newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తెరుచుకున్న కేదార్ నాథ్ గుడి తలుపులు

29-04-202029-04-2020 09:21:09 IST
Updated On 29-04-2020 10:16:45 ISTUpdated On 29-04-20202020-04-29T03:51:09.028Z29-04-2020 2020-04-29T03:50:25.892Z - 2020-04-29T04:46:45.748Z - 29-04-2020

తెరుచుకున్న కేదార్ నాథ్ గుడి తలుపులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కారణంగా దేశంలో ఆలయాలు మూతబడ్డాయి. భక్తులు రాక లేకుండాపోయింది. ఎట్టకేలకు బుధవారం ఉదయం 6 గంటల 10 నిమిషాలకు కేదార్ నాథ్ గుడి తలుపులు తెరుచుకున్నాయి. మంచుతో కప్పబడి పోయిన గుడి వెలుపల ప్రదేశాలతో వాతావరణం మనోహరంగా వుంది.  కరోనా వైరస్ కారణం వలన ఆర్మీ అధికారులు గుడి ప్రధాన అర్చకులు మాత్రమే ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి  13,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. చార్ థామ్ లలోని రెండు పుణ్యక్షేత్రాలు కేదార్ నాథ్, బదరీ నాథ్ ఆలయాలను తెరవాలని గతంలో నిర్ణయించారు. 

Image

ఈ నెల 29వ తేదీన కేదార్ నాథ్ ఆలయాన్ని, 30న బదరీనాథ్ ఆలయాన్ని తెరవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. అయితే, కేదార్ నాథ్ ఆలయ ప్రధాన అర్చకుడు మహారాష్ట్రలో, బదరీ నాథ్ ఆలయ ప్రధాన అర్చకుడు కేరళలో ఉన్నారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో  ఆయా ఆలయాల ప్రధాన అర్చకులను రప్పించే నిమిత్తం  ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఉత్పల్ కుమార్ సింగ్ చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు ఓ లేఖ రాశారు. ఆ అర్చకులను రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. హోంశాఖ అనుమతివ్వడంతో వారి రాకకు అడ్డంకులు తొలగిపోయాయి. 

Image

ఇదిలా వుంటే ఐదుగురు భక్తులు... ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ కేదార్‌నాథ్ ఆలయానికి పంచముఖీ స్వామి పల్లకీ మోస్తూ బయలుదేరిన ఫోటోలు ట్విట్టర్లో హల్ చల్ చేస్తున్నాయి. కాళ్ళకు చెప్పులు లేకుండా భక్తులు పది అడుగుల ఎత్తున్న మంచులో స్వామివారి పల్లకిని మోయాలంటే ఎంతో ఫిట్ నెస్ అవసరం. ఏటా మంచుకురిసే చలికాలంలో... ఆలయాన్ని మూసివేస్తుంటారు.

ఆ సమయంలో 12 వందల ఏళ్ల నాటి ఈ పురాతన ఆలయం పూర్తిగా మంచుతో కప్పుకుపోతుంది. ఈ ఏడు కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నా యథావిధిగా పూజలు నిర్వహించేందుకు సన్నద్ధం అయ్యారు భక్తులు. ఏటా నిర్వహించే పంచముఖి డోలీ యాత్రలో వందలాదిమంది భక్తులు పాల్గొంటారు. కానీ కరోనా ఆంక్షలతో ఐదుగురే పాల్గొన్నారు.  ఆర్మీలోని కుమావో బెటాలియన్ ఏటా దీన్ని నిర్వహిస్తోంది.ఉత్తరాఖండ్‌లోని నాలుగు ఆలయాల్లో జరిగే ఛార్‌ధామ్ యాత్రలో ఏటా వేల మంది భక్తులు పాల్గొంటారు. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల్ని తిరిగి తెరవాలని భక్తులు కోరుతున్నారు. అందులో భాగంగా తొలుత కేదార్ నాథ్ గుడి తలుపులు తెరిచారు. 

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   an hour ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   4 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   4 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   5 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   05-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle