newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

ఢిల్లీ పీఠం ఎవరికి సొంతం .. ఎగ్జిట్ పోల్స్ ఆప్ వైపే!

09-02-202009-02-2020 09:00:07 IST
2020-02-09T03:30:07.550Z09-02-2020 2020-02-09T03:30:01.816Z - - 11-08-2020

ఢిల్లీ పీఠం ఎవరికి సొంతం .. ఎగ్జిట్ పోల్స్ ఆప్ వైపే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇజ్జత్ కా సవాల్ మారిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై చర్చ జరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వివిధ సంస్థలు కేజ్రీవాల్  వైపే మొగ్గుచూపాయి. న్యూస్ 18: ఆమ్‌ఆద్మీ పార్టీ 44, బీజేపీ 26, రిపబ్లిక్ టీవీ: ఆప్ 48 - 61, బీజేపీ 9 - 12, కాంగ్రెస్ 0 - 1, ఇండియా టీవీ: ఆప్ 44, బీజేపీ 26, టైమ్స్ నౌ: ఆప్‌ 44, బీజేపీ 26 సీట్లు వస్తాయని ప్రకటించాయి.

61.46శాతం పోలింగ్‌ నమోదైంది. ఢిల్లీలోని 11 జిల్లాలకు గాను ఈశాన్య ఢిల్లీలో అత్యధికంగా 65.24% పోలింగ్‌ నమోదు కాగా, న్యూఢిల్లీలో 56.10%, ఆగ్నేయ ఢిల్లీలో అత్యల్పంగా 54.89% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. సీఎం కేజ్రీవాల్‌ బరిలో ఉన్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో 42% మంది ఓటేశారు. గతంలో కంటే పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం గమనార్హం.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67.47% పోలింగ్‌ నమోదు కాగా, గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో 60.60% పోలింగ్‌ నమోదైంది.  పెట్రోలింగ్, క్విక్‌ రెస్పాన్స్‌ టీములు కలిపి 60వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాలకు ఈ నెల 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇటు కేజ్రీవాల్ హ్యాట్రిక్ విజయంపై ధీమాగా ఉండగా.. బీజేపీ నేతలు సైతం ఈసారి ఢిల్లీ పీఠం తమదే అంటున్నారు. లోక్ సభ ఎన్నికల అనంతరం జరిగిన ఈ ఎన్నికల్లో ప్రముఖులు ఓటేశారు.

రాష్ట్రపతి  కోవింద్, మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్‌ సింగ్‌ తదితరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆప్‌ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ రాజ్‌పూర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ పోలింగ్‌ కేంద్రంలో తల్లిదండ్రులతోపాటు భార్య సునీత, కొడుకు పుల్కిత్‌తో కలిసి వచ్చి ఓటు వేశారు.

ముందుగా ఆయన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రియాంకా గాంధీ కొడుకు రెహాన్, కేజ్రీవాల్‌ కొడుకు పుల్కిత్‌ మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   4 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   4 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   6 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   15 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle