newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

దయనీయ స్థితిలో భారత ఆరోగ్య రంగం

25-03-202025-03-2020 13:43:03 IST
Updated On 25-03-2020 13:47:52 ISTUpdated On 25-03-20202020-03-25T08:13:03.839Z25-03-2020 2020-03-25T08:12:27.834Z - 2020-03-25T08:17:52.134Z - 25-03-2020

దయనీయ స్థితిలో భారత ఆరోగ్య రంగం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారతదేశం, అమెరికాలు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామికదేశాలు అన్నది తెలిసిందే. 21వ శతాబ్దంలో ప్రజాస్వామ్య పటిష్టతకు సంబంధించి ఈ రెండు దేశాలు ఇతరులందరూ పాటించాల్సిన దృఢమైన నమూనాలుగా నిలిచాయనటంలో సందేహమే లేదు. కానీ ఆరోగ్య పరిరక్షణా రంగంలో మాత్రం ఈ రెండు దేశాలు ఒకే స్థాయిలో నిలబడటం లేదు. 2000 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య వ్యవస్థలపై మొట్టమొదటి, చివరి ర్యాంకింగుల జాబితాలో మొత్తం 192 దేశాలకు గాను అమెరికా 37వ స్థానంలో నిలబడితే, భారత్ 112వ స్థానంలో నిలిచింది. 

2020 సంవత్సరానికి అమెరికా తన జీడీపీలో 18 శాతం వరకు ఆరోగ్యరంగంపై వెచ్చిస్తుండగా, భారత్ ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో కేవలం 2 శాతం లోపు మాత్రమే ఈ రంగంపై వెచ్చిస్తోంది. ఆరోగ్యరంగంపై తలసరి ఖర్చు అమెరికాలో 10 వేల డాలర్లుకాగా, భారత్‌లో అది 100 డాలర్లు మాత్రమే. అంటే రెండు దేశాల మధ్య ఆరోగ్య రంగ వ్యయంలో చాలా తేడా ఉంది. అమెరికాలో ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రుల నాణ్యమైన మద్దతుపై ఆరోగ్యరంగం ఆధారపడి ఉండగా, భారత్‌లో మాత్రం ప్రైవేట్ రంగం నాణ్యమైన ఆరోగ్యరంగ విషయంలో ఆధిక్యత కలిగివుంది. పలువురు మధ్యతరగతి, పేద పౌరులకు భారత్‌లో నాణ్యమైన వైద్య సేవలు లభించవు గాక లభించవు.

ప్రస్తుతం చైనాలో పుట్టి అంతర్జాతీయంగా విస్తరించిన కరోనా వైరస్ ప్రపంచ మహమ్మారిగా మారిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో అన్ని దేశాలూ ప్రపంచ స్థాయి ఆరోగ్య పరిరక్షణా వ్యవస్థను నెలకొల్పుకోవాలని పరిణామాలు సూచిస్తున్నాయి. భారత్ వ్యవస్ధాగతమైన జాతీయ వ్యాప్త పథకంలో భాగంగా వైరస్‌ని ఎదుర్కొనేందుకు వేగంగా చర్యలు తీసుకోగా, అమెరికా మాత్రం దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా కరోనా వైరస్ పట్ల చాలా ఆలస్యంగా స్పందించారు. దీంతో 56 రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ వ్యాపించి పరిస్థితి చేజారిపోయింది.

అంతమాత్రాన భారత్‌లో ప్రజారోగ్య వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తోందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఆరోగ్యరంగానికి జాతీయ స్థూల ఉత్పత్తిలో అతి తక్కువ మొత్తం కేటాయిస్తున్న దేశాల్లో భారత్ దక్షిణాసియాలోనే దిగువస్థానంలో ఉంది. అందుకే భారత దేశం ఆది నుంచి ప్రజారోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉన్నట్లయితే నేడు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం అంత కష్టమయ్యేది కాదు. 

2018–19 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఆరోగ్య రంగానికి జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో కేవలం 1.28 శాతం కేటాయింపులు జరపగా, 2019–20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 1.5 శాతం, 2020–21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 1.6 శాతం నిధులను మాత్రమే కేటాయించారు. మన పొరుగునున్న శ్రీలంక, బంగ్లాదేశ్‌లు మనకన్నా ఎక్కువ నిధులను కేటాయిస్తున్నాయి.

దేశంలో ప్రజారోగ్యానికి కనీసం జీడీపీలో మూడు శాతం నిధులనైనా కేటాయించాలని ప్రజారోగ్య విధాన నిర్ణేతలు, సామాజిక కార్యకర్తలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. 2006లో ‘నైన్‌ ఈజ్‌ మైన్‌’ అనే నినాదంతో పాటశాల విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. జీడీపీలో విద్యారంగానికి ఆరు శాతం, వైద్య రంగానికి మూడు శాతం నిధులను కేటాయించాలన్నది నాడు విద్యార్ధుల డిమాండ్‌. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ప్రతీ ప్రభుత్వం ఈ రెండు రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామనే చెబుతూ వచ్చాయి. 

పలు పార్టీలు కూడా తమ ఎన్నికల ప్రణాళికల్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చాయి. కానీ అవి ఎప్పుడు మాట నిలబెట్టుకోలేక పోయాయి. దేశంలో ఆరోగ్యం జాతీయ లేదా ఉమ్మడి జాబితాలో కాకుండా రాష్ట్రాల జాబితాలో ఉండడం, ఆరోగ్యం పౌరుల ప్రాథమిక హక్కు కాకపోవడం ప్రతికూల అంశాలే. 2022లో వచ్చే 75వ దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజారోగ్య రంగాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించడమే కాకుండా, ఈ రంగాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలని, ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలని ఆరోగ్య రంగంపై 15వ ఆర్థిక కమిషన్‌ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక్కరు చొప్పున ఆలోపతి వైద్యుడు ఉండాలి. భారత్‌లో రిజిస్టర్డ్‌ ఆలోపతి వైద్యులు 11,54,686 మంది ఉన్నారు. వారిలో ప్రభుత్వాస్పత్రుల్లో 1,16,756 మంది పని చేస్తున్నారు. ప్రతి 10,926 మందికి ఒకరు చొప్పున వైద్యులు ఉన్నారంటే వైద్యుల కొరత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. రాయిటర్స్‌ నివేదిక ప్రకారం భారత్‌లో క్రిటికల్‌ కేర్‌ నిపుణులు 50 వేల మంది అవసరం కాగా, 8,350 మంది మాత్రమే ఉన్నారు. 

దేశంలో నేడు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం కలిగిన ల్యాబ్‌లు 118 మాత్రమే ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడే భారత్‌ లాంటి వర్ధమాన దేశానికి ప్రైవేటు, భీమా రంగాలపై ఆధారపడే వైద్య విధానం పనికి రాదు. ప్రజారోగ్యం అనేది పూర్తిగా ప్రభుత్వ బాధ్యతగా గుర్తించనంత కాలం భారత్ వైరస్‌ల బారిన పడుతూనే ఉంటుంది.

 

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   an hour ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   18 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   19 hours ago


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   a day ago


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

   09-08-2020


భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

   09-08-2020


10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   08-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle