newssting
BITING NEWS :
మహారాష్ట్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికతో కూడిన మహావికాస్ ఆఘాదీ ప్రభుత్వం స్వయంగా కుప్పకూలిపోతుందన్న ఫడణవీస్. కూటమిని అధికారం నుంచి తొలగించడానికి బీజేపీ ఏం చేయనవసరం లేదని చెప్పిన ఫడణవీస్ * బీహార్ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయం. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించేందుకు వీలుగా 30వేల మంది కేంద్ర బలగాల జవాన్లతో ఏర్పాటు చేయనున్న బందోబస్తు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో కేంద్ర అదనపు బలగాలతో రక్షణ * చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల అగ్రరాజ్యంలోని దిగ్గజ కంపెనీల ఆగ్రహం. 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో కేసులు వేసిన 3,500 కంపెనీలు * కర్ణాటక రాష్ట్రం కలబుర్గి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సావళగి క్రాస్‌ అళంద రోడ్డుపై తెల్లవారుజామున రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి. నెలలు నిండిన మహిళకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రమాదం * 286వ రోజుకు చేరుకున్న అమరావతి రాజధాని రైతుల ఉద్యమం. గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం * ఏపీ‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి. బ్రహ్మోత్సవాల అనంతరం స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వెల్లంపల్లి * ప్రకాశం బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న కృష్ణా నది. కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. ప్రాజెక్టు వద్ద 6,65,925 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచన * తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ * యాదాద్రి-భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం ప్రొద్దుటూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాని కుప్పకూలిన పెంకుటిల్లు. అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు. శబ్దాన్ని గమనించిన నలుగురు కుటుంబ సభ్యులు వెంటనే బయటకు రావడంతో తప్పిన ప్రాణాపాయం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. 20 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. 4,19,454 క్యూసెక్కులుగా ఉన్న ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 310.252 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు * రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు తెలంగాణ ఎంసెట్ పరీక్ష. ఉదయం, మధ్యాహ్నం రెండు షెషన్‌లలో పరీక్ష నిర్వహణ. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం 84 సెంటర్లలో పరీక్షను నిర్వహణ. తెలంగాణలో 67, ఆంధ్రాలో 17 పరీక్షా కేంద్రాలు

దోవల్ కి కోపం వచ్చిందా.. ఎస్‌సీవో భేటీనుంచి బాయ్‌కాట్

16-09-202016-09-2020 07:29:01 IST
Updated On 16-09-2020 07:28:59 ISTUpdated On 16-09-20202020-09-16T01:59:01.925Z16-09-2020 2020-09-16T01:57:46.725Z - 2020-09-16T01:58:59.401Z - 16-09-2020

దోవల్ కి కోపం వచ్చిందా.. ఎస్‌సీవో భేటీనుంచి బాయ్‌కాట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌కి చెందిన కశ్మీర్‌, జునాగఢ్‌లను తన దేశంలో అంతర్భాగంగా పేర్కొంటూ పాకిస్థాన్‌ రూపొందించిన పటంపై నిరసన వ్యక్తం చేస్తూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్.. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సభ్య దేశాల సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. రష్యా అధ్యక్షతన మంగళవారం ఆన్‌లైన్‌ ద్వారా ఎస్‌సీవో సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాకిస్థాన్‌ ప్రతినిధి మయీద్ యూసఫ్ కూడా పాల్గొన్నారు.

కశ్మీర్‌, జునాగఢ్‌లను తమ దేశంలో అంతర్భాగంగా చూపుతూ రూపొందించిన పటం ముందు పాక్ ప్రతినిధి కూర్చున్నారు. ఈ విషయాన్ని గమనించిన దోవల్.. ఆతిథేయి రష్యాను సంప్రదించిన అనంతరం సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ తెలిపారు. 

అత్యున్నత సమావేశానికి ఆతిధ్యం ఇచ్చిన రష్యాను ఘోరంగా అగౌరవిస్తూ అత్యంత వివాదాస్పదమైన మ్యాప్‌ను పాకిస్తాన్ ప్రదర్శించినందుకు నిరసనగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశం నుంచి వైదొలిగారని అనురాగ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. 

తాము ఊహించినట్లుగానే పాకిస్తాన్ ఈ అత్యున్నత సమావేశాన్ని కూడా దుష్ప్రచారానికి వాడుకోవాలని చూసిందని శ్రీవాస్తవ తెలిపారు. పైగా దోవల్ సమావేశంనుంచి బయటకువెళ్లిపోక ముందే షాంగై సహకార సంస్థ తమ దేశ నూతన రాజకీయ పటాన్ని గౌరవించడానికి అంగీకరించినట్లు పాక్ అధికార పార్టీ పీటీఐ పేర్కొంది. 

కశ్మీర్‌కు ఆర్టికల్ 370 కింద ప్రత్యేక ప్రతిపత్తిని భారతప్రభుత్వం ఉపసంహరించుకుని సంవత్సరం పూర్తయిన సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్, జునాగఢ్ ప్రాంతాలను చేర్చిన కొత్త మ్యాప్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

ఈ కొత్త మ్యాప్ జమ్మూ కశ్మీర్‌ని వివాదాస్పద ప్రాంతంగా చూపిస్తూనే సియాచిన్ కూడా పాక్ భూభాగంలోనిదిగానే చిత్రించింది. పైగా చైనా అక్రమంగా స్వాధీనం చేసుకున్న అక్సాయ్ చిన్ సరిహద్దులను చిత్రించకుండా పాక్ కొత్త మ్యాప్ పక్కన పెట్టింది. ఇది పాకిస్తాన్ నాయకత్వం రాజకీయ అసంబద్ధతకు నిదర్శనమంటూ భారత్ అప్పట్లోనే కొట్టిపడేసింది.

 

అన్ లాక్ 5.0...కరోనా వ్యాప్తికి ఆహ్వానం కానుందా?

అన్ లాక్ 5.0...కరోనా వ్యాప్తికి ఆహ్వానం కానుందా?

   10 hours ago


ఢిల్లీలో ట్రాక్టర్ తగలబెట్టిన రైతులు.. ప్రభుత్వం పట్టించుకునేనా

ఢిల్లీలో ట్రాక్టర్ తగలబెట్టిన రైతులు.. ప్రభుత్వం పట్టించుకునేనా

   13 hours ago


గడ్డకట్టే చలిలో పోరుకు భారత్ సైన్యం రెడీ..

గడ్డకట్టే చలిలో పోరుకు భారత్ సైన్యం రెడీ..

   15 hours ago


ఆదివాసీలపై అంతటి దారుణాలా..!

ఆదివాసీలపై అంతటి దారుణాలా..!

   27-09-2020


ఓ వైపు ఎన్డీయేకు పార్టీలు దూరం.. మరో వైపు వ్యవసాయ బిల్లు ఆమోదం

ఓ వైపు ఎన్డీయేకు పార్టీలు దూరం.. మరో వైపు వ్యవసాయ బిల్లు ఆమోదం

   27-09-2020


అక్టోబర్ 1 నుండి సినిమా థియేటర్లు ఓపెన్

అక్టోబర్ 1 నుండి సినిమా థియేటర్లు ఓపెన్

   27-09-2020


బీజేపీ సీనియర్ నేత జశ్వంత్‌ సింగ్ ఇక లేరు ‌

బీజేపీ సీనియర్ నేత జశ్వంత్‌ సింగ్ ఇక లేరు ‌

   27-09-2020


మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ఇంకా నిరీక్షించాలా.. మోదీ విమర్శ

మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ఇంకా నిరీక్షించాలా.. మోదీ విమర్శ

   27-09-2020


గొప్ప కూతురే.. తండ్రి లూడోలో మోసం చేశాడని కోర్టుకెక్కింది

గొప్ప కూతురే.. తండ్రి లూడోలో మోసం చేశాడని కోర్టుకెక్కింది

   27-09-2020


వ్యాక్సిన్ కొనుగోలుకు 80 వేల కోట్లు అవసరం.. సీరమ్ సీఈవో వెల్లడి

వ్యాక్సిన్ కొనుగోలుకు 80 వేల కోట్లు అవసరం.. సీరమ్ సీఈవో వెల్లడి

   27-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle