newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

దేశాధినేత‌లపై ప్రజల్లో నమ్మకం సడలుతోంది జాగ్రత్త.. డబ్ల్యుహెచ్ఓ వార్నింగ్

15-07-202015-07-2020 07:37:35 IST
Updated On 15-07-2020 09:56:06 ISTUpdated On 15-07-20202020-07-15T02:07:35.140Z15-07-2020 2020-07-15T02:07:31.966Z - 2020-07-15T04:26:06.474Z - 15-07-2020

 దేశాధినేత‌లపై ప్రజల్లో నమ్మకం సడలుతోంది జాగ్రత్త.. డబ్ల్యుహెచ్ఓ వార్నింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మీ పని తీరు అధ్వాన్నం.. దేశాధినేతలకు డ‌బ్ల్యూహెచ్‌ఓ అక్షింతలు 

చాలా దేశాలు తప్పుడు విధానాలు అవలంబిస్తున్నాయి.. డ‌బ్ల్యూహెచ్‌ఓ

మరింత అధ్వాన్నంగా మారనున్న పరిస్థితి

ఇప్పట్లో సాధారణ స్థితి వచ్చే ఆశ లేదు

ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి చాలా తీవ్రతరం అవుతోందని, సమీప భవిష‍్యత్తులో తిరిగి సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం కనిపించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డ‌బ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని డ‌బ్ల్యూహెచ్‌ఓ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ టెడ్రోస్ అథ‌న‌మ్ గేబ్రియేసన్‌ తాజాగా సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభింస్తున్న తీరుపై సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 

యూరోప్‌, ఆసియా దేశాలు మహమ్మారి కట్టడిలో కొంత విజయం సాధించినప్పటికీ చాలా వ‌ర‌కు ప్ర‌పంచ దేశాలు వైర‌స్‌ను ఎదుర్కొనే అంశంలో త‌ప్పుడు  విధానాలు అవలంబిస్తున్నాయని టెడ్రోస్‌ వ్యాఖ్యానించారు. పటిష్టమైన చ‌ర్య‌ల‌ను తీసుకోని కారణంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. 

జెనీవాలో రెండురోజుల క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన నిర్దిష్టంగా నాయకుల పేర్లను ప్రస్తావించకుండానే  దేశాధినేతలపై విమర్శలు చేశారు. మ‌హ‌మ్మారి నియంత్ర‌ణ‌లో దేశాధినేత‌ల మిశ్ర‌మ సందేశాలతో అత్యంత కీలకమైన విశ్వాసం ప్ర‌జ‌ల్లో స‌న్న‌గిల్లుతోందని టెడ్రోస్ ఆరోపించారు. వైరస్‌ విస్తరణను అడ్డుకునేందుకు ప్రజల్లో అవగాహనతోపాటు ఆయా ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సమగ్ర చర్యలు తీసుకోకపోతే, పటిష్టమైన చర్యలు చేపట్టకపోతే పరిస్థితి మరింత దారుణంగా దిగజారి పోనుందంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

సామాజిక దూరం, హ్యాండ్‌వాష్‌, మాస్క్‌ల‌ను ధ‌రించ‌డం లాంటి అంశాల‌పై ప్రజలు, ప్రభుత్వాలు దృష్టిపెట్టాలన్నారు. లేదంటే మ‌రింత అధ్వాన్న‌ప‌రిస్థితుల‌కు దారి తీస్తుందని  టెడ్రోస్‌  హెచ్చ‌రించారు.  అంతేకాదు జాగ్రత్తలు పాటించకపోతే  ఇప్పట్లో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన‌డం సాధ్యం కాదని పేర్కొన్నారు.

కాగా అమెరికాలో రికార్డు స్థాయిలో ఒక రోజులో 63,998 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు అమెరికాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 34,77,993కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 1,38,234కి చేరింది.  భారతదేశంలో ఒక రోజులో రికార్డు స్థాయిలో  27,151 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 540 మందికి పైగా ఈ వ్యాధితో మరణించారు. దీంతో మొత్తం కేసులు 9 లక్షలు దాటాయి. అటు ఒక రోజులో 276 కంటే ఎక్కువ  మరణాలతో మెక్సికో ఇటలీని అధిగమించింది. రోజు రోజుకు కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంతో డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది.  

భయం గుప్పిట్లో అమెరికా! మాట వినకపోతే అంతే మరి..

అదుపులోకి వస్తోందని భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా కరోనా వైరస్‌ విజృంభించడంతో అమెరికా వణికిపోతోంది. వైరస్‌పై పోరాటానికి సమగ్ర వ్యూహాన్ని చేపట్టని పక్షంలో అన్ని దేశాల్లో వైరస్‌ ఇలాగే విజృంభిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ‘ప్రపంచవ్యాప్తంగా  కరోనా మహమ్మారి అత్యంత ప్రమాదకారిగా మారుతోంది. కొన్ని దేశాల్లో వైరస్‌ అదుపులోకి వచ్చినా చాలా దేశాల్లో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది.’ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ టెడ్రోస్‌ అథనామ్‌ గెబ్రెయేసెస్‌ అన్నారు.

సముద్రంపై ఉన్నా సోకిన కరోనా.. తల పట్టుకుంటున్న అర్జెంటీనా

ఆ నావికులకు కరోనా ఎలా సోకిందనే దానిపై అర్జెంటీనా తల పట్టుకుంటోంది.  ఎకియన్‌ మారు అనే చేపలు పట్టే నౌక ఒకటి 61మంది సిబ్బందితో ఉషుయా నౌకాశ్రయం నుంచి బయలుదేరింది. ఆ సమయంలో వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా నెగిటివ్‌ వచ్చింది. 35 రోజులు సముద్రంపై ప్రయాణించిన నౌక.. టియెర్రా చేరుకుంది. సిబ్బంది అందరికీ మళ్లీ వైద్య పరీక్షలు చేయగా.. ఏకంగా 57మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వారు సముద్రంపై ఉన్నప్పటికీ కరోనా బారిన ఎలా పడ్డారనే చిక్కుముడిని విప్పేందుకు అర్జెంటీనా అన్వేషణ ప్రారంభించింది.

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle