newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

దంతాలు పాడైతే గగన్‌యాన్‌కు అనర్హులే..

16-11-201916-11-2019 15:08:25 IST
2019-11-16T09:38:25.086Z16-11-2019 2019-11-16T09:38:22.272Z - - 08-08-2020

దంతాలు పాడైతే గగన్‌యాన్‌కు అనర్హులే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దాదాపు మూడున్నర దశాబ్దాలు పైబడిన తర్వాత భారత్ తన మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రకు 2022లో స్వీకారం చుట్టబోతోంది. 1984లో రష్యన్ సోయుజ్ టి-11 మిషన్ కోసం భారత వైమానికి బలగానికి చెందిన రాకేష్ శర్మ, రవీష్ మల్హోత్రలను 1982లో అంతరిక్ష యాత్రికులుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వీరిలో భారత్ తరపున తొలి అంతరిక్ష యాత్ర చేసిన ఘనత రాకేష్ శర్మకు దక్కింది. 35 ఏళ్ల తర్వాత భారత్ స్వయంగా తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రను గగన్‌యాన్ పేరిట రష్యా సహాయంతో తలపెడుతోంది. అయితే ఈ అంతరిక్ష యాత్రకు ఎంపికైన చాలామంది దంత సమస్యల కారణంగా తిరస్కరణకు గురయ్యారంటే ఆశ్చర్యమేస్తుంది. కానీ ఇది నిజం. 

రష్యన్ నిపుణుల సహాయంతో అంతరిక్ష యాత్రకు అర్హులైన 60 మంది వ్యక్తుల్లో 12 మందిని మాత్రమే అంతిమ పరిశీలనలో తీసుకున్నారు. మిగతావారు వివిధ కారణాల వల్ల అంతరిక్ష యాత్ర శిక్షణలో పాల్గొనే అర్హత కోల్పోయారు. భారత వైమానిక దళానికి చెందిన అంతరిక్ష వైద్య సంస్థ ఐఎఎమ్‌కు చెందిన నిపుణుల అబిప్రాయం ప్రకారం పళ్లు పుచ్చిపోయినా లేక దంతాలు సరిగా లేకపోయినా, పాడైనా అది అంతరిక్ష యాత్రికులకు ఏమాత్రం మంచిది కాదట. 

ప్రాథమికంగా ఎంపికైన 60 మంది ఐఏఎఫ్ పైలట్లలో చివరకు 12 మందిని మాత్రమే తుది శిక్షణకు ఎంపిక చేశారు. గత 45 రోజులుగా వీరికి రష్యాలోని స్టార్ సిటీలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ ట్రెయినింగ్ సెంటర్‌లో కఠిన శిక్షణ ఇస్తున్నారు. వీరు త్వరలో భారత్‌కు తిరిగివచ్చి గగనయాన్ ప్రత్యేక శిక్షణతోపాటు పలు కఠిన శిక్షణల్లో పాల్గొనబోతున్నారు. ఈ 12 మంది కఠిన శిక్షణ పూర్తి చేసుకున్నారు చివరి ముగ్గురు అంతరిక్ష యాత్రికులను 2022లో ప్రయోగించనున్న తొలిభారతీయ మానవసహిత అంతరిక్ష యాత్రకు ఎంపిక చేయనున్నారు. 

ప్రాథమికంగా ఎంపిక చేసిన 60 మంది పైలట్లలో చాలామంది కేవలం దంతాలసమస్య కారణంగానే శారీరక, వైద్య పరీక్షల్లో తిరస్కరణకు గురయ్యారని వాయుసేన నిపుణులు తెలిపారు. మొదట్లో 24 మంది పైలట్లనుంచి 16 మందిని ఎంపిక చేసి పంపామని కానీ వీరిలో స్వల్ఫస్థాయి శారీరక సమస్యలను తాము పెద్దగా పట్టించుకోలేదని సరిగ్గా ఆ లోపాలనే వారికి శిక్షణ ఇచ్చిన రష్యన్ వ్యోమగాములు పట్టేశారని ఐఎఎమ్ నిపుణులు తెలిపారు.

గగన్ యాత్ర కోసం అంతిమంగా 16 మందిని తాము సిద్ధం చేసి ఏవియేషన్ స్పెషలిస్టుతో కూడిన రష్యన్ విజిటింగ్ టీమ్‌కు వారిని చూపించాము. మావైపు నుంచి అన్ని జాగ్రత్తలూ తీసుకుని వీరిని ఎంపిక చేశాం కానీ దురదృష్టవశాత్తూ వీరిలో 7 మంది మాత్రమే పరీక్షలో నెగ్గారు. గగనయానానికి సంబంధించింతవరకు పెద్దగా సమస్యలు కావని మేం భావించి పైలట్లలో కనిపించిన చిన్న చిన్న శారీరక సమస్యలను వదిలేశామని ఐఏఎమ్ లో రోదసీ యాత్రికుల చీఫ్ సెలెక్షన్ అధికారి ఎమ్ఎస్ నటరాజ్ తెలిపారు. 

రష్యన్ రోదసీ నిపుణులు తిరస్కరించిన భారతీయ పైలట్లలో అనేక మందికి దంతాల సమస్య ఉంది. రోదసీ యాత్ర సందర్భంగా ఇది చాలా సమస్యలకు దారి తీస్తుందని రష్యన్ నిపుణులు చెప్పారు. మేము ఎంపిక చేసిన పైలట్ల శారీరక, ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని మేం భావించాం. కానీ రష్యన్ నిపుణులు ప్రత్యేకించి దంత ఆరోగ్యం మీదే దృష్టి పెట్టారు. ఎందుకంటే పంటినొప్పి కారణంగా రోదసీ యాత్రనుంచే వైదొలిగాల్సిన ప్రమాదం సంభవిస్తుందని వారు చెప్పారు. 

ఏరోస్పేస్ మెడిసిన్‌లో పీహెచ్‌డి చేసిన ప్లైట్ సర్జన్, అంతరిక్షంలో 562 రోజులు విహరించి రికార్డు సృష్టించిన రష్యన్ రోదసీ యాత్రికుడి ఎదురుగా మనం కూర్చుంటే మనకంటే వారే ఉత్తమ నైపుణ్యం కలవారని అర్థమవుతుంది అని ఎయిర్ కమాండర్ అనుపమ్ అగర్వాల్ చెప్పారు.

రోదసీ ఉపగ్రహంలో ఉన్నప్పుడు వేగత్వరణ శక్తులు, ప్రకంపనలు చాలా బలంగా ప్రభావం చూపిస్తుంటాయని దంతాలు సరైన అమరికలో లేకుంటే అవి లూజ్ కావడం లేక కింది పడిపోవడం కూడా జరుగుతుందని  యూరోపియన్ ఈఎస్ఏ వంటి అంతరిక్ష సంస్థలు చెబుతున్నాయి. అంతరిక్షంలోని ఒత్తిడి వల్ల దంతాలు విపరీతంగా నొప్పి పెట్టవచ్చని, 1978లో రోదసీ యాత్రలో పాల్గొన్న ఒక రష్యన్ కాస్మోనాట్ మిషన్ లో ఉండగానే రెండు వారాలపాటు తీవ్రమైన దంత సమస్యతో బాధపడ్డారని తెలిపారు. దంత సమస్యలతో పాటు వినికిడి, చూపు సమస్యలను కూడా అభ్యర్థుల ఎంపిక సమయంలో గమనించి అలాంటి వారిని తొలగిస్తుంటారు.

మొదట ఎంపిక చేసిన 16 మందిలో కనీసం 9 మంది శారీరక సమస్యల కారణంగా తిరస్కరించబడ్డారు. తర్వాత ఐఏఎఫ్ మరో 36 మందిని తాజాగా బ్యాచీగా ఎంచుకుని కావలసిన అయిదుమందిని వీరిలోంచి సెలెక్ట్ చేశారు. ఈ 12 మంది రెండేళ్లపాటు అత్యాధునిక శిక్షణ కార్యక్రమాల్లో పాలు పంచుకోనున్నారు.

వాస్తవానికి రోదసీయాత్రకు ఐఎఎఫ్ ఎంచుకున్న 60 మంది ఫిట్‌నెస్ విషయంలో అత్యున్నత స్థానంలో ఉన్నవారే. కానీ వీరిలో 12 మందిని మాత్రమే రష్యన్ నిపుణులు తీసుకున్నారు. అంటే రోదసీ యాత్ర శిక్షణ, అర్హత ఎంత కఠినంగా ఉంటాయో అర్థమవుతుంది కదా.

కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   8 hours ago


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   10 hours ago


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   14 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   16 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   19 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   19 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   20 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle