newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

దేశం నెత్తిన 'బోస్టన్' రిపోర్టు పిడుగు: జూన్ వరకు లాక్ డౌన్ పొడిగింపు?

04-04-202004-04-2020 13:49:07 IST
Updated On 04-04-2020 14:01:31 ISTUpdated On 04-04-20202020-04-04T08:19:07.777Z04-04-2020 2020-04-04T08:19:04.202Z - 2020-04-04T08:31:31.852Z - 04-04-2020

దేశం నెత్తిన 'బోస్టన్' రిపోర్టు పిడుగు: జూన్ వరకు లాక్ డౌన్ పొడిగింపు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారు అనే విషయంలో గుంభనంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం జూన్ వరకు లాక్ డౌన్‌ పొడిగించే ఉద్దేశంతో ఉందా.. ప్రపంచ ప్రసిద్ధ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ తాజా నివేదిక ప్రకారం ఈవిషయం నిజమేననిపిస్తోంది. దేశంలో లాక్‌డౌన్‌ను జూన్‌ నాలుగో వారం వరకు కొనసాగించే అవకాశం ఉంది. అప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోతే సెప్టెంబర్‌ వరకు కొనసాగినా అశ్చర్యపోవాల్సిన పనిలేదు అని బీసీజీ నివేదికలో తెలుపడం సంచలనం కలిగిస్తోంది. 

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో 21 రోజుల పాటు విధించిన లాక్‌డౌన్‌ ఎప్పుడు ఎత్తివేస్తారనే చర్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగుతోంది. ఏప్రిల్‌ 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు మాత్రం రావడంలేదు. లాక్‌డౌన్‌ను మరికొన్ని నెలల పాటు పొడిగిస్తారని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగినా దానిని కేంద్ర కొట్టిపారేసింది. అయితే ప్రస్తుతం దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు, మరోవైపు కోవిడ్‌ మృతుల సంఖ్య ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తోంది. 

ఈ క్రమంలో ఏప్రిల్‌ 15న లాక్‌డౌన్‌ ఎత్తివేసే సాహసం కేంద్ర ప్రభుత్వం చేస్తుందా.. అనేది కోట్లాది మందిని వెంటాడుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) భారత్‌లో లాక్‌డౌన్‌, ప్రస్తుత పరిస్థితులపై ఓ రిపోర్టును వెలువరించింది. బీసీజీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన రిపోర్టు భారత్‌ను మరింత వణికిస్తోంది. ఈ అత్యంత తాజా రిపోర్టులో బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఏమని చెప్పిందంటే..

‘దేశంలో లాక్‌డౌన్‌ను జూన్‌ నాలుగో వారం వరకు కొనసాగించే అవకాశం ఉంది. అప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోతే సెప్టెంబర్‌ వరకు కొనసాగినా అశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే లాక్‌డౌన్‌ను ప్రకటించడం కన్నా.. దానిని ఎత్తివేయడం చాలా కష్టతరమైన విషయం. అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో ఇది మరింత కఠినం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ప్రిపరేషన్‌ లేకుండా ఏప్రిల్‌ 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారని అనుకోవడం లేదు. లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తరువాత వైరస్‌ను అదుపుచేయడం భారత్‌ వైద్యులకు అంత సులువైనది కాదు. వైరస్‌ వ్యాప్తి తగ్గకముందే లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే ఇబ్బందులు తప్పవు’ అని బీసీజీ తన నివేదికలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో బీసీజీ నివేదికపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు ప్రముఖులు వివిధ కోణాల్లో స్పందిస్తున్నారు. లాక్‌డౌన్‌ను పొడిస్తారని కొందరు అభిప్రాయపడుతుండా... ప్రాంతాలు, వైరస్‌ ప్రభావాన్ని బట్టి దీనిపై కేంద్ర నిర్ణయం తీసుకుంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు.  కాగా దేశంలో వైరస్‌ తొలిదశలో ఉన్న సమయంలోనే మార్చి 24న దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. ఇక దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,567కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 58 మంది మృతి చెందారు. ఇతరదేశాలతో పోలిస్తే భారత్‌లో కోవిడ్ 19 వైరస్ ముసలివారికి కాకుండా యువతకు సోకుతుండటం మరింత భీతి కలిగిస్తోంది. 

మార్చి 22న దేశం స్వచ్చందంగా జనతా కర్ప్యూ పాటించాలని పిలుపునిచ్చి విజయవంతం చేసిన ప్రధాని నరేంద్రమోదీ తర్వాత మార్చి 25 నుంచి మూడు వారాలపాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. చైనాలో కూడా వైరస్ వ్యాప్తి తీవ్రతరమవడంతో అక్కడి ప్రభుత్వం ఇదే పంథాను అవలింబించి వూహాన్‌తో పాటు 60 నగరాల్లో లాక్ డౌన్ పాటించింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు దేశప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర వస్తువుల కోసం తప్ప బయటకు రావద్దని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. లాక్ డౌన్ కోసం తీసుకుంటున్న చర్యలు ఫలితం ఇస్తాయనుకుంటే జూన్ వరకు పొడిగించే ఉద్దేశం ఉందని అంతర్జాతీయ నివేదిక ప్రకటించడంతో భయాందోళనలు రేగుతున్నాయి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle