newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గిన మరణాల రేటు.. 11 లక్షల 55 వేలకు పెరిగిన కేసులు

22-07-202022-07-2020 06:55:02 IST
2020-07-22T01:25:02.631Z22-07-2020 2020-07-22T01:24:36.674Z - - 11-08-2020

దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గిన మరణాల రేటు.. 11 లక్షల 55 వేలకు పెరిగిన కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచం మొత్తం మీద కోవిడ్-19 మరణాల రేటు భారత్‌లోనే అత్యంత తక్కువ శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్పలితాలను ఇస్తున్నాయని పేర్కొంది. జూన్‌ 17వ తేదీన 3.36 శాతంగా ఉన్న మరణాల రేటు ప్రస్తుతం 2.43 శాతానికి పడిపోయిందని పేర్కొంది. దేశంలో 24 గంటల్లో మరో 37,148 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసులు 11,55,191కు చేరుకున్నాయని తెలిపింది. యాక్టివ్‌ కేసులు 4,02,529 కాగా, కోలుకున్న బాధితుల సంఖ్య కూడా 7,24,577కు చేరుకుని, రికవరీ రేటు 62.72 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. 

కరోనా వైరస్‌తో ఒక్క రోజులోనే మరో 587 మంది మృతి చెందడంతో ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య 28,084కు చేరుకుంది. దేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివ్‌ రేటు జాతీయ స్థాయి 8.07 శాతం కంటే తక్కువగానే ఉన్నట్లు కేంద్రం తెలిపింది. రోజుకు ప్రతి 10 లక్షల జనాభాకు 140 పరీక్షలు చేస్తే పాజిటివ్‌ రేటు క్రమంగా 5కు, అంతకంటే తక్కువకు దిగి వస్తుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌–19తో ప్రతి 10 లక్షల మందిలో సరాసరిన 77 మంది చనిపోతుండగా, భారత్‌లో అది 20.4 మాత్రమేనని కేంద్రం పేర్కొంది. ఈ నెల 20వ తేదీ వరకు దేశంలోని వివిధ ల్యాబ్‌ల్లో 1,43,81,101 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. 

20 రోజుల్లోనే 6 ల‌క్ష‌ల క‌రోనా కేసులు... అన్ని రికార్డులు బ‌ద్ద‌లయ్యాయ్!

కరోనా మరణాల సంఖ్య ప్రకారం భారతదేశం ప్రపంచంలో ఏడవ స్థానానికి చేరుకుంది. పైగా దేశంలో ఈనెల‌లో ఇప్ప‌టికే 6 ల‌క్ష‌ల క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇది ఇంతకుముందు నెలల్లో న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య కంటే చాలా ఎక్కువ. జూన్ 30 నాటి వ‌ర‌కూ దేశంలో ఈ అంటువ్యాధి బారిన‌ప‌డిన‌వారి సంఖ్య 5.9 లక్షలు. ఈ నెలలో కరోనా కారణంగా ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం 11 వేల మంది మరణించారు. దేశంలో చోటుచేసుకున్న‌ మొత్తం మరణాలలో ఇది 40 శాతం. క‌రోనా కార‌ణంగా మంగళవారం దేశంలో 670 మంది మృతిచెందారు. దీంతో భారతదేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 28,723 కు పెరిగింది. 

దేశంలో కోవిడ్ -19 బాధితుల సంఖ్య 11.9 లక్షలకు పెరిగింది. వీరిలో 7.5 లక్షల మంది కోలుకున్నారు. 4.1 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో మంగళవారం కొత్త కేసుల‌ సంఖ్య మళ్లీ పెరిగింది. నూతనంగా 1,349 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 27 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కోవిడ్ -19 బాధితుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 8,369 కేసులు న‌మోద‌య్యాయి. వీటిలో ముంబైలో న‌మోదైన కేసులు 992 ఉన్నాయి. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌లో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 3 లక్షల 27 వేల 31కు చేరింది. ముంబైలో మొత్తం క‌రోనా రోగుల సంఖ్య ఒక‌ లక్ష 3 వేల 368గా ఉంది. 

డిల్లీ ప్రజల్లో 23 శాతం మంది శరీరాల్లో యాంటీబాడీస్ వృద్ధి చెందడం సానుకూల వైఖరేనని నీతి ఆయోగ్‌కి చెందిన డాక్టర్ వికె పాల్ చెప్పారు. ఈ తాజా సర్వే రిపోర్టు చాలా ముఖ్యమైనదని, భవిష్యత్తులో వ్యాధి నియంత్రణకు ఇది గణనీయంగా తోడ్పడుతుంది చెప్పారు.

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   3 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   4 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   6 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   14 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle