newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

తలారి దొరికాడు.. నిర్భయ హంతకులకు ఇక ఉరే!

12-12-201912-12-2019 09:26:17 IST
Updated On 12-12-2019 15:07:12 ISTUpdated On 12-12-20192019-12-12T03:56:17.196Z12-12-2019 2019-12-12T03:56:12.757Z - 2019-12-12T09:37:12.119Z - 12-12-2019

తలారి దొరికాడు.. నిర్భయ హంతకులకు ఇక ఉరే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిర్భయ హంతకులకు ఉరి శిక్ష ఖరారు కానుంది. ఎట్టకేలకు అధికారులు తలారి కోసం చేసిన అన్వేషణ ఫలించింది. తీహార్ జైలులో ఉన్న నిర్భయ దోషులను ఉరి తీసేందుకు వీలుగా తలారీని పంపించాలని కోరుతూ తీహార్ జైలు అధికారులు ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టరు జనరల్ కు లేఖ రాశారు. దీంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జైళ్లలో పనిచేస్తున్న ఇద్దరు తలారీలో ఒకరిని పంపనున్నట్టు తెలుస్తోంది. 

మీరట్ జైలులో తలారీగా పనిచేస్తున్న పవన్ కుమార్ ను తీహార్ జైలులో నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించేందుకు వీలుగా తీహార్ జైలుకు యూపీ జైళ్ల శాఖ అధికారులు పంపనున్నారు.

మీరట్ జైలులో తలారీగా పనిచేస్తున్న పవన్ కుమార్ అనేకమందిని ఉరి తీసిన చరిత్ర ఉంది. దేశంలోనే ప్రొఫెషనల్ తలారీగా గుర్తింపు పొందాడు. మీరట్ జైలులో సీరియల్ కిల్లర్ సురేందర్ కోలిని ఉరి తీసింది కూడా పవన్ కుమారే. తలారి దొరకడంతో అధికారులు ఉరికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. 

నిర్భయ హంతకులను ఉరి తీయడానికి సిద్ధమని అనేకమంది లేఖలు కూడా రాసిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన ఎస్ సుభాష్ శ్రీనివాసన్ హెడ్ కానిస్టేబుల్ గా తలారీగా రావడానికి సంసిద్ధత వ్యక్తంచేస్తూ ఆ రాష్ట్ర  డీజీపీ, ఢిల్లీలోని తీహార్ జైలు అధికారులకు లేఖలు రాశాడు. 

అలాగే, సిమ్లాకు చెందిన రవికుమార్‌ నిర్భయ కేసులో దోషులకు త్వరగా ఉరి శిక్ష అమలు చేసేందుకు వీలుగా తిహార్‌ జైలులో తనను తాత్కాలిక తలారిగా నియమించాలని రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు లేఖ రాశాడు. 

ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ జైళ్శశాఖ డైరెక్టర్ ఆదేశాలతో పవన్ కుమార్ నిర్భయ నిందితులను ఉరితీయడానికి రెడీ అవుతున్నాడు. తెలంగాణలో దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత నిర్భయ నిందితులను ఉరితీయాలని డిమాండ్లు పెరిగిపోయాయి.

నిర్భయ తల్లి కూడా తన కూతురిని దారుణంగా హతమార్చిన హంతకులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. వారిని ఉరి తీస్తేనే నిర్భయ ఆత్మకు శాంతి కలుగుతుందని దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు వత్తిడి తెస్తున్నాయి. 

నిర్భయ హంతకులను ఉరి తీసేందుకు అవసరమైన తాళ్లని సిద్ధం చేయాల్సిందిగా తమకి ఆర్డర్స్ అందాయని బక్సర్ జైలు సిబ్బంది చెప్పారు. ఒక్కో ఉరితాడు తయారు చేయాలంటే మూడు రోజులు పడుతుంది. డిసెంబర్ 14నాటికి ఈ ఉరితాళ్లు సిద్ధంకానున్నాయి. 

 

 

 

 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   14 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   17 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle