newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

దేశ సినీ పరిశ్రమని టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి: కంగనా

20-09-202020-09-2020 12:45:32 IST
Updated On 20-09-2020 13:22:32 ISTUpdated On 20-09-20202020-09-20T07:15:32.105Z20-09-2020 2020-09-20T07:15:26.936Z - 2020-09-20T07:52:32.806Z - 20-09-2020

దేశ సినీ పరిశ్రమని టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి: కంగనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం గత కొద్ది కాలంగా సినీ పరిశ్రమ అన్ని రకాలుగానూ రోజూ వార్తల్లో ఉంటుంది. సుశాంత్ మరణంతో బాలీవుడ్ లో పరిస్థితులు మారిపోయాయి. మరో పక్క డ్రగ్స్ కేసులతో అన్ని పరిశ్రమలు విల విలలాడుతున్నాయి. సుశాంత్ మరణం తర్వాత నుంచి ఇప్పటి వరకు సినీ పరిశ్రమకి సంబంధించిన అన్ని అంశాలపై బాలీవుడ్ హీరోయిన్ క్వీన్ కంగనా సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ఇప్పటికే అందరి పై ఆరోపణలు చేస్తూ చాలా మందికి శత్రువులా తయారయింది. తాను అన్ని నిజాలు చెప్తున్నప్పటికీ చాలా మంది ప్రముఖులు ఆ నిజాల్ని జీర్ణించుకోలేక ఆమె పై మాటల పరంగా, చేతల పరంగా దాడి చేస్తున్నారు. తాజాగా దేశంలోని సినీ పరిశ్రమల గురించి, సినీ పరిశ్రమలలో ఉన్న సమస్యల గురించి మాట్లాడింది.  

మన భారతీయ చిత్రసీమల్లో హిందీ పరిశ్రమ మాత్రమే పెద్దది అనుకోవడం పొరపాటు. తెలుగు పరిశ్రమ కూడా టాప్‌ ప్లేస్‌లో ఉంది అని వ్యాఖ్యానించింది కంగనా. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నోయిడాలో ఫిల్మ్‌ సిటీ నిర్మించాలనుకుంటున్నాం అని ఇటీవల తెలియచేశారు. దీనిపై కంగనా మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్‌గారి నిర్ణయం అభినందించదగ్గది. సినిమా పరిశ్రమలో ఇలాంటి సంస్కరణలు చాలా జరగాలి. అయితే భారతీయ సినిమా అంటే హిందీ మాత్రమే కాదు. అన్ని భాషల సినిమా. తెలుగు మేకర్స్‌ కూడా పాన్ ఇండియా సినిమాలు రూపొందించడానికి ముందుకు వస్తున్నారు. వివిధ కారణాల వల్ల ఒక్కో ఇండస్ట్రీగా మనందరం ఉన్నప్పటికీ మన పరిశ్రమలన్నీ కలసి ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీగా మారాలి. మనందరం ఇలా విడివిడిగా ఉండటం వల్ల డబ్బింగ్‌ అవుతున్న హాలీవుడ్‌ సినిమాలకు ఉపయోగకరంగా మారింది. ఉత్తమమైన ప్రాంతీయ చిత్రాలకు దేశవ్యాప్త గుర్తింపు లభించడం లేదు.

చాలా సినిమా పరిశ్రమలలో కరువవుతున్న నాణ్యత, మోనోపోలీ వల్లే ఇదంతా. మనందరం సినిమా పరిశ్రమను వివిధ టెర్రరిజమ్‌ల నుండి కాపాడాలి. వాటిని అంతం చేయాలి. ఆ టెర్రరిజమ్‌లు...

► నెపోటిజమ్‌ టెర్రరిజమ్‌

► డ్రగ్స్‌ మాఫియా టెర్రరిజమ్‌

► సెక్సిజమ్‌ టెర్రరిజమ్‌

► ప్రాంతీయ, మతపరమైన టెర్రరిజమ్‌

► విదేశీ సినిమాల టెర్రరిజమ్‌

► పైరసీ టెర్రరిజమ్‌

► శ్రమ దోపిడీ టెర్రరిజమ్‌

► ప్రతిభను దోచుకునే టెర్రరిజమ్

ఈ ఎనిమిది టెర్రరిజమ్‌ల నుంచి సినీ పరిశ్రమలని కాపాడాలి అని ట్వీట్‌ చేశారు కంగనా రనౌత్. ప్రస్తుతం కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఈ వ్యాఖ్యలకి మద్దతుగా నిలుస్తున్నారు.   

పార్లమెంట్ సాక్షిగా అడ్డంగా దొరికిపోయిన పాకిస్థాన్

పార్లమెంట్ సాక్షిగా అడ్డంగా దొరికిపోయిన పాకిస్థాన్

   13 minutes ago


అభినందన్‌ని వదలకపోతే భారత్ దాడి.. వణికిపోయిన పాక్ ఆర్మీ చీఫ్

అభినందన్‌ని వదలకపోతే భారత్ దాడి.. వణికిపోయిన పాక్ ఆర్మీ చీఫ్

   an hour ago


మా మధ్య మీ జోక్యమేంటి.. అమెరికాపై గయ్‌మన్న చైనా

మా మధ్య మీ జోక్యమేంటి.. అమెరికాపై గయ్‌మన్న చైనా

   an hour ago


వ్యాక్సిన్ వస్తుందనే ధీమాతో మాస్కులు వదిలేయడం డేంజర్

వ్యాక్సిన్ వస్తుందనే ధీమాతో మాస్కులు వదిలేయడం డేంజర్

   an hour ago


బయటివారు కశ్మీర్ వస్తే అత్యాచారాలు పెరుగుతాయి.. పీడీపీ నేత

బయటివారు కశ్మీర్ వస్తే అత్యాచారాలు పెరుగుతాయి.. పీడీపీ నేత

   14 hours ago


రజనీకాంత్ కి అనారోగ్య సమస్యలు..రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా?

రజనీకాంత్ కి అనారోగ్య సమస్యలు..రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా?

   20 hours ago


టిక్కెట్లు ర‌ద్దు చేసుకోండి.. డ‌బ్బులిస్తం

టిక్కెట్లు ర‌ద్దు చేసుకోండి.. డ‌బ్బులిస్తం

   a day ago


ఇదేంద‌య్యా  ఇది

ఇదేంద‌య్యా ఇది

   29-10-2020


ఈసారి కూడా ట్రంపే గెలిస్తే.. అది అమెరికాకు పెద్ద గుణపాఠం హిల్లరీ క్లింటన్

ఈసారి కూడా ట్రంపే గెలిస్తే.. అది అమెరికాకు పెద్ద గుణపాఠం హిల్లరీ క్లింటన్

   29-10-2020


త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేస్తున్నాము

త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేస్తున్నాము

   28-10-2020


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle