newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

తమిళనాడు ఐడియా సూపర్

04-04-202004-04-2020 11:13:50 IST
2020-04-04T05:43:50.387Z04-04-2020 2020-04-04T05:43:25.219Z - - 12-08-2020

తమిళనాడు ఐడియా సూపర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంపై కరోనా పిడుగు పడింది. అన్ని రాష్ట్రాలు కరోనాతో యుద్ధం చేస్తున్నాయి. కరోనా అందరికీ కష్టాలు తెచ్చింది. కరోనావైరస్‌ తమిళనాడును అతలాకుతలం చేస్తోంది. దేశంలోనే అత్యధిక కేసులు నమోదయిన రెండవ రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. గంట గంటకు కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 102 కేసులుబయటపడ్డాయి. పాజిటీవ్‌ కేసులు సంఖ్య మొత్తం 411కు పెరిగింది. ఈ వైరస్‌లక్షణాలతో 1,580 మంది వైద్య నిఘాలో ఉన్నారు.  దేశం మొత్తం మీద పాజిటీవ్‌ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు రెండో స్థానానికి చేరుకోవడం ఆందోళనకరంగా మారింది.

తమిళనాడులో మొత్తం 37 జిల్లాలకు గాను 26 జిల్లాల్లో కరోనా వ్యాపించి ఉండగా, గణాంకాలను బట్టి అన్ని జిల్లాలకు ఈ వైరస్‌ వ్యాప్తి చెందేపరిస్థితి ఉందని ప్రభు త్వం అంచనావేసింది. కరోనా వైరస్‌ కల్లోలిత రాష్ట్రంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 86,342 మంది గృహనిర్బంధంలో ఉన్నారు.  

లాక్ డౌన్ తో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. కూలీపని చేస్తే గానీ  రోజు గడవనివారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కప్పుడు పనుల కోసం పల్లెలు వదిలి పొట్టచేతబట్టుకుని పట్టణాలకు వచ్చినవారు... లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో తిరిగి ఆ పల్లెలకే చేరుకుంటున్నారు. అయితే, వీరిని అడ్డుకునేందేకు ప్రభుత్వాలు ప్రయత్నం చేసినా.. కొంతవరకే అడ్డుకోగలిగారు. మరోవైపు, ప్రజలకు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నాయి పలు రాష్ట్రాలు.

కిరాణా సరుకుల కోసం కొంత ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం.. కొత్త పథకం తీసుకొచ్చింది.. ప్రజల సౌకర్యార్ధం ప్రతి ఇంటికి చేరే విధంగా రూ.100లతో కూడిన కాయగూరల ప్యాకేజ్‌ పంపిణీని ప్రారంభించింది. ఈ పథకాన్ని మంత్రి ఎస్పీ వేలుమణి ప్రారంభించారు. కోయంబత్తూర్‌ మార్కెట్‌లో ప్రజల రద్దీ తగ్గించేందుకు రూ.100లకే 12 రకాల కాయగూరల ప్యాకేజ్‌ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

కోవై కార్పొరేషన్‌ పరిధిలోని ప్రాంతాల్లో వ్యాన్ల ద్వారా ఈ ప్యాకేజ్‌లను ప్రజల ఇళ్ల వద్దకు పంపిణీ చేస్తారు. ఉల్లిగడ్డలు, వంకాయలు , మునగకాడ, కొబ్బరికాయ, పచ్చిమిర్చి, ఆలుగడ్డలు ఇలా 12 రకాల కూరగాయల ప్యాక్ రూ.100కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అంటే, ప్రజలకు బయటకు వచ్చి మార్కెట్ల దగ్గర గుమ్మిగూడితే కరోనా మరింత విస్తరించే అవకాశం ఉంది. సామాజిక దూరంగా పాటించాలని చెప్పినా జనం రద్దీతో అవన్నీ వర్కవుట్ కావడం లేద.  మార్కెట్లు, బహిరంగ ప్రాంతాల్లో ప్రజల రద్దీని తగ్గించేందుకు ఈ పథకం బాగా దోహదపడుతుందంటున్నారు. ఈ పథకం మిగిలిన రాష్ట్రాలు కూడా పాటిస్తే కొంతలొ కొంత ఉపశమనం కలగడం ఖాయం. 

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle