newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

తీవ్రతుపానుగా మారుతున్న నిసర్గ.. ముంబై‌లో రెడ్ అలర్ట్

03-06-202003-06-2020 12:04:01 IST
Updated On 03-06-2020 15:45:47 ISTUpdated On 03-06-20202020-06-03T06:34:01.204Z03-06-2020 2020-06-03T06:33:38.283Z - 2020-06-03T10:15:47.004Z - 03-06-2020

తీవ్రతుపానుగా మారుతున్న నిసర్గ.. ముంబై‌లో రెడ్ అలర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తూర్పుమధ్య అరేబియా సముద్రంలో ఉన్న వాయుగుండం మంగళవారం నిసర్గ తుపానుగా మారింది. ఇది మధ్యాహ్నానికి ముంబైకి 380 కిలోమీటర్ల దక్షిణ నైరుతిగా కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఈ క్రమంలో కొంత సమయం ఉత్తరంగా తరువాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా పయనించి బుధవారం మధ్యాహ్నం ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని అలీబాగ్‌కు సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. 

ఆ సమయంలో గంటకు 110- 120కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. తుఫాన్‌ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడు, కర్ణాటకలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని పేర్కొంది. కాగా ఈనెల 8 లేదా 9న ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. దీని ప్రభావంతో రుతుపవనాలు ఏపీలో ప్రవేశిస్తాయని అంచనా వేశారు.

దీని ప్రభావం ముంబైపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.  ఇది పెను తుపానుగా మారే అవకాశం ఉండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ ట్వీట్ చేశారు. భారత దేశ పశ్చిమ తీరంలో కొన్ని ప్రాంతాల్లో తుపాను పరిస్థితుల నేపథ్యంలో అన్ని వివరాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అందరూ సాధ్యమైన ముందు జాగ్రత్తలు, రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరారు.

ఈ తుపాను వల్ల మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలపై తీవ్రంగా ఉంటుంది. ముంబైలో పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. బొరివలి, దాదర్, బాంద్రా, అంధేరీ వెస్ట్, పరేల్, ములుంద్‌లలో కూడా జల్లులు కురిశాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కార్యాలయం మంగళవారం ఉదయం ఓ ప్రకటనలో నిసర్గ తుపాను వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. జాతీయ విపత్తు స్పందన దళానికి చెందిన 10 బృందాలను తీర ప్రాంతాల్లో మోహరించినట్లు తెలిపింది. 

ఈ తుపాను ప్రస్తుతం అలిబాగ్ కు నైరుతి దిశగా 95 కిలోమీటర్లు, ముంబై నుంచి పశ్చిమ-నైరుతి దిశలో150 కిలోమీటర్లు, సూరత్ కి దక్షిణ నైరుతికి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీ కృతమయి వుంది. ఈనేపథ్యంలో ముంబైకి రెడ్ అలర్ట్ నోటీసులు జారీచేసింది ఐఎండీ. రాజ్ గడ్ ప్రాంతంలో వందలాదిమందిని రిలీఫ్ క్యాంప్ లకు తరలించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో లక్షా 50 వేలమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 

 

 

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   6 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   9 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle