newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌.. ఈ నిబంధనలు పాటించాల్సిందే!

19-03-202019-03-2020 09:07:47 IST
2020-03-19T03:37:47.742Z19-03-2020 2020-03-19T03:37:41.110Z - - 03-08-2020

దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌.. ఈ నిబంధనలు పాటించాల్సిందే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ పెరిగిపోతున్న నేపథ్యంలో మార్చి 31వరకు దేశంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేసింది. అన్ని థియేటర్లు, వ్యాయామశాలలు, మ్యూజియంలు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు, ఈత కొలనులు మూసేయాలని నిర్దేశించింది. 

విద్యార్థులంతా ఇళ్లకే పరిమితం కావాలని, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్‌ విద్యను ప్రోత్సహించాలని సూచించింది. సామాజికంగా ఒకరికొకరు దూరంగా ఉండడమే కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నివారణకు మంచి మార్గమని పేర్కొంటూ కేంద్ర వైద్యారోగ్యశాఖ 15 నిబంధనలను విధించింది. ఇందుకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఏవైనా చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చని సూచించింది. మార్చి 31 తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి వీటిని సమీక్షిస్తామని పేర్కొంది. కేంద్రం 15 షరతులు నిర్దేశించింది.

కేంద్రం నిర్దేశించిన 15 షరతులు ఏంటంటే...?

1 అన్ని విద్యాసంస్థలను మూసివేయాలి. 

2 సమావేశాలు సాధ్యమైనంత మేరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించాలి. అత్యవసరమైతే తప్ప ఎక్కువమంది గుమిగూడే సమావేశాలు పెట్టుకోరాదు. అందులో పాల్గొనేవారి సంఖ్యను సాధ్యమైనంతమేర తగ్గించాలి.

3 అన్ని రెస్టారెంట్లలో చేతులు శుభ్రం చేసుకొనే ప్రొటోకాల్‌ అమలుచేయాలి. వినియోగదారులు తాకేందుకు వీలున్న టేబుళ్లు, కుర్చీలు, స్థలాలను నిరంతరం శుభ్రపరుస్తూ ఉండాలి. ప్రతి టేబుల్‌కి మధ్య కనీసం మీటర్‌ దూరం ఉండేలా చూడాలి. వీలైతే ఆరుబయట సీటింగ్‌ ఏర్పాట్లు చేసి సాధ్యమైనంత దూరం ఉంచాలి.

4 తప్పనిసరిగా పరిశుభ్రత, భౌతిక దూరం పాటించాలి. కరచాలనం, కౌగిలించుకోవడం వంటి సంప్రదాయాలకు దూరంగా ఉండాలి.

5 ఆన్‌లైన్‌ వస్తువులను డెలివరీ చేసే వారికి తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలి.

6 సమాజానికి నిరంతరంగా సమాచారాన్ని అందించాలి.

7 పరీక్షలు వాయిదా వేయడానికి ప్రయత్నించాలి. విద్యార్థుల మధ్య కనీసం మీటర్‌ దూరం పాటించగలిగితేనే ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను కొనసాగించాలి.8 మతపరమైన కార్యకలాపాలు, సభల్లో పెద్దఎత్తున ప్రజలు గుమిగూడకుండా స్థానిక అధికారులు.. నాయకులు, మతపెద్దలతో మాట్లాడి నచ్చజెప్పాలి. విధిలేని పరిస్థితి ఉంటే ప్రతి ఒక్కరి మధ్య కనీసం ఒక మీటరు దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

9 పనివేళల విషయంలో అధికారులు వాణిజ్య సంఘాలు, ఇతర భాగస్వామ్యపక్షాలతో అధికారులు మాట్లాడాలి. ప్రజలకు అత్యవసరమైన కూరగాయల మార్కెట్లు, పండ్ల మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పోస్టాఫీసులు లాంటిచోట్ల  ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను బహిరంగంగా ప్రదర్శించాలి.

10 వీలైనచోటల్లా ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే వీలు కల్పించేలా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలి.

11 ఇప్పటికే నిర్ణయించిన పెళ్లిళ్లలో పరిమితంగా జనం ఉండేలా చూసుకోవాలి. అనవసరమైన సామాజిక, సాంస్కృతిక సమావేశాలు వాయిదా వేసుకోవాలి.

12 క్రీడా కార్యక్రమాలు, పోటీలను వాయిదా వేసుకొనేలా స్థానిక అధికారులు వాటి నిర్వాహకులకు నచ్చజెప్పాలి.

13 వ్యాపార సంస్థలు తమదగ్గరకు వచ్చే వినియోగదారుల మధ్య మీటరు దూరం ఉండేలా చేయాలి. రద్దీ వేళల్లో ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలి.

14 కోవిడ్‌-19 విషయంలో ఆసుపత్రులు ప్రొటోకాల్‌ అనుసరించాలి. ఆసుపత్రిలో రోగులను చూసేందుకు కుటుంబీకులు, పిల్లలను అనుమతించరాదు.

15 అనవసరమైన ప్రయాణాలు రద్దుచేసుకోవాలి. అన్ని సాధనాలనూ తగిన విధంగా శుభ్రం చేయాలి.

ఇతర దేశాలకు ప్రయాణాలు మానుకోవాలని కేంద్రం సూచించింది. యూఏఈ, ఖతార్‌, ఒమన్‌, కువైట్‌ నుంచి వచ్చే ప్రయాణికులు 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలి. ఇది 18న అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నెల 18 నుంచి ఐరోపా సమాఖ్య, ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం దేశాలు, టర్కీ, బ్రిటన్‌ నుంచి వచ్చే వారిపై (భారతీయులు సహా) పూర్తి నిషేధం విధింపు. ఈ దేశాలకు చెందిన ప్రయాణికులకు విమానాలు (కనెక్టెడ్‌ ఫ్లైట్స్‌) అవకాశం కల్పించకూడదు. ఈ నిర్ణయాలు మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో 10, 12 తరగతులకు జరుగుతున్న బోర్డు పరీక్షలను సీబీఎస్‌ఈ(సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) మార్చి 31 వరకు వాయిదావేసింది. ‘భారత్‌లో, విదేశాల్లో జరుగుతున్న క్లాస్‌ 10, క్లాస్‌ 12 పరీక్షలను మార్చి 31 వరకు వాయిదా వేస్తున్నాం. ఆ పరీక్షలను తదుపరి ఎప్పుడు నిర్వహించేదీ.. పరిస్థితులను సమీక్షించి, త్వరలో ప్రకటిస్తాం’ అని సీబీఎస్‌ఈ ప్రకటించింది. 

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle