newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న కేసులు.. తగ్గుతున్న మరణాల రేటు

29-07-202029-07-2020 12:28:51 IST
Updated On 29-07-2020 12:50:14 ISTUpdated On 29-07-20202020-07-29T06:58:51.602Z29-07-2020 2020-07-29T06:58:42.326Z - 2020-07-29T07:20:14.210Z - 29-07-2020

దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న కేసులు.. తగ్గుతున్న మరణాల రేటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు ప్ర‌పంచంలోకెల్లా భార‌త్‌లో అత్యంత వేగంగా క‌రోనా వ్యాప్తి చెందుతోందని అంతర్జాతీయ అధ్యయన సంస్థలు కోడై కూస్తున్నాయి. మరోవైపున దేశంలో కరోనా వైరస్‌ బారినపడి, చికిత్సతో కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 24 గంటల్లో రికార్డుస్థాయిలో 35,176 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్‌ కేసులు 14,83,156 కాగా, 9,52,743 మంది పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి ఇళ్లకు చేరుకున్నారు. అంటే 64.24 శాతం మంది కోలుకున్నట్లు స్పష్టమవుతోంది. రికవరీ రేటు 40 రోజుల క్రితం 53 శాతంగా ఉండేది. 

దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 9,52,743కు చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,96,988గా ఉంది. మరోవైపు గత 24 గంటల్లో దేశంలో 47,703 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో మంగళవారం రాత్రికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. కొత్తగా 654 మరణాలు నమోదు కావడంతో మొత్తం మరణాల సంఖ్య 33,425కు చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

కరోనా మరణాల రేటు కూడా రోజురోజుకూ తగ్గిపోతోంది. జూన్‌ 18న 3.33 శాతం కాగా, ప్రస్తుతం 2.25 శాతంగా నమోదైంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇది స్వల్పమే కావడం సానుకూలాంశం. కరోనా కొత్త కేసులు, మరణాలు కొంత తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 24 గంటల్లో కొత్తగా 47,703 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 654 మంది బాధితులు మరణించారు. దేశంలో మొత్తం మరణాలు 33,425కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలియజేసింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 4,96,988.  

ప‌్ర‌పంచంలోని ఇత‌ర దేశాల‌తో పోల్చిచూస్తే కరోనా మహమ్మారి ప్ర‌స్తుతం భారతదేశంలో అత్యంత వేగంగా విస్త‌రిస్తోంది. బ్లూమ్‌బ‌ర్గ్ కరోనా వైరస్ ట్రాకర్ తెలిపిన గ‌ణాంకాల ప్ర‌కారం ఈ వైర‌స్ వ్యాప్తి మునుపటి వారంతో పోలిస్తే 20 శాతం మేర‌కు పెరిగింది. మొత్తం కరోనా కేసుల విషయానికొస్తే అమెరికా, బ్రెజిల్ కంటే భారత్ వెనుకబడి ఉంది. భారత్‌,‌ బ్రెజిల్‌ల‌లో క‌రోనా టెస్టులు త‌క్కువ‌గా జ‌రుగుతున్నాయి. భారత్‌లో ప్ర‌తీ వెయ్యి మందిలో 11.8 శాతం, బ్రెజిల్‌లో 11.93 శాతం పరీక్షలు నిర్వ‌హిస్తున్నారు. అమెరికాలోని ప్ర‌తీ వెయ్యి మందిలో 152.98 శాతం, రష్యాలో 184.34 శాతం పరీక్షలు జరుగుతున్నాయి. 

మంగళవారం వరుసగా ఆరోరోజు దేశంలో కొత్త‌గా 45 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య 47,704. ఇదేసమయంలో 654 మంది క‌రోనాతో మృతిచెందారు. 35,176 మంది క‌రోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత ఐదు రోజుల‌లో కరోనాను ఓడించిన వారి సంఖ్య 30 వేలను మించ‌డం విశేషం. అలాగే రికవరీ రేటు 64.23 శాతానికి చేరుకుంది. మరణాల రేటు 2.25 శాతానికి పెరిగింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, క‌ర్నాట‌క‌లో అత్య‌ధిక క‌రోనా కేసులు ఉన్నాయి. 

మూడు రాష్ట్రాల్లో కేసులు తగ్గడంతో దేశంలో కేసుల సంఖ్య 50 వేలలోపు ఉంటున్నాయి. ఢిల్లీలో 42, ఏపీలో 20, మహారాష్ట్రలో 16 మేర రోజువారీ కరోనా కేసులు తగ్గాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో 7,924 కేసులు, 227 మరణాలు నమోదయ్యా యి. ఢిల్లీలో 1,056 కేసులు, యూపీలో 3,458, కర్ణాటకలో 5536, తమిళనాడులో 6972, ఒడిసాలో 1,215 కేసులు రికార్డయ్యాయి. 

దక్షిణాదిలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తమిళనాడులో 88 మరణాలు నమోదయ్యాయి. పుదుచ్ఛేరిలో 141 కొత్తకేసులు రికార్డవ్వగా.. సీఎం వి.నారాయణ స్వామి, మంత్రులకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఓ ఎమ్మెల్యేకు కరోనా రావడంతో వారంతా పరీక్షలు చేయించుకున్నారు. కర్ణాటకలో 102 మంది మరణించారు. మాజీ మంత్రి రాజమదన్‌ గోపాల్‌ నాయక్‌(69) కూడా కరోనాతో మృతి చెందారు. హాట్‌స్పాట్‌ ముంబైలో 700 కొత్త కేసులే నమోదయ్యాయి.

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   4 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   11 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   12 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle