newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

దేశంలోని 19 రాష్ట్రాల్లో రికవరీ.. 9 లక్షలు దాటిన కరోనా కేసులు..

15-07-202015-07-2020 15:05:01 IST
Updated On 15-07-2020 15:06:47 ISTUpdated On 15-07-20202020-07-15T09:35:01.838Z15-07-2020 2020-07-15T09:34:59.695Z - 2020-07-15T09:36:47.172Z - 15-07-2020

దేశంలోని 19 రాష్ట్రాల్లో రికవరీ.. 9 లక్షలు దాటిన కరోనా కేసులు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మరింత పెరిగింది. పాజిటివ్‌ కేసుల సంఖ్య చూస్తుండగానే 9 లక్షల మార్కును దాటేసింది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 28,498 కేసులు బయటపడ్డాయి. 553 మంది కరోనా బాధితులు మృతిచెందారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసులు 9,06,752కు, మరణాలు 23,727కు ఎగబాకాయి. 5,71,459 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. ప్రస్తుతం 3,11,565 మంది చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రాల నుంచి అందిన సమాచారం మేరకు సోమవారం రాత్రికి దేశంలో కేసుల సంఖ్య 9,01,171కు చేరుకుంది. 3 రోజుల్లోనే లక్షకు పైగా కేసులు పెరగడం విశేషం. సోమవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 28,701 మంది వైరస్‌ బారినపడ్డారని, 500 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 63.01 శాతం మంది కోలుకున్నట్లు కేంద్రం తెలిపింది. 19 రాష్ట్రాల్లో రికవరీ రేటు జాతీయ స్థాయి కంటే అధికంగా ఉందని పేర్కొంది. 30 రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల్లో మరణాల రేటు జాతీయ స్థాయి (2.64) కంటే తక్కువగా ఉందని తెలిపింది. గత 24 గంటల్లో 2,19,103 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి   పేర్కొంది. 

కాగా, దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో ఏర్పాటు చేసిన సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌  నుంచి తొలిసారి కరోనా రోగి ఒకరు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఇక్కడ 147 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో రెండ్రోజుల పాటు 8 వేలు, 7 వేల పైగా కేసులు రాగా.. సోమవారం సంఖ్య తగ్గింది. కొత్తగా అక్కడ 6,497 మందికి వైరస్‌ సోకింది. 193 మంది మృతిచెందారు. కర్ణాటకలో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వరుసగా రెండో రోజూ ఆ రాష్ట్రంలో 71 మంది చనిపోయారు. తమిళనాడులో తాజాగా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. 

అయితే దేశంలో 86 శాతం కరోనా పాజిటివ్‌ కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 50 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడులోనే బయటపడ్డాయని అన్నారు.  దేశంలో మరణాల రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. ఇలా ఉండగా, బిహార్‌లో ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 

కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ధార్వాడ జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించనున్నట్లు సోమవారం ప్రకటించారు. ధార్వాడలో బుధవారం నుంచి 9 రోజులు, దక్షిణ కన్నడ జిల్లాలో వారం రోజులు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది.  కర్ణాటకలో సోమవారం కొత్తగా 2,738 కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 1,315 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో బెంగళూరులో బాధితులు 20వేలకు చేరువయ్యారు. కాగా, విప్రో కంపెనీలలో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమని విప్రో చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ వెల్లడించారు. కశ్మీర్‌ లోయలోని పలు ప్రాంతాల్లో  మళ్లీ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. 

కరోనాపై విజయం సాధించామని కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవడాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తప్పుబట్టారు. కొవిడ్‌పై దేశం విజయం సాధించిందని, ఈ వైర్‌సను ప్రజల సహకారంతో ప్రభుత్వం మరింత సమర్ధవంతంగా ఎదుర్కొంటోందని కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌ స్పందిస్తూ.. ‘కొవిడ్‌పై మోదీ సర్కారు విజయం సాధించింది అనుకుంటున్నారా దేశంలో కేసులు, మరణాలు తగ్గాయని భావిస్తున్నారా’ అని ట్విటర్‌లో సూటిగా ప్రశ్నించారు. భారత్‌లో కరోనా కేసులు, మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న గ్రాఫ్‌ను జతచేశారు. 

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. కాగా.. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఈ వారంలోనే 10 లక్షల మార్కును దాటనుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  కరోనా నియంత్రణకు ఇకనైనా కఠినమైన చర్యలు చేపట్టకపోతే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి అదుపు తప్పుతుందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ చేసిన హెచ్చరికకు సంబంధించిన వార్తను ఈ ట్వీట్‌తో జత చేశారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle