newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

తగ్గిన ఢిల్లీ అల్లర్లు.. 38కి చేరిన మృతుల సంఖ్య

28-02-202028-02-2020 12:51:46 IST
2020-02-28T07:21:46.618Z28-02-2020 2020-02-28T07:21:37.375Z - - 29-11-2020

తగ్గిన ఢిల్లీ అల్లర్లు.. 38కి చేరిన మృతుల సంఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ రాజధానిలో హైటెన్షన్‌ కొనసాగుతోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య జరిగిన హింసాకాండలో మృతిచెందిన వారి సంఖ్య గురువారం నాటికి మరింత పెరిగింది. కొద్దిరోజుల క్రితం జరిగిన ఘర్షణల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఏడుగురు నేడు మరణించటంతో మృతుల సంఖ్య 31 నుంచి 38కు చేరింది. ఈ హింసాకాండలో దాదాపు 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు సీనియర్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు విషయాన్ని ధ్రువీకరించారు. 

కాగా, రెండు రోజుల పాటు తీవ్ర ఘర్షణలతో అట్టుడికిపోయిన ఈశాన్య ఢిల్లీలో బుధవారం గొడవలు సద్దుమణిగాయి. పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉన్నప్పటికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. అల్లర్ల ప్రభావిత ప్రాంతాలైన చాంద్‌ భాగ్‌, భజన్‌పుర, కజురీ ఖాస్‌లలో గురువారం పారిశుద్ధ కార్యక్రమాలు మొదలయ్యాయి. 

గత మూడు దశాబ్దాల డిల్లీ చరిత్రలో కనీవినీ  ఎరుగనిరీతిలో చెలరేగిన అల్లర్లకు బలైన వారి సంఖ్య 38కి చేరుకుంది. గురువారం నాటికే హింసాత్మక చర్యలు తగ్గుముఖం పట్టినప్పటికీ వేలాదిమంది ప్రజలు కోల్పోయిన తమ నివాసాలను, జీవితాలను మల్లీ పునర్నిర్మించుకోవడం మొదలెట్టారు. తీవ్రగాయాల పాలై ఆసుపత్రుల్లో చేరిన వారు కోలుకోని స్థితిలో చనిపోతుండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని తెలుస్తోంది.

కాగా తూర్పు ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన అన్ని ప్రాంతాల్లోనూ భద్రతా దళాలు మోహరించాయి. అయితే ఈ ఘర్షణల్లో బుల్లెట్‌ గాయాలు, కత్తులు, ఇతర ప్రాణాంతక ఆయుధాల కారణంగా అయిన గాయాల కన్నా.. తరుముకొస్తున్న దుండగుల బారి నుంచి తప్పించుకోవడం కోసం ఇళ్ల పై అంతస్తుల నుంచి దూకడం వల్ల చోటు చేసుకున్న గాయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు. 

కాగా, ఈశాన్య డిల్లీలో హింసాత్మక అల్లర్లు చెలరేగి ఇంతవరకు 38 మంది ప్రాణాలు బలిగొన్న నేపథ్యంలో అల్లర్లపై విచారణకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలును నియమించారు. డిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ సిట్ బృందాలు ఢిల్లీలో హింసాత్మక చర్యలకు సంబంధించిన కేసులు విచారణను తక్షణం ప్రారంభించాయి. 

ఇంతవరకు 18 ఎఫ్ఐఆర్ లను నమోదు చేసిన పోలీసులు 106 మంది అనుమానితులను అరెస్టు చేశారు. ఒక పోలీసు అధికారి దారుణ హత్యతో సహా 38 మంది మరణాలు ఢిల్లీ పోలీసులకు సవాలుగా నిలిచిన నేపధ్యంలో ప్రభుత్వం యంత్రాంగా సిట్ బృందాల ఏర్పాటుతో హింసాకాండ దర్యాప్తును సవాలుగా తీసుకుంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle