newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలుగు రాష్ట్రాల మీదుగా రైళ్ళ పరుగులు.. కరోనా కట్టడి సాధ్యమేనా?

12-05-202012-05-2020 10:35:13 IST
Updated On 12-05-2020 10:48:05 ISTUpdated On 12-05-20202020-05-12T05:05:13.882Z12-05-2020 2020-05-12T05:05:07.217Z - 2020-05-12T05:18:05.220Z - 12-05-2020

తెలుగు రాష్ట్రాల మీదుగా  రైళ్ళ పరుగులు.. కరోనా కట్టడి సాధ్యమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో లాక్ డౌన్ ప్రారంభం అయి 50 రోజులవుతోంది. ప్రస్తుతం మూడవ దశ లాక్ డౌన్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో రైళ్ళ పునరుద్దరణకు శ్రీకారం చుడుతున్నారు. తొలిదశలో 15పెద్ద నగరాల్ని అనుసంధానిస్తూ రైళ్ళు నడపాలని నిర్ణయించారు. వాస్తవానికిది మూడో విడత లాక్‌డౌన్‌ విరమణకు ఐదు రోజుల ముందే మొదలౌతోంది.

కరోనా విస్తృతంగా ఉన్న కలకత్తా, ముంబయ్‌, అహ్మదాబాద్‌, బెంగుళూరు, పాట్నా, చెన్నై నగరాలకు కూడా ఈ రైళ్ళు నడపాలని నిర్ణయించారు. అలాగే మే 15నుంచి బదరీనాధ్‌ క్షేత్రానికి పరిమిత సంఖ్యలో భక్తుల్ని అనుమతించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. మూడో విడత ముగియగానే ఢిల్లిdలో ఉద్యానవనాల్ని తెరవనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రాలన్నీ గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్ల పరిధిలో బస్సుల నిర్వహణకు సమాయత్తమౌతున్నాయి. ఈ విధంగా కరోనాతో కలసి సహజీవనం చేసేందుకు భారత సమాజం సిద్దపడుతోంది. ఈ విషయాన్ని సోమవారం ప్రధాని మోడి ముఖ్యమంత్రుల్తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టమైంది. దాదాపు ముఖ్యమంత్రులంతా షరతులతో కూడిన ఉపసంహరణకే మొగ్గుచూపించారు.

ఇప్పటికే లాక్ డౌన్ ప్ర‌భావంతో దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వ‌లస కార్మికులు, కూలీల‌ను ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకొస్తోంది. ఇందుకోసం రైల్వే శాఖ ప్ర‌త్యేక రైళ్ల‌ను ఏర్పాటు చేసింది. గోవా నుంచి 1055 మంది ప్ర‌యాణికులతో ప్ర‌త్యేక రైలు జ‌మ్మూక‌శ్మీర్ లోని ఉధంపూర్ కు బ‌య‌లుదేరింది. అధికారులు ప్ర‌యాణికులంద‌రికీ రైల్వే స్టేష‌న్ లో స్క్రీనింగ్ నిర్వ‌హించి..శానిటైజేష‌న్ పూర్తి చేశారు. రైలు కోచ్ ల‌ను శానిటైజ్ చేశారు. ప్ర‌యాణికులంద‌రికీ ఫేస్ మాస్కుల‌ను అంద‌జేశారు. స్వ‌స్థ‌లాల‌కు చేరుకున్న వారంతా క్వారంటైన్ లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ మీదుగా నడిచే రైళ్లను రైల్వే అధికారులు ప్లాన్‌ చేశారు. అందులో తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వివరాలు వెల్లడించింది రైల్వేశాఖ. 

బెంగళూరు–న్యూఢిల్లీ రూట్లో ట్రైన్‌ నెంబర్‌: 02691, డైలీ సర్వీస్ 

హాల్ట్ స్టేషన్లు: అనంతపురం, గుంతకల్లు జంక్షన్, సికింద్రాబాద్‌ జంక్షన్, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ

ప్రారంభం: 12.05.2020

న్యూఢిల్లీ–బెంగళూరు మార్గంలో ట్రైన్‌ నెంబర్‌: 02692, డైలీ సర్వీస్ 

హాల్ట్ స్టేషన్లు: ఝాన్సీ, భోపాల్, నాగ్‌పూర్, సికింద్రాబాద్‌ జంక్షన్, గుంతకల్లు జంక్షన్, అనంతపురం

ప్రారంభం: 12.05.2020

చెన్నై సెంట్రల్‌–న్యూఢిల్లీ మార్గంలో  ట్రైన్‌ నెంబర్‌: 02433, శుక్రవారం, ఆదివారం

హాల్ట్ స్టేషన్లు: విజయవాడ, వరంగల్లు, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా

ప్రారంభం: 15.05.2020

న్యూఢిల్లీ–చెన్నై సెంట్రల్‌ మార్గంలో ట్రైన్‌ నెంబర్‌: 02434, బుధవారం, శుక్రవారం

హాల్ట్ స్టేషన్లు: ఆగ్రా, ఝాన్సీ, భోపాల్, నాగ్‌పూర్, వరంగల్లు, విజయవాడ

ప్రారంభం: 13.05.2020

సికింద్రాబాద్‌–న్యూఢిల్లీ మార్గంలో ట్రైన్‌ నెంబర్‌: 02437, బుధవారం

హాల్ట్ స్టేషన్లు:  నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ

ప్రారంభం: 20.05.2020

న్యూఢిల్లీ–సికింద్రాబాద్‌ మార్గంలో ట్రైన్‌ నెంబర్‌: 02438, ఆదివారం 

హాల్ట్ స్టేషన్లు: ఝాన్సీ, భోపాల్, నాగ్‌పూర్

ప్రారంభం:17.05.2020

 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   13 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   14 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle