newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

ఢిల్లీ వర్శిటీలో పట్టుకోసం ఎన్ఎస్‌యుఐ ప్రయత్నం

22-06-201922-06-2019 20:45:21 IST
Updated On 24-06-2019 12:13:15 ISTUpdated On 24-06-20192019-06-22T15:15:21.039Z22-06-2019 2019-06-22T15:13:00.537Z - 2019-06-24T06:43:15.267Z - 24-06-2019

ఢిల్లీ వర్శిటీలో పట్టుకోసం ఎన్ఎస్‌యుఐ ప్రయత్నం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఢిల్లీ యూనివ‌ర్శిటీలో ప‌ట్టు కోసం కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేష‌న‌ల్ స్టూడెంట్స్ యూనియ‌న్ ఆఫ్ ఇండియా కొత్త ఎత్తుగ‌డ వేసింది. ఈ ఏడాది యూనివ‌ర్శిటీలో చేరే కొత్త విద్యార్ధుల ఫీజు త‌మ యూనియ‌న్ త‌ర‌పున క‌ట్టేస్తామ‌ని ప్ర‌క‌టించింది. కాక‌పోతే అంద‌రికీ కాకుండా అప్పుల బాధ‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబానికి చెందిన విద్యార్థినీ, విద్యార్థుల‌కూ, ఆర్మీలో వీర మ‌ర‌ణం పొందిన మాజీ సైనికుల పిల్ల‌ల‌కు ఫీజు మొత్తం తామే క‌ట్టేస్తామ‌ని ప్ర‌క‌టించింది ఎన్ఎస్‌యుఐ.

ఇదంతా ఎందుకంటే, రాహుల్ గాంధీ పుట్టిన రోజు సంద‌ర్భంగా తాము ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆ విద్యార్థి సంఘం నేత‌లు చెబుతున్నారు. అయితే మొత్తం ఫీజు క‌ట్ట‌మ‌నీ, కేవ‌లం యూనివ‌ర్శిటీలో చేరిన త‌ర్వాత మొద‌టి సంవ‌త్స‌రం ఫీజు మాత్ర‌మే త‌మ విద్యార్థి సంఘం త‌ర‌పును క‌డ‌తామ‌ని నేష‌న‌ల్ స్టూడెంట్స్ యూనియ‌న్ ఆఫ్ ఇండియా నేత‌లు క్లారిటీ ఇస్తున్నారు. ఈ అవ‌కాశం పొందాల‌నుకునే వారు ఎన్ఎస్‌యుఐ  వెబ్ సైట్ ద్వారా త‌మ పేరు న‌మోదు చేసుకోవాల‌ని సూచిస్తున్నారు. 

అంద‌రి అప్లికేష‌న్లు ప‌రిశీలించిన త‌ర్వాత త‌మ క‌మిటీ ప‌రిశీలించి అర్హులైన వారికి మొద‌టి సంవ‌త్స‌రం ఫీజు చెల్లిస్తామ‌ని అంటున్నారు. అయితే బీజేపీ విద్యార్థి సంఘం అఖిల భార‌తీయ విద్యార్థి ప‌రిష‌త్ మ‌రో ర‌కంగా మాట్లాడుతోంది. ఒక సంవ‌త్స‌రం ఫీజు చెల్లించి చేతులు దులుపుకోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తోంది.

ఇలా ఫీజు ఓ ఏడాది చెల్లించేకంటే, ఒకే కోర్సు, ఒకే ఫీజు విధానాన్ని అమ‌ల్లోకి తేవాల‌ని డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం తాము చేస్తున్న పోరాటానికి స‌హ‌క‌రించాల‌ని ఏబీవీపీ నేత‌లు కోరుతున్నారు. వీళ్ల సంగ‌తేమో కానీ, ఒక సంవ‌త్స‌రం ఫీజు క‌ల్సి రావ‌డం చాలా మంది విద్యార్థుల‌కు సంతోషంగా ఉంద‌ట‌.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle