newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో 170 హాట్ స్పాట్ జిల్లాలు... కేంద్రం హై అలర్ట్

15-04-202015-04-2020 19:07:40 IST
Updated On 15-04-2020 20:54:07 ISTUpdated On 15-04-20202020-04-15T13:37:40.090Z15-04-2020 2020-04-15T13:34:21.569Z - 2020-04-15T15:24:07.484Z - 15-04-2020

దేశంలో 170 హాట్ స్పాట్ జిల్లాలు... కేంద్రం హై అలర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలోని జిల్లాలను మూడు జోన్లుగా విభజించినట్లు కేంద్రం వెల్లడించింది. కరోనా కేసుల ప్రాతిపదికన జిల్లాలను హాట్ స్పాట్ , హాట్ స్పాట్  యేతర, గ్రీన్ జోన్  అనే మూడు విభాగాలుగా విభజించింది. దేశవ్యాప్తంగా వైరస్  కేసుల నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

కరోనా నియంత్రణకు ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జిల్లాలను కరోనా కేసుల ప్రాతిపదికన.. హాట్ స్పాట్ , హాట్ స్పాట్  యేతర, గ్రీన్ జోన్  అనే మూడు విభాగాలుగా విభజిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, హెల్త్  సెక్రటరీలు, డీజీపీలతో కేబినెట్  సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించినట్లు తెలిపారు.

కొవిడ్ -19 హాట్ స్పాట్  ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలో రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు వివరించారు. " దేశవ్యాప్తంగా మొత్తం 170 హాట్ స్పాట్లు, 207 హాట్ స్పాట్  యేతర ప్రాంతాలను గుర్తించాం. హాట్ స్పాట్  ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నాం. నిర్బంధ జోన్లలో అత్యవసరమైన వారికి మినహా ఎలాంటి రాకపోకలకు అనుమతి ఉండదు. కొత్త కరోనా కేసుల కోసం ప్రత్యేక బృందం తనిఖీలు చేస్తుంది. శాంపిల్స్  సేకరించి నమూనా ప్రమాణాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తుంది. భారత్ లో ప్రస్తుతం కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్  లేదు."అన్నారు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్  అగర్వాల్. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో నిత్యావసర సేవలు మినహా రాకపోకలను పూర్తిగా నిలిపివేశామని చెప్పారు. హాట్‌స్పాట్స్‌లో ఇంటింటి సర్వే చేపడతామని తెలిపారు.  

దేశంలో 11,439కి చేరిన కేసులుగడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,076 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 11,439కు చేరాయి. ప్రస్తుతం 1,306 మంది కోలుకోగా.. 9756 యాక్టివ్  కేసులున్నాయి. 377 మంది మరణించారు. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, తమిళనాడులో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. 

గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు కరోనా

గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీని కలిసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అవడం కలకలం సృష్టించింది. అహ్మదాబాద్‌లోని ఖాడియా-జమాల్‌పుర్‌ స్థానం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇమ్రాన్‌ ఖేడావాలా.. మంగళవారం ఉదయం రూపానీ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశానికి పలువురు ఇతర శాసనసభ్యులతో కలిసి హాజరయ్యారు. ఖేడావాలా కొవిడ్‌ బారిన పడ్డట్లు సాయంత్రం నిర్ధారణ అయింది. సీఎం నిర్వహించిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌, మరికొంత మంది మంత్రులు కూడా పాల్గొనడంతో అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. 

 

కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   9 hours ago


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   12 hours ago


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   16 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   18 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   20 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   20 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   21 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle