని వెనుకా అజిత్‌ హస్తం ఉంది. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ విషాయాల్లో మోదీ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేస్తూ అజిత్‌ దోవల్‌ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా చైనా వివాదాన్ని పరిష్కరించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు.

లద్దాఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన వెనుక దోవల్ వ్యూహరచన

చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రగులుతున్న సమయంలో సాక్షాత్తూ మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ లేహ్‌లోని కుషోక్ బకులా రింపోచీ విమానాశ్రయంలో దిగిన ఘటన మన సైనికులతో పాటు దేశ ప్రజలందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.  ప్రధాని సరిహద్దుల్లో ఆకస్మిక పర్యటన వెనుక దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, సైనికదళాల అధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ముకుంద్ నారావణేలు తెరవెనుక వ్యూహరచన చేశారని సమాచారం. ప్రధాని మోదీ లేహ్ విమానాశ్రయంలో దిగే వరకూ ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా అజిత్ దోబాల్ సమన్వయం చేశారని వెల్లడైంది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో రెండువారాల పాటు స్వీయ నిర్బంధం విధించుకున్న అజిత్ దోబాల్ ఢిల్లీలో ఉండి ప్రధాని మోదీ లద్దాఖ్ పర్యటనను సమన్వయ పర్చారని అధికారవర్గాల ద్వారా తెలిసింది.

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle