newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

ఢిల్లీ గరం గరం..సీఏఏపై కమల్ ఆగ్రహం

17-12-201917-12-2019 17:44:23 IST
Updated On 17-12-2019 17:49:27 ISTUpdated On 17-12-20192019-12-17T12:14:23.330Z17-12-2019 2019-12-17T12:14:18.058Z - 2019-12-17T12:19:27.783Z - 17-12-2019

ఢిల్లీ గరం గరం..సీఏఏపై కమల్ ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక్క బిల్లు చట్టంగా మారి దేశమంతా ఊపేస్తోంది. పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు కొనసాగుతున్నాయి. బస్సులు తగులబెట్టడం, పోలీసులపైకి రాళ్ళు రువ్వడం వంటి ఘటనలు జరుగుతూనే వున్నాయి. జఫ్రాబాద్‌ ప్రాంతంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చెలరేగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. దీంతో పలువురు గాయపడ్డారు. విద్యార్ధుల నిరసన ప్రదర్శన నేపథ్యంలో సీలంపూర్‌ నుంచి జఫ్రాబాద్‌ రహదారిపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. మరోవైపు వెల్‌కం, జఫ్రాబాద్‌, మౌజ్‌పూర్‌-బబర్పూర్‌ మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్లను మూసివేశారు. విపక్షాలు అనవసరంగా ముస్లింలలో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయని ప్రధాని మోడీ మండిపడ్డారు. 

పౌరసత్వ చట్టం వల్ల దేశంలోని ఏ పౌరుడికి నష్టం, ఎలాంటి ఇబ్బంది కలగదన్నారు. మంగళవారం జార్ఖండ్ ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. కాంగ్రెస్, ఇతర విపక్షాల తీరుని ఆయన తప్పుబట్టారు. మరోవైపు విద్యార్ధులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. దేశంలో డెమోక్రసీ ఐసీయూలో ఉందన్నారు కమల్. 

‘‘రాజకీయాలను అర్థం చేసుకుని విద్యార్ధులు ప్రశ్నించాల్సిన అవసరం వుంది. అయితే ప్రశ్నల్ని అణచివేయాలని చూస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టే అన్నారు. ఇది దేశవ్యాప్తంగా చర్చించాల్సిన అంశం ఇదే’’ అన్నారు కమల్.

Image result for kamal haasan

చెన్నైలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో అధికారపక్షమయిన అన్నాడీఎంకె తీరుపై ఆయన మండిపడ్డారు. సీఏఏకి మద్దతు తెలపడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇదిలా ఉంటే పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా డీఎంకె కాంచీపురంలో భారీదీక్షకు దిగింది. ఈ సందర్భంగా స్టాలిన్ కేంద్రం తీరుపై మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం నిర్ణయాలన్నీ వివాదాలకు కారణం అవుతున్నాయన్నారు. 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   13 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle