newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

తెరపైకి మళ్ళీ లాక్ డౌన్.. యూపీ, మహారాష్ట్రల్లో ....

11-07-202011-07-2020 08:41:55 IST
Updated On 11-07-2020 17:17:42 ISTUpdated On 11-07-20202020-07-11T03:11:55.128Z11-07-2020 2020-07-11T03:11:18.338Z - 2020-07-11T11:47:42.695Z - 11-07-2020

తెరపైకి మళ్ళీ లాక్ డౌన్.. యూపీ, మహారాష్ట్రల్లో ....
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోవడం, మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ తెరమీదకు లాక్ డౌన్ నిబంధనలు వచ్చాయి. దేశంలోనే మహారాష్ట్ర కరోనా వైరస్‌ కేసుల సంఖ్యలో ప్రథమ స్థానంలో ఉంది. ముంబై, పుణె వంటి ప్రాంతాల్లో మొత్తం కరోనా కేసులు సంఖ్య చైనాలోని కరోనా కేసులను కూడా దాటేశాయి. దీంతో మహారాష్ట్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 11 రోజుల పాటు పుణె, వాటి పరిసర ప్రాంతంలో పూర్తి లాక్‌డౌన్‌ను విధించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

జూలై 13-23వరకు ఈ ప్రాంతాలలో పూర్తి  లాక్‌డౌన్‌ను విధిస్తారు. ప్రతి రోజూ ఇంచుమించు 1803 కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ జిల్లాలో మొత్తం కేసులు 34,399కి  చేరుకోగా, చనిపోయిన వారి సంఖ్య 978కు చేరుకుంది. ఈ ప్రాంతంలో లాక్‌డౌన్‌ విధించిన 11రోజుల పాటు నిత్యవసర సరుకుల దుకాణాలు మినహా ఇంకేమీ పనిచేయమని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ఈ లాక్‌డౌన్‌ ద్వారా ఈ కరోనా వైరస్‌ చైన్‌ను వీడదీయవచ్చు అని ఆయన చెప్పారు. నిబంధనలు కఠినంగా అమలుచేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. 

ఇటు యూపీలోనూ కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. దీంతో సోమవారం జూలై 13వ తేదీ ఉద‌యం ఐదు గంట‌ల వ‌ర‌కు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉంటుంద‌ని యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అత్య‌వ‌స‌ర సేవ‌లు మిన‌హా ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాలన్నింటినీ మూసివేయనున్నారు. అయితే రైళ్లు, విమాన‌యాన స‌ర్వీసులు మాత్రం య‌ధావిధిగా కొన‌సాగుతాయ‌ని పేర్కొన్నారు. 

అంతేకాకుండా ర‌హ‌దారి నిర్మాణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని క‌ర్మాగారాల‌కు కూడా అనుమ‌తినిస్తూ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు జారీ  చేసింది. దేశ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు న‌మోద‌వుతున్న  రాష్ట్రాల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కూడా వుంది. ఈ నేప‌థ్యంలో కరోనా వైరస్ టెస్టుల సామ‌ర్థ్యాన్ని మ‌రింత పెంచాల‌ని సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు. దీంతో యూపీలో క‌రోనా టెస్టులు పెంచనున్నట్టు తెలుస్తోంది. కేరళలోనూ కరోనా తీవ్రత మళ్లీ పెరిగింది.

తిరువనంతపురంలోని పూంతురా ప్రాంతంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో నివాసం ఉండే వారందరిని హోం క్వారంటైన్ చేశారు. అక్కడ ఆంక్షలు విధించడంతోపాటు కమాండోలను మోహరించారు. మరోవైపు తమకు వైద్య సదుపాయాలు అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ ప్రాంత వాసులు ఆందోళనకు దిగారు.

కేరళలో కొత్తగా 339 కరోనా పాజిటివ్ కేసులు కేరళలో నమోదైనట్లు సీఎం పినరయ్ విజయన్ తెలిపారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి కేరళలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,534కు చేరింది. కేరళలో సామాజిక వ్యాప్తి ముప్పు పొంచి ఉందని, ఆ దశకు అతి దగ్గర్లో ఉన్నామని సీఎం పినరయ్ విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2,295. ఇప్పటివరకూ 3,710 మంది కేరళలో కరోనా నుంచి కోలుకున్నారు. మనదేశంతో పాటు కరోనా తీవ్రంగా వున్న దేశాల్లోనూ మళ్ళీ స్వల్పంగా లాక్ డౌన్ విధిస్తున్నారు. 

 

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   6 hours ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   14 hours ago


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   16 hours ago


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   03-08-2020


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   02-08-2020


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle