newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత

20-07-201920-07-2019 16:21:07 IST
Updated On 22-07-2019 12:50:14 ISTUpdated On 22-07-20192019-07-20T10:51:07.207Z20-07-2019 2019-07-20T10:51:02.117Z - 2019-07-22T07:20:14.344Z - 22-07-2019

ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 81ఏండ్ల షీలా దీక్షిత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

1998 నుంచి 2013 వరకు 15ఏండ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 మార్చి నుంచి 2014 ఆగస్టు వరకు కేరళ గవర్నర్‌గా కూడా కొనసాగారు. ఆమె ఆకాల మృతికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ..పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఢిల్లీ శాసనసభలో న్యూఢిల్లీ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహించారు. షీలా దీక్షిత్ ఒక పంజాబీ ఖత్రి కుటుంబంలో భారతదేశం యొక్క పంజాబ్ రాష్ట్రంలో కపుర్తలలో జన్మించారు. ఈమె న్యూఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ స్కూల్ లో కాన్వెంట్ విద్యనభ్యసించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మిరాండా హౌస్ నుండి చరిత్రలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీలో పట్టభద్రులయ్యారు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావో జిల్లాకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) గా పనిచేసిన వినోద్ దీక్షిత్ తో ఆమెకు వివాహం జరిగింది. 1970 లలో ఢిల్లీలో మహిళల పని కోసం అత్యంత విజయవంతమైన వసతిగృహాలు రెండు ఏర్పాటుచేసేందుకు కృషిచేశారు. 1984 మరియు 1989 మధ్య కాలంలో, ఈమె ఉత్తరప్రదేశ్ కనౌజ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.

పార్లమెంట్ సభ్యురాలిగా, ఈమె లోక్ సభ అంచనాల కమిటీలో పనిచేశారు. సోనియా గాంధీకి అత్యంత నమస్తురాలైన నేతల్లో షీలా దీక్షిత్ ఒకరు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకోసం ఆమె ప్రయత్నం చేశారు. ఆమె మృతి కాంగ్రెస్ పార్టీకి, దేశానికి తీరని లోటని పలువురు తమ సంతాప సందేశాల్లో పేర్కొన్నారు. 

దేశంలో కరోనా కేసులు 23 లక్షలు.. 24 గంటల్లో 60 వేల కేసులు

దేశంలో కరోనా కేసులు 23 లక్షలు.. 24 గంటల్లో 60 వేల కేసులు

   12 hours ago


ట్రంప్ నెత్తిన హారిస్ పిడుగు.. అమెరికన్ భారతీయుల్లో ఆశలు

ట్రంప్ నెత్తిన హారిస్ పిడుగు.. అమెరికన్ భారతీయుల్లో ఆశలు

   16 hours ago


నాన్న ఆరోగ్యం ఇక భగవంతుడి ఇష్టమే.. ప్రణబ్ కుమార్తె ప్రకటన

నాన్న ఆరోగ్యం ఇక భగవంతుడి ఇష్టమే.. ప్రణబ్ కుమార్తె ప్రకటన

   19 hours ago


రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   12-08-2020


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12-08-2020


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   12-08-2020


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle