newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా టెర్రర్... 43కి పెరిగిన బాధితులు

09-03-202009-03-2020 15:47:14 IST
Updated On 09-03-2020 16:53:02 ISTUpdated On 09-03-20202020-03-09T10:17:14.642Z09-03-2020 2020-03-09T10:17:08.924Z - 2020-03-09T11:23:02.429Z - 09-03-2020

దేశంలో కరోనా టెర్రర్... 43కి పెరిగిన బాధితులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేరళలో మూడేళ్ల చిన్నారికి కరోనా సోకింది. ప్రస్తుతం బాధితుల సంఖ్య 43కి పెరిగింది. దీంతో వరుస కరోనా కేసులతో కేరళ రాష్ట్రం బెంబేలెత్తుతోంది. ఆదివారం ఒక్కరోజే ఒకే కుటుంబంలో ఐదు కేసులు బయటపడగా.. సోమవారం మరోకేసు వెలుగు చూడడంతో అధికారులు, వైద్యులు అప్రమత్తం అయ్యారు.

మూడేళ్ల చిన్నారికి కోవిడ్‌-19 మహమ్మారి సోకినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కుటుంబ సభ్యులతో పాటు ఇటీవల ఇటలీ వెళ్లొచ్చిన సదరు చిన్నారి వైరస్‌ బారిన పడిందని వైద్యులు వెల్లడించారు. రాష్ట్రంలో వైరస్‌ బారిన పడిన కుటుంబం పతనమిట్ట జిల్లాలో నివాసం ఉందిం. దీంతో అక్కడి పాఠశాలలకు కలెక్టర్‌ మూడు రోజులపాటు సెలవులు ప్రకటించారు. కరోనా కేసులు బయటపడిన గతనెలలో తొలిసారిగా కేరళలో మూడు కేసులు నమోదయ్యాయి. అయితే బాధితుుల చికిత్స అనంతరం కోలుకున్నారు.

ఇదిలా ఉంటే.. కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూసిన క్రమంలో కర్ణాటక ప్రభుత్వం బెంగళూర్‌లో ప్రాథమిక విద్యా పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఈమేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటక హెల్త్‌ కమిషనర్‌ పంకజ్‌ కుమార్‌ పాండే సూచనలతో వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. బెంగళూర్‌ నార్త్‌, సౌత్‌, గ్రామీణ జిల్లాల్లో కేఎజ్‌జీ, యూకేజీ తరగతులకు సెలవులు ఇచ్చారు. ఈమేరకు కర్ణాటక ప్రాథమిక విద్యా శాఖ మంత్రి ఎస్‌ సురేష్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో బెంగళూర్‌ నగరంలో తక్షణమే ప్రీకేజీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను మూసివేయాలని ఆదేశించారు.  

ఇటు చైనాలో కోవిడ్ 19 వ్యాప్తి తగ్గగా చైనా తర్వాత ఇరాన్‌, ఇటలీ దేశాల్లో ఈ మహమ్మారి అధిక ప్రభావం చూపుతోంది. గడిచిన 24 గంటల్లో ఇరాన్‌లో 49 మంది మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు ఆదివారం ధృవీకరించారు. ఇరాన్‌లో మొత్తం 6,566 కేసులు నమోదు కాగా.. 194 మంది ప్రాణాలు విడిచారు. ఇటలీలో ఒక్కరోజే 133 మంది మరణించటంతో మృతుల సంఖ్య 366కు చేరుకుంది.

అదేవిధంగా మొత్తం 5,883 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి 95 దేశాలకు చెందిన 3,595 మందిని పొట్టన పెట్టుకుంది. కరోనా బాధితుల సంఖ్య 105,836కు చేరుకుంది. ఈ వైరస్ కారణంగా చైనాలో 3,097 మంది మరణించగా, 80,695 కేసులు నమోదయ్యాయి.  దక్షిణ కొరియాలో 48 మరణించగా, 7,134 కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్సులో 16 మంది చనిపోగా, 1000 కేసులు వరకూ నమోదయ్యాయి. ఇటు అమెరికాలో కోవిడ్‌ 19తో  17 మంది చనిపోగా 420 కేసులు బయటపడ్డాయి. అర్జెంటీనాలో ఒకరు మరణించారు. అలాగే బల్గేరియా, పరాగ్వే తదితర దేశాల్లో నూ కోవిడ్‌ బాధితులను గుర్తించడం ఆందోళన వ్యక్తం అవుతోంది. 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   13 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle