newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

దేశంలో తొలి కరోనా మరణం నిజమే.. కర్ణాటక వైద్యుల నిర్ధారణ

13-03-202013-03-2020 10:50:47 IST
Updated On 13-03-2020 14:42:20 ISTUpdated On 13-03-20202020-03-13T05:20:47.738Z13-03-2020 2020-03-13T05:16:02.043Z - 2020-03-13T09:12:20.144Z - 13-03-2020

దేశంలో తొలి కరోనా మరణం నిజమే.. కర్ణాటక వైద్యుల నిర్ధారణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కల్బుర్గికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్‌ బారిన పడి మరణించాడని కర్నాటక ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ధారించింది. దీంతో భారతదేశంలో తొలి కరోనా మరణం అధికారికంగా నమోదయింది. ఇటీవల సౌదీ అరేబియా నుంచి బెంగళూరుకు చేరుకున్న ఓ వ్యక్తిని పరీక్షించిన వైద్యులు అతనికి కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో కల్బుర్గీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. కొద్ది రోజుల పాటు చికిత్స సజావుగానే సాగినా.. అతని పరిస్థితితో మాత్రం మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే అతన్ని కల్బుర్గీ నుంచి హైదరాబాద్ లోని మరో ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం చేశారు వైద్యులు. అయితే చికిత్స పొందుతూనే బుధవారం మధ్యాహ్న సమయంలో బాధితుడు మృతి చెందాడు.

కానీ అ వ్యక్తి మరణం కరోనా వల్లే అని నిర్దారించడానికి వైద్యులకు 30 గంటలు పట్టింది. మృతి చెందిన వ్యక్తిని మహ్మద్‌ హుస్సేన్‌ సిద్ధిఖీగా గుర్తించిన వైద్యులు అతని మరణం కరోనా కారణంగానే సంభవించిందని నిర్థారించలేక అతని శాంపిల్స్‌ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలకు రిఫర్‌ చేశారు. రిపోర్టులు అందిన తరువాతనే మృతిపై నిర్థారణకు వస్తామని వైద్యులు తెలిపారు. చివరకు కరోనా వైరస్సే అతడి మరణానికి కారణమని స్పష్టం చేశారు.

గురువారం కేంద్రప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో దేశంలో తొలి కరోనా వ్యాధిగ్రస్తుడి మరణం గురించి ధ్రువీకరించింది. మరణించిన వ్యక్తి కల్బుర్గికి చెందిన 76 ఏళ్ల మహమ్మద్ హుస్సేన్ సిద్దిఖి 2020 జనవరి 29 నుంచి ఫిబ్రవరి 29 వరకు సౌదీ అరేబియాలో పర్యటించి భారత్ తిరిగొచ్చాడని, హైదరాబాద్ విమానాశ్రయంలో దిగి నేరుగా కల్బుర్గికి వెళ్లపోయాడని కేంద్రం ప్రకటించింది. 

అప్పటికే అధిక రక్తపోటు, ఆస్తమాతో బాధపడుతున్న అతడికి మార్చి 6న కరోనా వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని మార్చి 9 నాటికి అవి తీవ్రస్థాయికి చేరుకోవడంతో కల్బుర్గిలోని ప్రైవేట్ ఆసుపత్రికి మార్చారని కేంద్ర ప్రకటన తెలిపింది. మధ్యస్థాయి వైరల్ న్యూమోనియా మరియు అనుమానిత కోవిడ్ 19 లక్షణాలున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కానీ రోగి కుటుంబం ఒత్తిడితో అతడిని మార్చి 9న డిశ్చార్చి చేసి హైదరాబాద్‌కు మార్చారు. 

కల్బుర్గి డిప్యూటీ కమిషనర్ సలహాని వినటానికి కూడా రోగి కుటుంబం తిరస్కరించిందని. చివరకు ఆయనకు తెలీకుండానే రోగిని వారు హైదరాబాద్ తీసుకెళ్లారని ప్రకటన తెలిపింది.

ప్రపంచ దేశాల్లో మరణ మృదంగాన్ని మోగిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) భారత్‌లోనూ తన ప్రభావాన్ని తీవ్రంగానే చూపుతోంది. కరోనా వైరస్‌ కారణంగా కర్ణాటకలో ఓ వ్యక్తి మృతి చెందాడనే వార్త తీవ్ర భయాందోళనలను సృష్టిస్తోంది.

కరోనా రోగి మరణం మన వ్యవస్థలో ఉన్న అనేక లోపాలను ఎత్తి చూపింది. కరోనా వ్యాధి తారస్థాయికి చేరిన రోగిని కల్బుర్గి ఆసుపత్రిని డిశ్చార్జి చేయడం, కుటుంబం ఒత్తిడితో తనను హైదరాబాద్ తరలించడం, ఒక్కరోజు లోపే తనను తిరిగి హైదరాబాద్ నుంచి వెనక్కు పంపించడం తీవ్రమైన ప్రక్రియాపరమైన లోపాల్లో భాగమని తెలుస్తోంది. 

కరోనా వ్యాది లక్షణాలు బయటపడిన వెంటనే 14 రోజులపాటు రోగిని క్వారంటైన్ చేయడం అనే విధి గాలికెగిరిపోయింది. కుటుంబం ఒత్తిడి పెడితే రోగిని డిశ్చార్జి చేయడం ఇంకా హాస్యాస్పదంగా ఉంది. అసలు దేశంలో కరోనా సంబంధిత అప్రమత్తత పాటిస్తున్నారా అనే సందేహం కూడా పుడుతోంది.

బెంగళూరులో 24 గంటల వ్యవధిలో మరో మూడు కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మంగళవారం కొత్తగా బెంగళూరులో మరో మూడు కోవిడ్‌ వైరస్‌ కేసులు గుర్తించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఒక ప్రకటనను విడుదల చేసింది. మొదట సోకినట్లు తేలిన టెక్కీ (41) బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఛాతీ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నాడు. 

కాగా, మంగళవారం ఆయన భార్య, కుమార్తె, సహచర ఉద్యోగికి కూడా ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో బెంగళూరుకు వారితో పాటు విమానంలో వచ్చిన ప్రయాణికులను, అలాగే బాధితుడు కలిసివారిని పిలిపించి అందరికీ వైద్యపరీక్షలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. వాటి ఫలితాలు రావాల్సి ఉంది. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి: దేశంలో తొలి కరోనా మరణం అబద్ధమా?

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   16 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   18 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle