newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

ఢిల్లీ పని అయిపోయిందా?.. కాలుష్యంతో బతకడం కష్టమేనా?

07-11-201907-11-2019 16:23:36 IST
Updated On 07-11-2019 16:23:34 ISTUpdated On 07-11-20192019-11-07T10:53:36.526Z07-11-2019 2019-11-07T10:51:41.513Z - 2019-11-07T10:53:34.656Z - 07-11-2019

ఢిల్లీ పని అయిపోయిందా?.. కాలుష్యంతో బతకడం కష్టమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నాగరిక ప్రభుత్వం ఏదీ ఇలా జీవించలేదు. మనుషుల ప్రాణాల పట్ల మనం చాలా తేలికభావంతో ఉన్నట్లుంది అంటూ సుప్రీంకోర్టు ఢిల్లీ సర్కారుపై, కేంద్రప్రభుత్వం తీరుపై మండిపడింది. పనిలోపనిగా రైతులు పంట వ్యర్థాలను విచ్చలవిడిగా తగులబెడుతుంటే ఏం చేస్తున్నారంటూ పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై ధ్వజమెత్తింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీలో కాలుష్యం తారాస్థాయికి పెరిగిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రభుత్వాల తీరుతెన్నులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

‘‘ఢిల్లీలో విమానాలను దారి మళ్లించాల్సి వస్తోంది. ప్రజలకు తమ ఇళ్లల్లోనే రక్షణ లేకుండా పోతోంది. ఇవన్నీ చూస్తే మీకు సిగ్గు వేయడం లేదా’’ అని ఢిల్లీ లో కేజ్రీవాల్ ప్రభుత్వంపై, కేంద్ర సర్కారుపై సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ప్రజల గురించి పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారంలో ఉండే హక్కే లేదని మండిపడింది. పశువుల ప్రాణాలు పోతే పట్టించుకునే ప్రభుత్వాలు... మనుషులు ప్రాణాలంటే అసలు లెక్కలేదా అని ప్రశ్నించింది. 

రైతుల నుంచి పంట వ్యర్థాలను సేకరించడమో, కొనుగోలు చేయడమో ఎందుకు చేయలేదని, ఈ విషయంలో పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు రెండూ పూర్తిగా విఫలమయ్యారని మండిపడింది. ప్రభుత్వ నిర్వాకాలకు గాను అధికారులను సైతం శిక్షించే సమయం వచ్చిందని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాలపై తీవ్రంగా మండిపడింది. ప్రతి యేడాది లాగే ఈ ఏడాది కూడా పంట వ్యర్థాలను తగలబెడతారని తెలుసని, అయినా ప్రభుత్వాలు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. పంట వ్యర్థాల దహనాన్ని ఎందుకు నివారించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

పంట వ్యర్థాలను పొలాల్లోనే తగులబెడుతున్నారంటూ రైతులను విమర్శించడం అందరికీ అలవాటుగా మారిపోయందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వాల వైఫల్యాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇకనుంచి పంట వ్యర్థాలను పొలాల్లో తగులబెట్టకుండా తగు ఏర్పాట్లను చేసి తీరాలని ఆదేశించింది. ఇకమీద ఏ రాష్ట్రంలో అయినా తన ఆదేశాలను ఉల్లంఘించినట్లు తేలితే కింది నుంచి పైస్థాయి దాకా అందరూ బాధ్యత పడాల్సిందేనని హెచ్చరించింది.

ప్రపంచ కాలుష్య నగరాల సూచిలో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉండటం, పొగకాలుష్యం కారణంగా విమానాలు దారి మళ్లించడం, లక్షలాది మంది నగరవాసులు ఊపిరాడక ఎయిర్ బ్రీతింగ్ ముసుగులను ధరించవలసి రావడంతో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. విలాస భవనాల్లో సురక్షితంగా కూర్చున్న మీకు సామాన్యుల ప్రాణాలు ఊపిరాడక పోతుంటే పట్టింపులేదా అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసింది.

సమావేశాలు ఇక చాలు.. ఇది పద్ధతి కాదు. ఈ కాలుష్యానికి, మరణాలకు ఎవరు బాధ్యులు, రాష్ట్రాల ప్రభుత్వాలే దీనికి బాధ్యత వహించాలి. ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం తప్ప ప్రభుత్వాలకు ఏదీ పట్టడం లేదు. ప్రజల ప్రాణాలు హరీమనడానికి ఇవే కారణం అంటూ సుప్రీం కోర్టు విరుచుకుపడింది. ఢిల్లీ మానవ నివాస యోగ్యం కాదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందంటే దేశరాజధాని దుస్థితి ఏంటో బోధపడుతుంది

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   10 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   21 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle