newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

దిశకు 8 రోజుల్లోనే న్యాయం.. నా బిడ్డకెప్పుడు న్యాయం చేస్తారు.. నిర్భయ తల్లి ప్రశ్న

06-12-201906-12-2019 13:13:19 IST
2019-12-06T07:43:19.460Z06-12-2019 2019-12-06T07:43:17.423Z - - 11-08-2020

దిశకు 8 రోజుల్లోనే న్యాయం.. నా బిడ్డకెప్పుడు న్యాయం చేస్తారు.. నిర్భయ తల్లి ప్రశ్న
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శంషాబాద్ పశువైద్యురాలు డాక్టర్ దిశ హత్యాచార కేసులో ఆమెకు, ఆమె తల్లిదండ్రులకు ఎనిమిది రోజుల్లోపే న్యాయం జరిగిందని కానీ ఏడేళ్ల క్రితం ఢిల్లీలో ఇదేవిధంగా అత్యాచారానికి బలైన తన కూతురుని ఎప్పుడు న్యాయం చేస్తారని నిర్భయ తల్లి ఆశాదేవి ప్రశ్నంచారు. ఎట్టకేలకు ఒక్క కూతురికి అయినా న్యాయం జరిగింది...తెలంగాణ పోలీసులకు థ్యాంక్స్...నేను నిర్భయ ఘటనపై ఏడేళ్లుగా పోరాడుతున్నా, నేరస్థులను శిక్షించడం ఎంత జాప్యం అవుతుందో చూడండి’’అని నిర్భయ తల్లి అన్నారు. తాను ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతున్నానని, డిసెంబరు 13వతేదీన తాను మళ్లీ కోర్టుకు వెళ్లాలని ఆమె పేర్కొన్నారు. 

దిశ హత్యాచార ఘటనలో నలుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటనపై నిర్భయ తల్లి  స్పందించారు. 2012లో నిర్భయ ఘటన అనంతరం నాకు అయిన గాయాలకు ఈ ఎన్‌కౌంటర్ ఆయింట్‌మెంట్ రాసినట్లయిందని నిర్భయ తల్లి  వ్యాఖ్యానించారు. ‘‘తమ కుమార్తెకు న్యాయం జరిగిందని దిశ తల్లిదండ్రులు ఇప్పుడు ఉపశమనం పొందాలి. ఇలాంటి ఘోరమైన నేరాలకు పాల్పడేవారిలో భయం కలుగుతుంది’’ అని నిర్భయ తల్లివివరించారు.

నా బిడ్డ చనిపోయి ఏడేళ్లు అవుతోంది. అయినా కనీస న్యాయం జరగలేదు. ఏడేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఉరిశిక్ష పడింది కానీ అది ఇంత వరకు అమలు కాలేదు. శిక్ష అమలు జరిగే వరకు పోరాడుతూనే ఉంటా. దిశ కేసులో పోలీసుల తీరును స్వాగతిస్తున్నా. ఎన్‌కౌంటర్‌ జరిపిన పోలీసులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోవద్దు. ఆమె ఆత్మకు ఎట్టకేలకు శాంతి జరిగింది’ అని నిర్భయ తల్లి అన్నారు.

‘దిశ చనిపోయిన ఎనిమిది రోజుల్లోనే పోలీసులు న్యాయం చేశారు. కానీ  దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్‌ 15న నిర్భయపై  ఆరుగురు వ్యక్తులు అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. అనంతరం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించగా.. నిందితుల్లో ఒకరైన రామ్‌సింగ్‌ జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

దిశ అత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతో కేసు విచారణలో పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా దిశ మృతదేహాన్ని కాల్చిన చటాన్‌పల్లి అండర్‌పాస్‌ ప్రాంతంలో క్రైమ్‌ సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించారు, దీంతో నిందితులను పోలీసులు కాల్చిచంపారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  

దిశ అత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన తెలంగాణ పోలీసులపై దేశ వ్యాప్తంగా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులపై పోలీసులు సరైన రీతిలో వ్యవహరించారని, వారి సాహసాన్ని స్వాగతిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అత్యాచార నిందితులకు సరైన శిక్ష వేశారని కొనియాడారు. తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఎంతో నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీసులు దేశ పోలీసు వ్యవస్థకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు కురిపించారు. మహిళలపై దాడులను అరికట్టాలంటే  పోలీసు వ్యవస్థ ఇలాంటి చర్యలకు ఉపక్రమించక తప్పదని మాయావతి పేర్కొన్నారు.

కాగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ హత్య కేసుపై అనేక వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయిన విషయం తెలిసిందే. దిశను అత్యంత దారుణంగా అత్యాచారం జరిపి, హత్య చేసిన కామాందులకు ఉరిశిక్ష పడాలని యావద్దేశం ముక్తకంఠంతో డిమాండ్‌ చేసింది. అయితే విచారణ నిమిత్తం శుక్రవారం తెల్లవారుజామున క్రైమ్‌ సీన్‌ రికన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చిచంపారు.

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   4 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   4 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   7 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   15 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle