newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

దేశంలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు.. మళ్లీ లాక్‌డౌన్ బాటలో రాష్ట్రాలు

23-07-202023-07-2020 07:44:25 IST
Updated On 23-07-2020 07:49:30 ISTUpdated On 23-07-20202020-07-23T02:14:25.495Z23-07-2020 2020-07-23T02:14:18.019Z - 2020-07-23T02:19:30.096Z - 23-07-2020

 దేశంలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు.. మళ్లీ లాక్‌డౌన్ బాటలో రాష్ట్రాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌లో కరోనా వైరస్ విజృంభణకు హద్దే లేకుండా పోతోంది. బుధవారం ఒక్కరోజే  కొత్తగా 37,724 కరోనా కేసులు నమోదవడంతో 12 లక్షల కేసులను దేశం దాటేసింది. అయితే అదే సమయంలో 24 గంటల్లోనే దాదాపు 29 వేలమంది కరోనా నుంచి కోలుకోవడం గమనార్హం. ఒక్క రోజులో ఇంతమంది కోలుకోవడం ఇప్పటివరకు ఇదే అత్యధికం. అంతేకాకుండా వారం రోజులనుంచి ప్రతి రోజు 30 వేలకు పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా గత 24 గంటల్లో కోవిడ్ బారినపడి 648 మంది మరణించారని, మొత్తం మృతుల సంఖ్య 28,732కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 

దేశంలో బుధవారం 28,478 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ దేశంలో నమోదైన అత్యంత ఎక్కువ రికవరీ కేసులు ఇదే కావడం గమనార్హం. అంతేగాక రికవరీ రేటు  63.13 శాతానికి పెరిగింది. మరణాల రేటు 2.41కి పడిపోయింది. మరణాల రేటు తగ్గుతూ వస్తోందని, రికవరీ రేటు పెరుగుతోందని తెలిపింది. జూన్‌ 17న మరణాల రేటు 3.36 శాతంగా ఉండగా అది బుధవారానికి 2.41కి పడిపోయింది.

ప్రస్తుతం దేశంలోని 4,11,133 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, 7,53,049 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారని చెప్పింది. బుధవారం రాత్రికి కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. జూలైలోనే దాదాపు 6 లక్షల కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్యలో స్పెయిన్‌ (28,424)ను దాటేసి భారత్‌ (28,732) ప్రపంచ జాబితాలో ఏడో స్థానానికి చేరింది.

దేశంలో వైరస్‌ కేంద్ర స్థానంగా నిలిచిన మహారాష్ట్రలో ఒక్క రోజే 10,576 మంది వైరస్‌ బారినపడటం గమనార్హం. ఆ రాష్ట్రంలో కొత్తగా 280 మంది చనిపోయారు. రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అబ్దుల్‌ సత్తార్‌ (శివసేన)కు కరోనా సోకింది. దీంతో మహారాష్ట్రలో కొవిడ్‌కు గురైన మంత్రుల సంఖ్య ఐదుకు చేరింది. వీరిలో ముగ్గురు కోలుకున్నారు. ముంబైలో పరిస్థితి అదుపులో ఉందని.. 1,500 లోపు కేసులు నమోదవుతుండటమే దీనికి నిదర్శనమని అధికారులు తెలిపారు. కేరళలో తొలిసారి వెయ్యి (1,038)పైగా కేసులు వచ్చాయి.

తమిళనాడులో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. బుధవారం అత్యధికంగా 5,849 కేసులు నమోదయ్యాయి. 74 మంది మృతి చెందారు. కర్ణాటకలో కొత్తగా 4,764 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బెంగళూరులోనే 2,050 మందికి వైరస్‌ సోకింది. రాష్ట్రంలో 55 మంది మృతి చెందారు. బెంగళూరులోనే 15 మంది మరణించారు. ఢిల్లీలో ఆగస్టు 1వ తేదీ నుంచి 5వ తేదీ మధ్య మరోసారి సీరో సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇకపై ప్రతి నెల సీరో సర్వే చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ చెప్పారు. ఈసారి మరిన్ని నమూనాలు సేకరిస్తామని వివరించారు. 

దేశ రాజధానిలో బుధవారం 1,227 కేసులు వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో రోజురోజుకు బాధితులు పెరుగుతున్నారు. కొత్తగా 2,291 మందికి వైరస్‌ సోకింది. 39 మంది చనిపోయారు. కరోనా నేపథ్యంలో.. పంద్రాగస్టు సందర్భంగా నిర్వహించే ప్రజా కార్యక్రమాలను మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం రద్దు చేసింది. రాజధాని భోపాల్‌లో మాత్రమే అధికారికంగా జెండా ఎగురవేస్తామని ప్రకటించింది. తన కార్యదర్వుల్లో ఒకరికి వైరస్‌ సోకడంతో హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం జైరాం ఠాకూర్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌కు వెళ్లారు. 

కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు మరోసారి లాక్‌డౌన్‌ విధించే ఆలోచన చేస్తున్నాయి. కేరళలో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ తప్పదేమోనని  సీఎం పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో శుక్రవారం నుంచి ఆగస్టు 3 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించారు. మణిపూర్‌లో గురువారం మధ్యాహ్నం నుంచి ఏడు రోజుల సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు కానుంది. బందిపోర జిల్లా మినహా కశ్మీర్‌ లోయలో బుధవారం సాయంత్రం నుంచి ఆరు రోజుల లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. 

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   8 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   19 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle