newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

దేశచరిత్రలో నూతన ఉషోదయం, న్యాయ చరిత్రలో సువర్ణాధ్యాయం : మోదీ

10-11-201910-11-2019 10:16:33 IST
2019-11-10T04:46:33.558Z10-11-2019 2019-11-10T04:46:30.127Z - - 09-08-2020

దేశచరిత్రలో నూతన ఉషోదయం, న్యాయ చరిత్రలో సువర్ణాధ్యాయం : మోదీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు దేశచరిత్రలో నూతనాధ్యాయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శతాబ్దాల వివాదానికి శాంతియుత ముగింపు పలికిన ఈ నవంబర్ 9వ తేదీ భారత న్యాయచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిందన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత బలమని మరోమారు నిరూపితమైందని, తీర్పును సమాజంలోని అన్నివర్గాలు సహృదయంతో ఈ తీర్పును ఆమోదించడమే ఇందుకు నిదర్శమని చెప్పారు. 

అయోధ్యపై సుప్రీం తీర్పు నేపథ్యంలో శనివారం సాయంత్రం ప్రధాని జాతిని ఉద్దేశించి మాట్లాడారు. నవంబర్‌ 9న బెర్లిన్‌ గోడ కూలిన ఘటనను ఆయన గుర్తు చేశారు. ఈ రోజే కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభమవుతోందని కూడా చెప్పారు. ఇది అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలనే సందేశం అందిన రోజని ఆయన చెప్పారు. అనవసర భయాలు, విద్వేషాలు, నెగిటివ్‌ ఆలోచనలు వదిలి జనమంతా సరికొత్త భారతావని నిర్మాణానికి కలిసిరావాలన్నారు.

అత్యున్నత న్యాయస్థానం అందరి వాదనలు ఓపికతో విని ఏకాభిప్రాయ తీర్పును ఇచ్చిందని మోదీ చెప్పారు. ఈ వివాదం తరాలుగా సాగుతూ వస్తోందని, కానీ తాజా తీర్పుతో కొత్త భారతావని నిర్మాణానికి పూనుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రోజు మన ప్రజాస్వామ్యం ఎంత బలమైందో, ఎంత గొప్పదో ప్రపంచమంతా మరోమారు గుర్తిస్తుందన్నారు. ఇకపై అంతటా శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. 

వందల ఏళ్లుగా నలుగుతున్న కీలక అంశంపై కోర్టు ఇచ్చిన తీర్పును మోదీ ప్రస్తుతించారు. ఈ విషయమై రోజూ విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని దేశమంతా కోరిందని, సుప్రీంకోర్టు ఈ కోరికను సమర్ధవంతంగా నెరవేర్చిందని తెలిపారు. 

శాంతి, సామరస్యం, ఐక్యత అనేవి ప్రస్తుతం దేశాభివద్ధికి కీలకమైన ఆదర్శభావాలుగా నిలుస్తున్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. మనం ఇక భవిష్యత్తు కేసి చూడాలి. అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి. మన ముందు ఇంకా అనేక సవాళ్లు ఎదురు కానున్నాయి. మరిన్ని లక్ష్యాలను జాతి మొత్తం కలిసికట్టుగా సాధించాల్సిన అవసరముంది. అలా కలిసి నడుస్తామనే ప్రతిజ్ఞ చేస్తూ రానున్న పర్వదినాల సందర్భంగా భారత ప్రజలకు నేను శుభాకాంక్షలు చెబుతున్నాను అని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

శనివారం ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పునివ్వడానికి ముందు, శుక్రవారం రాత్రి ప్రధాని హిందీలో వరుసగా మూడు ట్వీట్లు చేశారు. ‘‘అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వస్తోంది. గత కొద్ది నెలలుగా ఈ వ్యాజ్యంపై సుప్రీం కోర్టు తరచుగా వాదనలు విన్నది. ఈ సమయంలో సమాజంలోని అన్ని వర్గాలూ సద్భావనతో మెలిగేందుకు చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయం. దేశంలో శాంతి, సామరస్యపూర్వక, సానుకూల వాతావరణాన్ని నెలకొల్పేందుకు.. సమాజంలోని అన్ని వర్గాలూ చేసిన కృషి స్వాగతించదగ్గది. కోర్టు తీర్పు తర్వాత కూడా మనమంతా కలిసి ఇదే సామరస్యాన్ని కొనసాగించాలి. అయోధ్యపై ఎలాంటి తీర్పు వచ్చినా అది ఎవరి గెలుపు, ఓటములకు సంబంధించిన విషయం కాదు’ అని పేర్కొన్నారు. 

అయోధ్య వివాదంలో భాగస్వాములైన అన్ని పక్షాలతో తెరవెనుక సంప్రదింపులు జరిపించి ఎలాంటి తీర్పు వచ్చినా పరిస్థితి దిగజారిపోకుండా తీర్పు సారాంశాన్ని అందరం అంగీకరిద్దామని మోదీ ఒప్పించిన తీరు భారత రాజకీయాల్లో తనకు చిరస్థాయిని కల్గించింది. ఇది మోదీ సాధించిన వ్యక్తిగత విజయాలకు పరాకాష్ట అని రాజకీయ పండితులు చెబుతున్నారు.

 

 

 

 

 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   14 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   17 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle