newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

తీర్పు ఒకరి విజయం కాదు మరొకరి పరాజయం కాదు: మోదీ

09-11-201909-11-2019 09:09:14 IST
2019-11-09T03:39:14.195Z09-11-2019 2019-11-09T03:39:00.687Z - - 11-08-2020

 తీర్పు ఒకరి విజయం కాదు మరొకరి పరాజయం కాదు: మోదీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అయోధ్యపై సుప్రీం కోర్టు తుది తీర్పు, తీర్పు తర్వాత సమాజంలో శాంతి నెలకొనేలా యావత్ దేశం కలిసి మెలిసి నిలబడదామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శనివారం తీర్పు నేపథ్యంలో శుక్రవారం పొద్దు పోయేదాకా ట్వీట్ల మీద ట్వీట్లు చేసిన మోదీ సామరస్యం దేశమతం కావాలని అభిలషించారు. అయోధ్యపై వచ్చే తీర్పు ఏ వర్గానికి లాభమో, నష్టమో కాదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 

అయోధ్యపై సుప్రీం కోర్టు శనివారం తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. ఈ తీర్పు భారత దేశ శాంతి, ఐక్యత మరియు సద్భావన గొప్ప సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా అయోధ్యపై సుప్రీం వెలువరించే తీర్పు ఒకరి విజయంగా, మరొకరి అపజయంగా చూడరాదని ప్రజానీకానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

‘‘అయోధ్యపై రేపు తీర్పు వెలువడనుంది. కొన్ని రోజులుగా ఈ విషయం సుప్రీం కోర్టులో నిరంతరం వినబడుతోంది. దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఈ సమయంలో సమాజంలోని అన్ని వర్గాలు దేశంలో సద్భావన నెలకొనడానికి చేసిన కృషిని ఎంతో అభినందిస్తున్నాను’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పట్ల గౌరవాన్ని కాపాడేందుకు సమాజంలోని అన్ని సామాజిక, సాంస్కృతిక సంస్థలు కృషి చేస్తున్నాయని అన్నారు. 

సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్, జస్టిస్ ఎస్ఎ బాబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నేటి ఉదయం అయోధ్య లోని రామమందిరం - బాబ్రీ మసీదు వివాదంపై అంతిమతీర్పు చెప్పనుంది. 

తీర్పు వెలువడనున్న సందర్భంగా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కాలేజీలు, విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలను శనివారం నుంచి సోమవారం వరకు మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   3 hours ago

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   4 hours ago

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   6 hours ago

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   14 hours ago

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle