newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

దేశంలో అరకోటికి చేరువలో పాజిటివ్ కేసులు..!

15-09-202015-09-2020 11:17:50 IST
2020-09-15T05:47:50.572Z15-09-2020 2020-09-15T05:47:47.900Z - - 30-09-2020

 దేశంలో అరకోటికి చేరువలో పాజిటివ్ కేసులు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి దేశంలో ప్రవేశించి నాలుగు నెలలకు పైగా సమయం కాగా ఇంకా వ్యాప్తి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేస్తూ దేశవ్యాప్తంగా అరకోటికి చేరువలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 83,809 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపగా ఈ కేసులతో కలిపి పాజిటివ్‌ కేసుల సంఖ్య 49లక్షల మార్క్‌ను దాటింది. కేసుల సంఖ్య భారీగా స్థాయిలో పెరుగుతున్నా అదే స్థాయిలో బాధితులు కోలుకుంటున్నారు.

దేశంలో మహమ్మారి పీక్స్ దశకు వెళ్లిన తర్వాత తగ్గుముఖం పడుతుందని వైద్య నిపుణులు చెప్తుండగా ఆ పీక్స్ దశకు ఎప్పటికి చేరుకుంటుందన్నది అంతుపట్టడం లేదు. మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, గుజరాత్ లాంటి రాష్ట్రాలు రికార్డులు బద్దలు కొడుతూ పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, మరణాల సంఖ్యా తీవ్రంగానే ఉంటుంది. అయితే, ఆయా రాష్ట్రాలలోనే ఇంకా వైరస్ పీక్స్ దశకు చేరుకోలేదని, రానున్న రెండు నెలల తీవ్రత ఉదృతంగా ఉంటుందని చెప్తున్నారు.

ఒక్క ఏపీలోనే ఇప్పటికే 19 శాతం మంది మహమ్మారి బారిన పడినట్లుగా ఆరోగ్యశాఖ తేల్చింది. మిగతా రాష్ట్రాలలో కూడా దాదాపుగా అదే పరిస్థితి. మరి ఈక్రమంలో ఆయా రాష్ట్రాలలోనే కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటే.. దేశంలో మహమ్మారి పరిస్థితి ఏంటన్నది అంతుబట్టని పరిస్థితి. రికవరీ రేటు పెరగడం మంచి పరిణామమే కానీ తగ్గుముఖం పట్టేది ఎప్పుడన్నది అర్ధం కాని పరిస్థితి. ప్రపంచంలోని చాలా దేశాలలో వైరస్ కేసుల సంఖ్య భారీగా తగ్గగా ఇండియాలో తగ్గుముఖం పట్టేది ఎప్పుడన్నది చూడాల్సి ఉంది.

ప్రస్తుతం దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,30,237కు చేరగా 9,90,061 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, 38,59,400 మంది వైరస్‌ ప్రభావం కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వైరస్‌ ప్రభావంతో తాజాగా మరో 1,054 మంది మరణించగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 80,776 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. దేశవ్యాప్తంగా సోమవారం ఒకే రోజు 10,72,845 టెస్టులు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించగా ఇప్పటి వరకు 5,83,12,273 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వివరించింది.

 

మీరు ప్రాజెక్టులు కడితే ఒప్పుకోం.. మేం మాత్రం కడతాం.. చైనా వితండవాదం

మీరు ప్రాజెక్టులు కడితే ఒప్పుకోం.. మేం మాత్రం కడతాం.. చైనా వితండవాదం

   7 hours ago


రిలయన్స్ రిటైల్ లోకి భారీగా పెట్టుబడులు..!

రిలయన్స్ రిటైల్ లోకి భారీగా పెట్టుబడులు..!

   7 hours ago


బాబ్రీ తీర్పుపై ఒవైసీ స్పందన ఇదే..!

బాబ్రీ తీర్పుపై ఒవైసీ స్పందన ఇదే..!

   8 hours ago


సొంత వాళ్లకు కూడా చూపించకుండా అంత్యక్రియలు.. యూపీ ప్రభుత్వం తప్పు చేసిందా..?

సొంత వాళ్లకు కూడా చూపించకుండా అంత్యక్రియలు.. యూపీ ప్రభుత్వం తప్పు చేసిందా..?

   10 hours ago


బాబ్రీ మసీదు కూల్చివేత కేసు : సంచలన తీర్పు ఇచ్చిన సీబీఐ ధర్మాసనం

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు : సంచలన తీర్పు ఇచ్చిన సీబీఐ ధర్మాసనం

   10 hours ago


దేశంలో ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా.. ఐసీఎంఆర్‌ సర్వే

దేశంలో ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా.. ఐసీఎంఆర్‌ సర్వే

   11 hours ago


భారత్‌‌పై ఆమ్నెస్టీ తీవ్ర ఆరోపణలు.. తిప్పికొట్టిన కేంద్రం

భారత్‌‌పై ఆమ్నెస్టీ తీవ్ర ఆరోపణలు.. తిప్పికొట్టిన కేంద్రం

   13 hours ago


బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు.. రాష్ట్రాల్లో హై అలర్ట్..!

బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు.. రాష్ట్రాల్లో హై అలర్ట్..!

   14 hours ago


బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్!

బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్!

   29-09-2020


ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి.. భార్యను చితక్కొడుతూ అడ్డంగా దొరికిపోయారు

ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి.. భార్యను చితక్కొడుతూ అడ్డంగా దొరికిపోయారు

   29-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle