newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

తొలిదెబ్బ పడింది.. చైనా ప్రాజెక్టు రద్దు.. చైనా కంపెనీలపై కఠిన ఆంక్షలు

19-06-202019-06-2020 06:27:33 IST
Updated On 19-06-2020 11:14:25 ISTUpdated On 19-06-20202020-06-19T00:57:33.584Z19-06-2020 2020-06-19T00:57:29.624Z - 2020-06-19T05:44:25.186Z - 19-06-2020

తొలిదెబ్బ పడింది.. చైనా ప్రాజెక్టు రద్దు.. చైనా కంపెనీలపై కఠిన ఆంక్షలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత సైనికుల మరణానికి కారణమైన చైనాకు రైల్వే శాఖకు చెందిన డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(డీఎఫ్‌సీసీఐఎల్‌) గట్టి షాకిచ్చింది. రూ. 470 కోట్ల విలువైన ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే కాన్పూర్‌- దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ సెక్షన్‌ మధ్య 417 కిలోమీటర్ల పొడవు గల రైలు మార్గంలో సిగ్నలింగ్‌, టెలికమ్యూనికేషన్‌ సదుపాయాల కల్పనకై బీజింగ్‌ నేషనల్‌ రైల్వే రీసర్చ్‌, డిజైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిగ్నల్‌ అండ్‌ కమ్యూనికేషన్‌తో 2016లో డీఎఫ్‌సీసీఐఎల్‌  ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ కుదిరి నాలుగేళ్లవుతున్నా ఇంతవరకు 20 శాతం పనులు కూడా పూర్తికాలేదు. దీంతో చైనీస్‌ సంస్థ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎఫ్‌సీసీఐఎల్‌ కాంట్రాక్టును తాజాగా రద్దు చేసింది. 

ఈ విషయం గురించి అధికారులు మాట్లాడుతూ.. అగ్రిమెంట్‌ను ఖరారు చేసే సాంకేతికపరమైన పత్రాలను(టెక్నికల్‌ డాక్యుమెంట్లు) చైనీస్‌ సంస్థ ఇంతవరకు అందజేయలేదని వెల్లడించారు. అంతేగాకుండా సైట్‌ దగ్గరికి తమ ఇంజనీర్లు, అధికారులను ఒక్కసారి కూడా పంపలేదని తెలిపారు. ఈ విషయాల గురించి వివిధ స్థాయి అధికారులతో చర్చించినప్పటికీ ఎటువంటి సానుకూల స్పందన రాలేదన్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు రద్దు చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. కాగా గాల్వన్‌ లోయ ప్రాంతంలో జరిగిన చైనా దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో చైనాపై ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే డీఎఫ్‌సీసీఐఎల్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Indian Railways cancels Chinese company's contract worth Rs 470 Cr ...

ల‌ద్దాఖ్‌‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో జరిగిన దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో చైనాపై ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నట్లు సమాచారం. సోమవారం రాత్రి జరిగిన ఘటనతో ప్రస్తుతం భారతదేశంలోని చైనా వ్యాపారాలు, ప్రాజెక్టులు ఇబ్బందులు ఎదుర్కొబోతున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు వివాదం నేపథ్యంలో గతంలో చైనా వస్తువులను నిషేధించాలని పిలుపునిచ్చిన భారత పౌరులను ప్రభుత్వం శాంతింపజేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా 20 మంది భారతీయ సైనికులు మరణించడంతో ప్రభుత్వ వైఖరిలో మార్పు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.  ఈ క్రమంలో చైనాపై రెండు అంచెల ఆర్థిక ప్రతీకారానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 

మొదటగా ప్రత్యక్ష్య చర్యలో భాగంగా ఇక మీదట భారత్‌ ప్రాజెక్టులను చైనా కంపెనీలకు కేటాయించకూడదని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దాంతో చైనా కంపెనీల వాటాలు ఇబ్బందుల్లో పడతాయి. ఇప్పటికే కేటాయింపులు పూర్తైన ప్రాజెక్ట్‌ల విషయంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. ఈ చర్యల వల్ల మొదటగా ఇబ్బంది ఎదుర్కొనే చైనా కంపెనీ షాంగై టన్నెల్‌ ఇంజనీరింగ్‌ కో లిమిటెడ్‌(ఎస్‌టీఈసీ). ఈ కంపెనీ ఇప్పటికే ఢిల్లీ-మీరట్ ఆర్‌ఆర్‌టీఎస్ (రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్) ప్రాజెక్ట్‌ కోసం బిడ్‌ వేసింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం చైనా కంపెనీ అవకాశాలను దెబ్బతీసే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారి ఆంగ్ల మీడియాకు వెల్లడించారు.

ప్రాజెక్ట్‌ టెండరింగ్‌ అంశంలో భారత్‌ నిబంధనలను కఠినతరం చేస్తే.. స్వదేశీ కంపెనీలపై ఆ ప్రభావం పడుతుంది. ఇప్పటికే గతంలో పలు చైనా దిగ్గజ కంపెనీలు అతి తక్కువకు కోట్‌ చేస్తూ దేశీయ కంపెనీలకు పోటీగా నిలిచాయి. ఈ క్రమంలో ఓ సీనియర్‌ అధికారి మాట్లాడుతూ.. ‘దేశీయ కంపెనీలు ఈ ప్రాజెక్ట్‌లను దక్కించుకునేందుకు వీలుగా నియమాలను మార్చబోతున్నారు. టెండర్ల విషయంలో అమలు చేసే టెక్నికల్‌ నిబంధనలను మరోసారి సమీక్షించనున్నారు. అదే విధంగా బిడ్లలో చైనా కంపెనీలను గుర్తించేలా మార్పులు చేయబోతున్నారు. అలానే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజీనెస్‌లో భాగంగా చైనాకు కల్పించిన అవకాశాలను తగ్గించాలని’ చూస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌ సరిహద్దు దేశాల ఎఫ్‌డీఐ నిబంధనలను సవరించిన సంగతి తెలిసిందే.

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   4 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   7 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   20 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle